Tamannah Bhatia లవర్‌ను టై పట్టుకొని ఈడ్చుకెళ్లిన తమన్నా..అందరి ముందే మిల్కీ బ్యూటీ అంత పని చేసిందేమిటి?
ముంబైలో జరుగుతున్న జియో వరల్డ్ ప్లాజా ఒపెనింగ్ నైట్ కార్యక్రమం బాలీవుడ్ తారలతో కళకళలాడుతున్నది. ఈ వేడుకలో బాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లు, సాంకేతిక నిపుణులు, పారిశ్రామిక వర్గాలు హాజరు కావడంతో భారీ స్పందన లభిస్తున్నది. ఈ వేడుకలో భాగంగా నిర్వహించిన ర్యాంప్ వాక్ సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జియో వరల్డ్ ప్లాజా ఓపెనింగ్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
జియో వరల్డ్ ప్లాజా ఓపెనింగ్స్ వేడుకలకు సల్మాన్ ఖాన్, ప్రియాంక చోప్రా జోనస్, సారా ఆలీ ఖాన్, రణ్‌వీర్ సింగ్, తమన్నా భాటియా, షెషనాజ్ గిల్, విజయ్ వర్మ, కరీనా కపూర్, రష్మిక మందన్న, శ్రీదేవీ కూతురు ఖుషీ కపూర్ తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకలకు భారీగా ప్రముఖులు తరలివచ్చారు.

జియో వరల్డ్ ప్లాజా ఓపెనింగ్ కార్యక్రమంలో బాలీవుడ్ బర్డ్స్ తమన్నా భాటియా, విజయ్ వర్మ ప్రత్యేక ఆకర్షణగా మారారు. వారిద్దరూ చెట్టాపట్టాలు వేసుకొని వేదికపై హల్‌చల్ చేశారు. తమన్నా, విజయ్ వర్మ మధ్య కెమిస్ట్రీని కెమెరామెన్లు బంధించడానికి పోటీ పడ్డారు. వారిద్దరూ సిగ్గుపడుతూనే చేతిలో చేయి వేసుకొని మీడియాను ఆకర్షించారు.

ఇక ర్యాంప్ వాక్‌లో భాగంగా తమన్నా భాటియా, విజయ్ వర్మ హడావిడి సృష్టించారు. వారిద్దరూ ర్యాంప్ వాక్ చేస్తూ అందర్నీ ఆకట్టుకొన్నారు. విజయ్ వర్మ మెడలోని టైని పట్టుకొని తమన్నా అతడిని లాగుతూ ముందుకు తీసుకెళ్లడం అందర్నీ నవ్వుల్లో ముంచెత్తింది. తమన్నా అలా టై పట్టుకొని ఈడ్చుకుపోవడాన్ని కెమెరాలు క్లిక్ మనిపించాయి. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇక తమన్నా తన టై పట్టుకొని లాగుతూ ర్యాంప్‌పై వాక్ చేస్తుండగా.. విజయ్ వర్మ ఓపికగా, వినయంగా ఆమె వెనుక వెళ్లడంపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. పెళ్లి కాకముందే అంత వినయం అవసరమా? అని కామెంట్లు పెడుతున్నారు. తమన్నా, విజయ్ వర్మ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా, తమన్నా భాటియా,విజయ్ వర్మ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గోవాలో డేటింగ్ చేస్తూ మీడియాకు చిక్కడంతో వారిద్దరూ డేటింగ్ చేస్తున్నట్టు స్పష్టమైంది.అప్పటి నుంచి వారిద్దరూ ముంబై వీధుల్లో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. త్వరలోనే ఏదైనా శుభవార్త చెబుతారేమోనని అభిమానులు ఆశపడుతున్నారు.


Click it and Unblock the Notifications











