ఆ ప్రపోజల్ ను తమన్నా ముందు రిజెక్ట్ చేసిందా?

ఒకప్పుడు సౌత్ ఇండియా సినిమాని ఏలి ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో బిజీగా మారిపోయిన స్టార్ హీరోయిన్స్ కొందరు ఉన్నారు. కొన్నేళ్ల కితం వరకు తమ మార్కెట్ ని సౌత్ లోనే పరిమితం చేసుకొని ఇప్పుడు నార్త్ లో కూడా పాగా వేసి ఎలాంటి రోల్స్ కి అయినా కూడా రెడీ అంటున్నారు. మరి ఇదిలా ఉండగా ఇలా సౌత్ నుంచి వెళ్లి పాన్ ఇండియా మార్కెట్ లో సెటిల్ అయ్యిపోయిన హీరోయిన్స్ లో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఒకరు అని చెప్పాలి.

తమన్నా తెలుగు సహా తమిళ్ లో ఎన్నో సినిమాలు చేసి ఇక్కడ స్టార్ స్టేటస్ ని అనుభవించింది. ఆ తర్వాత హిందీ అవకాశాలు కోసం బాలీవుడ్ మార్కెట్ కి వెళ్లి అక్కడ హీరోయిన్ గా క్లిక్ అవ్వకపోయినా పలు బోల్డ్ అవకాశాలు వెబ్ సిరీస్ లలో అందుకొని షాకింగ్ రోల్స్ చేసి తమన్నాలో ఈ కోణం కూడా ఉందా అనేలా ఆశ్చర్యపరిచింది.

tamannah comments on stree 2 special song she felt depressed with jailer song

కాగా బాలీవుడ్ లో కేవలం ఇలా బోల్డ్ వెబ్ సిరీస్ లు మాత్రమే కాకుండా తమన్నా పలు హాట్ ఐటెం సాంగ్స్ లో కూడా మెరిసి తన గ్లామర్ షోతో ఎంతగానో మెస్మరైజ్ చేసింది. అయితే రీసెంట్ గా బాలీవుడ్ మార్కెట్ లో ఈమె చేసిన సెన్సేషనల్ సాంగ్ ఇప్పుడు బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న "స్త్రీ 2" సినిమాలో ఉంది. మరి ఈ సినిమాలో నిలిచిన ఎన్నో హైలైట్స్ లో తమన్నా స్పెషల్ సాంగ్ కూడా ఒకటి.

కాగా ఇప్పుడు ఈ సాంగ్ విషయంలో ఈమె చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈ సాంగ్ విషయంలో తమన్నా చాలా అలోచించి స్టెప్ వేసిందట. దీనికి కారణం ఆమె అంతకు ముందు చేసిన హిట్ సాంగ్ "జైలర్" లో కావాలి సాంగ్ ఎఫెక్ట్ అట. ఆ సాంగ్ పెద్ద హెహిట్ కావడంతో తమన్నా నెక్స్ట్ ఎలాంటి సాంగ్స్ ఎంచుకోవాలి అనే అంశంలో ఒత్తిడికి లొనయ్యిందట.

దీనితో ఇలా తమన్నా తన దగ్గరకి స్త్రీ 2 లో సాంగ్ ఆఫర్ వస్తే ముందు వద్దనే అనుకుందట. కానీ ఒకవేళ ఒప్పుకోవాల్సి వస్తే ఆ సాంగ్ ఖచ్చితంగా హిట్ అయ్యి తీరేలా అనిపిస్తేనే చేస్తాను అని చెప్పిందట. దీనిపై మేకర్స్ ఆమెని కన్విన్స్ చేసి సాంగ్ ని ఎలాగో చేయించేసారు.. ఇక ఏముంది సీన్ కట్ చేస్తే ఆ సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్స్ లో తమన్నా సాంగ్ కూడా ఒకటిగా నిలిచింది.

tamannah comments on stree 2 special song she felt depressed with jailer song

ఆ సాంగ్ లో తమన్నా డాన్స్ మూమెంట్స్ కోసం కానీ ఆమె చూపించిన అందచందాలు కోసం కానీ ఇప్పటికీ సోషల్ మీడియాలో కొన్ని క్లిప్ లు వైరల్ గా మారుతున్నాయి. ఇలా తమన్నా కొంచెం డౌట్ గానే చేసిన సాంగ్ తో పెద్ద హిట్ ని కొట్టింది అని చెప్పాలి. ఇక ఈ హారర్ థ్రిల్లర్ స్త్రీ 2 సినిమాలో శ్రద్ధా కపూర్ ముఖ్య పాత్రలో నటించగా హిందీలో ఈ సినిమా స్టార్ హీరోల రికార్డుల లెక్కలు సైతం తుక్కు రేగ్గొడుతుంది.

More from Filmibeat

Read more about: tamannaah stree 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X