రాత్రికి రా.. కౌగిలిలో బంధిస్తే మజా ఏంటో .. విరహ వేదనతో రెచ్చిపోయిన తమన్నా

మిల్కి బ్యూటీ తమన్నా భాటియా ఇటీవల కాలంలో హీరోయిన్ వేషాల కంటే స్పెషల్ సాంగ్స్‌తోనే ఆమె తెర మీద సెగలు రేపుతున్నది. ఆమె స్టెప్పులేసిన పాటలు ఈ మధ్యకాలంలో ట్రెండింగ్‌గా నిలుస్తున్నాయి. దాంతో ఆమెను ఎక్కువగా స్పెషల్, ఐటెమ్ సాంగ్స్‌కే ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తున్నది. తాజాగా స్త్రీ 2 సినిమా కోసం తమన్నా చేసిన ఐటెమ్ సాంగ్ యూట్యూబ్‌లో సంచలనం రేపుతున్నది. తమన్నా స్పెషల్ సాంగ్స్, ఆజ్ కీ రాత్ పాట గురించిన వివరాల్లోకి వెళితే..

తమన్నా భాటియా ఇటీవల కాలంలో కథానాయిక పాత్రలకు దూరంగా ఉంటూ ఎక్కువగా గ్లామర్ రోల్స్‌కు ముఖ్యంగా పాటలకే పరిమితం అవుతున్నారు. 40 ఏళ్ల వయసులో శృంగారాలు, వయ్యారాలకు స్కోప్ ఉన్న క్యారెక్టర్లకు మొగ్గు చూపుతున్నారనేది సినీ వర్గాల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

Tamannnaah Bhatia s Aaj Ki Raat Song trending Milky Beauty sizzles in Stree 2 Special Number

హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలతో సినిమాలు చేసిన తమన్నాకు ఎదురు దెబ్బ తగిలింది. మ్యాస్ట్రో, బబ్లి బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బీ, గుర్తుందా శీతాకాలం సినిమాలు ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేదు. దాంతో ఆమె లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్‌లో హాట్ హాట్‌గా నటించి మళ్లీ ట్రాక్‌పైకి వచ్చింది.

గత కొద్దికాలంగా ఆమె జైలర్, అరణ్మనై సినిమాల్లో నటించిన సన్నివేశాలు, పాటలు హాట్ టాపిక్‌గా మారాయి. జైలర్‌లోని పాట ఇండియా మొత్తాన్ని షేక్ చేసింది. ఆ తర్వాత ఆమె ప్రస్తుతం స్త్రీ 2 సినిమాలో చేసిన ఆజ్ కీ రాత్ పాట అందరి నోట చర్చనీయాంశమైంది. ఆ పాటలో పలికించిన వయ్యారాలు యూత్‌ను కిర్రాక్‌కు గురి చేస్తున్నాయి.

Tamannnaah Bhatia s Aaj Ki Raat Song trending Milky Beauty sizzles in Stree 2 Special Number

బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన స్త్రీ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న స్త్రీ 2 సినిమాలో తమన్నా భాటియా ఓ మెరుపు పాటలో నర్తించింది. ఆగస్టు 15న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలోని పాట ట్రెండింగ్‌గా మారింది. నా కోసం కొంత సమయం కేటాయించి.. వలుపులతో నన్ను కౌగిలిలో బంధించు.. ఈ రాత్రికి మజా ఏంటో నీకే తెలుస్తుంది అంటూ సాగే పాటలో తమన్నా శృంగార లయలు, హాట్ తనం మస్తు మస్తుగా ఆకట్టుకొంటున్నది.

తమన్నా కెరీర్ విషయానికి వస్తే.. భోళా శంకర్, బాంద్రా, అరణ్మనై 4 సినిమాల తర్వాత బిజీ బిజీగా మారింది. ప్రస్తుతం వేదా, స్త్రీ 2, ఓదెల 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇక కొన్ని రోజుల్లో విడుదల కానున్న స్త్రీ 2 సినిమాలో తమన్నా ఏ రేంజ్‌లో మెప్పించిందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X