యంగ్ హీరోయిన్ ఆత్మహత్య,... బాయ్ ఫ్రెండ్ కాల్, కారణం అదేనా?

తమిళ హీరోయిన్ రియామికా ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమిళనాడులోని వలసరవాక్కమ్‌లోని తన నివాసంలో బుధవారం (నవంబర్ 28) ఆమె ఉరివేసుకున్నారు. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సంఘటన స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ కూడా లభించలేదు.

రియామికా తమిళంలో 'కుంద్రాతిలే కుమారానుకు కొండట్టం', 'అఘోరి యిన్ అట్టమ్ ఆరంభం' లాంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అయితే ఆమె ఉన్నట్టుండి ఆత్మహత్యకు పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తోంది.

రాత్రి నుంచే ఆందోళనగా?

రాత్రి నుంచే ఆందోళనగా?

రియామికా తన సోదరుడు ప్రకాష్‌తో కలిసి వలసరవాక్కమ్‌లోని అద్దె ఇంట్లో గత నాలుగు నెలలుగా నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి నుంచే రియామికా కాస్త ఆందోళనగా కనిపించిందని ఆమె సోదరుడు పోలీసులకు తెలిపారు.

చివరగా బాయ్ ఫ్రెండ్ కాల్, వచ్చి చూస్తే ఉరి వేసుకుని

చివరగా బాయ్ ఫ్రెండ్ కాల్, వచ్చి చూస్తే ఉరి వేసుకుని

రియామికాకు చివరగా ఆమె బాయ్ ఫ్రెండ్ దినేష్ మంగళవారం లేట్ నైట్ ఫోన్ చేశాడు. ఫోన్లో అందుబాటులోకి రాక పోవడంతో అతడు నేరుగా ఇంటికి వెళ్లి ఆమె సోదరుడు ప్రకాష్‌ను ఆమె గురించి అడిగారు. అయితే ఆమె ఎంతకీ డోర్ తీయక పోవడంతో ప్రకాష్ కిటీకి ఓపెన్ చేసి చూడగా ఉరివేసుకుని కనిపించింది.

పోలీసులకు సమాచారం

పోలీసులకు సమాచారం

వెంటనే ప్రకాష్ వలసరవాక్కమ్ పోలీసులకు ఫోన్ చేయగా వారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని బాడీని రికవరీ చేశారు. అనంతరం మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అసహజ మరణం కింద కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

కారణం అదేనా?

కారణం అదేనా?

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం కొంతకాలంగా ఆమెకు సరైన అవకాశాలు రావడం లేదని, దీంతో డిప్రెషన్‌కు గురయ్యేదని తెలిపారు. బహుషా ఆ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X