టవల్ ధరించి ఉన్నా, సిగ్గులేకుండా చేయమన్నాడు..కలకలం సృష్టిస్తున్న హీరోయిన్!

Recommended Video

Tanushree Dutta Talks About Vivek Agnihotri's Behaviour On Sets

బాలీవుడ్ లో మీ టూ ఉద్యమం జోరందుకునట్లు కనిపిస్తోంది. తనుశ్రీ దత్త వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం దిగ్గజ నటుడు నానా పాటేకర్ పై తనుశ్రీ దత్త సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. హార్న్ ఒకే ప్లీజ్ షూటింగ్ సమయంలో నానా పాటేకర్ తనని లైగికంగా వేధించాడని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. దీనిపై బాలీవుడ్ లో చర్చ జరుగుతుండగానే తనుశ్రీ మరో బాంబు పేల్చింది. తనుశ్రీ దత్త నటించిన చాక్లెట్ దర్శకుడు వివేక్ అగ్ని హోత్రి షూటింగ్ సమయంలో నీచంగా ప్రవర్తించాడని సంచలన వ్యాఖ్యలు చేసింది.

కలకలం రేపుతున్న తనుశ్రీ

కలకలం రేపుతున్న తనుశ్రీ

తనుశ్రీ దత్త ఆషిక్ బనాయా అపనే చిత్రంలో శృంగార సన్నివేశాలలో నటించి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తరువాత పలు బాలీవుడ్ చిత్రాల్లో తనుశ్రీ నటించింది. కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. కొన్ని రోజులుగా తనుశ్రీ వార్తలో ప్రధాన అంశంగా మారుతోంది.లైంగిక వేధింపుల గురించి ఆమె చేస్తున్న వ్యాఖ్యలు బాలీవడ్ లో కలకలం సృష్టిస్తున్నాయి.

మరో సంచలన విషయం

మరో సంచలన విషయం

నానా పాటేకర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన తనుశ్రీ తాజగా చాక్లెట్ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. చాక్లెట్ చిత్ర షూటింగ్ సమయంలో ఆ దర్శకుడు తనని వేధించిన వైనాన్ని బయట పెట్టింది.

టవల్ ధరించి ఉన్నా

టవల్ ధరించి ఉన్నా

తాజాగా తనుశ్రీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చాక్లెట్ షూటింగ్ జరుగుతోంది. తాను ధరించిన కాస్ట్యూమ్స్ ఎక్స్పోజింగ్ గా ఉండడంతో పైన టవల్ లాంటి కోట్ ధరించి కూర్చుని ఉన్నా. ఆ సమయంలో ఇర్ఫాన్ ఖాన్ పై షాట్ చిత్రీకరించాలి. అయినా కూడా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తన వక్ర బుద్ది చూపించారు.

సెక్సీగా డాన్స్

సెక్సీగా డాన్స్

ఇర్ఫాన్ ఖాన్ కి సెక్సీగా ముఖ కవళికలు చూపించాలి. టవల్ తీసేసి డాన్స్ చేయి అని నీచంగా మాట్లాడాడు. ఆ షాట్ లో నేను ఉండను. ఇర్ఫాన్ ఖాన్ మాత్రమే కనిపిస్తాడు. నేను పెర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ దర్శకుడు మరో ఉద్దేశంతో మాట్లాడాడు అని తనుశ్రీ మండి పండింది.

వాళ్లిద్దరే కాపాడారు

వాళ్లిద్దరే కాపాడారు

వెంటనే నటుడు ఇర్ఫాన్ ఖాన్, సునీల్ శెట్టి స్పందించి నాకు అండగా నిలిచారు. దర్శకుడిని అడ్డుకున్నారు. ఈ షాట్ తనుశ్రీ ఉండవలసిన అవసరం లేదు. ఆమె ముఖకవళికలు లేకున్నా నేను నటిస్తా అంటూ ఇర్ఫాన్ ఖాన్ దర్శకుడిని మందలించారు.

 చాలా నచ్చింది

చాలా నచ్చింది

ఇర్ఫాన్ ఖాన్, సునీల్ నా కోసం అలా మాట్లాడడం చాలా నచ్చిందని తనుశ్రీ వారిద్దరిని ప్రశంసించింది. తనుశ్రీ నటించే షాట్ కాదు. ఆమె డాన్స్ చేయవలసిన అవసరం లేదు. ఇర్ఫాన్ ఖాన్ ఎలా కావాలంటే అలా నటిస్తాడు అని సునీల్ శెట్టి స్పందించారు.

పెరుగుతున్న మద్దత్తు

పెరుగుతున్న మద్దత్తు

తనుశ్రీ వ్యాఖ్యలపై నానా పాటేకర్ పిటిషన్ దాఖలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రియాంక చోప్రా, ట్వింకిల్ ఖన్నా వంటి బాలీవుడ్ ప్రముఖులు మాత్రం తనుశ్రీకి మద్దత్తు ప్రకటిస్తున్నారు. దీనితో బాలీవుడ్ లో కూడా మీ టూ క్యాంపైన్ జోరందుకునేలా కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X