చంపడానికి చూస్తున్నారంటూ బాలీవుడ్ మాఫియాపై బాలయ్య హీరోయిన్ సంచలనం!

బాలీవుడ్ బ్యూటీ తను శ్రీ దత్త సినీ ప్రియులందరికీ బాగా సుపరిచితురాలే. ఆమె చేసింది తక్కువ సినిమాలు అయినప్పటికీ సినిమాలతో ఆమెకు పెద్దగా గుర్తింపు లభించలేదు. కానీ మీటూ అంటూ స్టార్ డైరెక్టర్ మీద సంచలన వ్యాఖ్యలు చేసి బాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసింది. అందుకే ఎవరికైనా సరే ఆమె పేరు వినగానే మీటు ఉద్యమం జోరుగా సాగిన క్షణమే గుర్తొస్తుంది. అయితే ఇప్పుడు ఆమె మరో మారు ఒక సుదీర్ఘ లేఖ రాసింది. ఆ వివరాలు

మీటూ ఉద్యమం

మీటూ ఉద్యమం

ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పాటేకర్ తనను శారీరకంగా వేధించాడు అంటూ మీడియా ముఖంగా ఆమె చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో కలకలం సృష్టించాయి. ఆమె అలా ఆరోపణలు చేసిందో లేదో ఆ వెంటనే పలువురు నటిమణులు కూడా బయటకు వచ్చి సినిమా ఇండస్ట్రీలో తమకు ఎదురైన అనుభవాలు పంచుకోవడంతో మీటూ ఉద్యమం జోరందుకుంది. బాలీవుడ్ లో మీటూ పేరుతో ఆమె సృష్టించిన ప్రకంపనలు ఇప్పటికీ తగ్గలేదని చెప్పాలి.

సుధీర్ఘ నోట్

సుధీర్ఘ నోట్

దేశవ్యాప్తంగా ఈ విషయంపై చర్చ జరిగేలా చేసిన తనుశ్రీ దత్త ఆ తర్వాత కొన్ని చిన్న చిన్న ఫోటోషూట్లలో కనిపించింది. మీటూ వల్ల సినిమా ఇండస్ట్రీని వదిలేసిన తాను అమెరికాలో ఉంటున్నట్టుగా అప్పట్లో ఇంటర్వ్యూలో తెలిపిన ఈ భామ ఇప్పటికైనా మంచి అవకాశాలు వస్తే సినిమాలు చేయడానికి సిద్ధమని చెప్పుకొచ్చింది. ఇక తాజా విషయం ఏమిటంటే తనుశ్రీ మరోసారి మీటూ పై హాట్ కామెంట్స్ చేసింది. ఈ మేరకు రీసెంట్ గా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో సుధీర్ఘ నోట్ షేర్ చేయడం గమనార్హం. అందులో ఏముందంటే... లైంగిక వేధింపులపై నోరు విప్పినందుకు తనను ఇప్పటికీ వేధిస్తున్నారని తనుశ్రీ ఆవేదన వ్యక్తం చేసింది.

ఇబ్బంది పెట్టడానికే

ఇబ్బంది పెట్టడానికే

మీటు నిందితులు తనకు అవకాశాలు లేకుండా చేస్తున్నారని, తన కెరీర్ ను నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారని, ఎవరెన్ని కుట్రలు చేసినా తాను చిత్ర పరిశ్రమను వదిలి వెళ్ళిపోయేది లేదని కుండబద్దలు కొట్టింది తను శ్రీ. అంతేకాదు తను మళ్ళీ నటిగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను అంటూ సదరు నిందితులకు సవాల్ విసిరింది.

ఇక ఈ సందర్భంగా ఆమె బాలీవుడ్ పై మహారాష్ట్ర పాత ప్రభుత్వం ప్రభావం ఎలా ఉందో కూడా వివరించింది. బాలీవుడ్ మాఫియాపై మహారాష్ట్రలోని పాత పొలిటికల్ సర్క్యూట్ ప్రభావం ఇప్పటికీ ఉందని, దుర్మార్గపు జాతీయ వ్యతిరేక క్రిమినల్ ఎలిమెంట్స్ అంతా కలిసి సాధారణ ప్రజలను ఇబ్బంది పెట్టడానికే ఇలా పని చేస్తాయని, వీటన్నిటి వెనుక తాను బయటపెట్టిన మీటూ నేరస్తులు, ఎన్జీవో వారే ఉన్నారని తను కచ్చితంగా అనుకున్నట్టుగా తనుశ్రీ ఆరోపించింది.

మరో బాంబు పేల్చి

మరో బాంబు పేల్చి

దీని వెనుక మరో కారణం కూడా ఉందట. అది ఏంటంటే... తన తప్పు లేనప్పుడు తనను ఇంకా ఎందుకు టార్గెట్ చేసి వేధిస్తున్నారు? అని తనుశ్రీ ఈ సందర్భంగా ప్రశ్నించింది. అంతే కాదు చాలామంది బాలీవుడ్లో తనను లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తనకు తెలుసని, అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడినందుకు చిన్న పిల్లలు, అమ్మాయిలను వేధించి చంపగలిగే ప్రదేశం ఇదేనంటూ తనుశ్రీ మరో బాంబు పేల్చింది.

జీవించలేని పరిస్థితులు

జీవించలేని పరిస్థితులు

అక్కడ విషయాలు నిజంగా చేయి దాటిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన తనుశ్రీ తనలాంటి సాధారణ వ్యక్తులు జీవించలేని పరిస్థితులు నెలకొన్నాయని వెల్లడించింది. ఈరోజు నేను బాధితురాలు అయితే రేపు నువ్వు కూడా కావచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

అయితే ఎవరు ఎన్ని సమస్యలు సృష్టించినా, తనని ఎంతగా ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసినా భయపడబోయేది లేదని, ఆత్మహత్య లాంటివి చేసుకోనని ఆమె అభిమానులకు హామీ ఇచ్చింది. ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి ఆత్మస్థైర్యం పెంచుకుంటానని, ఆధ్యాత్మిక సాధనతో ఆత్మస్థైర్యాన్ని మరింత బలపరచుకుంటానని తనుశ్రీ ఆ సుదీర్ఘ నోట్లో రాసుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X