సెట్స్‌లో అందరి ముందు వేధించాడు: నానా పాటేకర్ మీద హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

'ఆషిక్ బనాయా అప్నే' సినిమాతో ఒకప్పుడు బాలీవుడ్లో సంచలనం క్రియేట్ చేసిన మాజీ మిస్ ఇండియా తనుశ్రీ దత్తా ఆ తర్వాత కొన్ని రోజులకే ఇండస్ట్రీ నుండి ఫేడౌట్ అయిపోయారు. చాలా కాలం క్రితమే సినిమా ఇండస్ట్రీని వదిలేసిన తనుశ్రీ దత్తా.... తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయట పెట్టింది. తాను సినిమాల్లో ఉన్నపుడు ఎదురైన సెక్సువల్ హరాస్మెంట్ సంఘటనల గురించి వివరించారు. బాలీవుడ్లో ప్రముఖ నటుడిగా పేరొందిన నానా పాటేకర్ మీద ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఓ ఆంగ్లప్రతికలో కథనం వెలువడింది.

పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!

షూటింగులో వేధించాడు

షూటింగులో వేధించాడు

‘జూమ్' అనే వెబ్ ఛానల్‌కు వీడియో ఇంటర్వ్యూ ఇచ్చిన తనుశ్రీదత్తా....ఓ సారి సినిమా షూటింగులో డాన్స్ సీక్వెన్స్ జరుగుతున్నపుడు నానా పాటేకర్ తనను సెక్సువల్‌గా వేధించాడని తెలిపారు.

Recommended Video

Tanushree Dutta Has a Huge Change In Her Physic
మహిళల పట్ల అతడి ప్రవర్తన

మహిళల పట్ల అతడి ప్రవర్తన


నానా పాటేకర్ మహిళల పట్ల చాలా రూడ్‌గా ఉంటారని ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు. నానా పాటేకర్ సెట్స్‌లో నటిపై చేయి చేసుకున్నాడని, వారిని వేధిస్తారని చర్చించుకుంటారు. మహిళల పట్ల నానా పాటేకర్ బిహేవియర్ ఇండీసెంటుగా ఉంటుందని ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. కానీ ఎవరూ కూడా ఆయన గురించి పత్రికల్లో రాయడానికి ధైర్యం చేయడం లేదు... అని తనుశ్రీ దత్తా తెలిపారు.

నిర్మాతలకు ఫిర్యాదు చేసినా...

నిర్మాతలకు ఫిర్యాదు చేసినా...


2008లో చోటు చేసుకున్న సంఘటన గురించి గుర్తు చేసుకుంటూ.... ఆ రోజు కాంట్రాక్ట్ ప్రకారం నేను సోలో డాన్స్ నెంబర్ చేయాలి. కానీ షూటింగ్ మొదటి రోజు నుండే నానా పాటేకర్ తనతో మిస్ బిహేవ్ చేశారు అని తనుశ్రీ దత్తా తెలిపారు. ఈ విషయాన్ని దర్శకులు, నిర్మాతల దృష్టికి తీసుకెళ్లిన ఆమెకు వారి నుండి కూడా నిరాశ పరిచే సమాధానం ఎదురైంది. నానా పాటేకర్ చెప్పినట్లు వినాలని ఆమెకు సూచించారట.

మనుషులను పంపి బెదిరించాడు

మనుషులను పంపి బెదిరించాడు

తనను, తన ఫ్యామిలీని బెదిరించడానికి నానా పాటేకర్ ఒకసారి తన మనుషులను కూడా పంపిచినట్లు తనుశ్రీ దత్తా ఆరోపించారు. అలాంటి నానా పాటేకర్‌తో అక్షయ్ కుమార్, రజనీకాంత్ లాంటి పెద్ద స్టార్లు పని చేస్తున్నారు అని తనుశ్రీ దత్తా వ్యాఖ్యానించారు.

అతడి వల్లే కెరీర్ నాశనం

అతడి వల్లే కెరీర్ నాశనం

నానా పాటేకర్‌ను ఎదిరించడం వల్లే తన కెరీర్ బాలీవుడ్లో సరిగా సాగలేదని, తర్వాత క్రమ క్రమంగా తాను ఇండస్ట్రీ నుండి బయటకు రావాల్సి వచ్చిందని తనుశ్రీ దత్తా అభిప్రాయ పడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X