Tapsee Pannu: సౌత్ డైరెక్టర్ల చూపంతా మా ప్రైవేట్ పార్టులపైనే.. తాప్సీ మరోసారి నోటి దురుసు

తనకు అవకాశాలు, కెరీర్ పరంగా ఎదగడానికి సహాయపడిన దక్షిణాది సినీ పరిశ్రమ, దర్శకులపై నటి తాప్సీ పన్ను మరోసారి విషం చిమ్మింది. దర్శకుల దృష్టి అంతా ప్రైవేట్ పార్టులపైనే ఉంటుంది. అది నాకు చాలా అసౌకర్యంగా ఉండేది అంటూ తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అందాల భామ అసహనాన్ని వ్యక్తం చేసింది. తాప్సీ పన్ను నటించిన అస్పీ అనే హిందీ సినిమా ఇటీవల రిలీజై బాలీవుడ్‌లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు సాధించడానికి అపసోపానాలు పడుతున్నది. ఈ క్రమంలో హిందీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌత్ ఇండస్ట్రీ గురించి అవాకులు చెవాకులు పేలింది. ఆమె తన ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే?

సౌత్, భోజ్‌పురి ఇండస్ట్రీలో బొడ్డు, ఇతర ప్రైవేట్ పార్టీలపై దృష్టిపెడుతారు. రెండు ఇంచులు కింద, రెండు ఇంచులు మీద అంటూ ఇబ్బంది పెడుతారు. వారికి ఆ పార్ట్‌పై ఎందుకంత ఇంట్రెస్టో అర్ధం కాదు. అలాంటి అనుభవాలు నాకు షాక్ కలిగించాయి. హిందీ సినిమా రంగంలో ఐటెమ్ సాంగ్స్ ఉంటాయి. కానీ ప్రైవేట్ పార్టులపై అంతగా దృష్టిపెట్టరు. కథలో భాగంగా రొమాన్స్, శృంగార సన్నివేశాలను చిత్రీకరిస్తారు అని తాప్సీ చెప్పింది.

Tapsee Pannu blames and Criticises South Film Makers

సౌత్‌లో ప్యాడెడ్ బ్రాలు ధరించమని ఒత్తిడి చేస్తారు. సెట్‌లో అలాంటి సందర్భాలు చాలా ఎక్కువగా ఇబ్బందికి గురి చేస్తాయి. సినిమా షూటింగ్ సెట్స్‌లో అమ్మాయిలు చాలా తక్కువగా ఉంటారు. ఒకరిద్దరు కంటే ఎక్కువగా కనిపించరు. దర్శకుడు తన అసిస్టెంట్ డైరెక్టర్‌కు చెబితే.. అతడు వెళ్లి స్టైలిస్ట్‌కు చెబుతాడు. ఆ స్టైలిస్ట్ వచ్చి నా అసిస్టెంట్‌కు చెబుతాడు. అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుందంటే.. మాటల్లో చెప్పలేను. సాంగ్ మధ్యలో వెళ్లి ప్యాడెడ్ బ్రా ధరించాల్సి వచ్చినప్పుడు చాలా అసౌకర్యంగా ఉంటుంది. అందరూ మమ్మల్నే చూస్తుంటారు. ఇది సౌత్ ఇండస్ట్రీలో తరుచుగా జరుగుతుంటుంది అని తాప్సీ అన్నారు.

గతంలో కూడా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుపై తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ పాటలో పూలు, పండ్లతో నా నాభిపై కొట్టడం చేశారు. అక్కడ పండ్లతో కొడితే నాకు చాలా బాధగా ఉండేది. వారికి అక్కడ కొట్టడం వల్ల వచ్చే ఆనందం ఏమిటో. సౌత్ దర్శకులు ఇలాంటి సీన్లు చిత్రీకరిస్తుంటే నాకు నవ్వొచ్చేది. ఒకవైపు బాధ కూడా కలిగేది అని తాప్సీ అన్నారు. ఆ తర్వాత ఆమె వ్యాఖ్యలు వివాదాస్పద కావడంతోపాటు తెలుగు ప్రేక్షకులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ తర్వాత రాఘవేంద్రరావుపై చేసిన కామెంట్లను తాప్సీ పన్ను ఉపసంహరించుకొన్నారు. ఆయనకు క్షమాఫణలు కూడా చెప్పారు. దాంతో ఆ వివాదం అంతటితో సమసిపోయింది. ప్రస్తుతం ఆమె మరోసారి దక్షిణాది సినిమా ఇండస్ట్రీ, దర్శకులపై తన నోటి దురుసును బయటపెట్టింది. ఈ వ్యాఖ్యలపై తెలుగు, దక్షిణాది పరిశ్రమల ప్రముఖులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

అనుభవ్ సిన్హా దర్శకత్వంలో తాప్సీ పన్ను నటించిన అస్పీ చిత్రం సుమారుగా 40 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద తడబాటుకు గురవుతున్నది. ఈ సినిమా హిందీ ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నది. ఈ సినిమా గత రెండు రోజుల్లో 2 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.

More from Filmibeat

Read more about: tapsee pannu Assi bollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X