టాక్సీవాలా హీరోయిన్‌కు క్రేజీ ఆఫర్.. మాస్ మహారాజకు జోడిగా!
ఒకప్పుడు నిర్మాతలకు మినిమం గ్యారెంటి హీరోగా ఉన్న రవితేజ ప్రస్తుతం వరుస ప్లాపులు ఎదుర్కొంటున్నాడు. ఇటీవల శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన అమర్ అక్బర్ అంటోని చిత్రం దారుణమైన పరాజయం చవిచూసింది. దీనితో రవితేజ మార్కెట్ బాగా దెబ్బ తిన్నట్లు వార్తలు వస్తున్నాయి. అర్జెంటుగా ఓ హిట్ ఇస్తే పరిస్థితి చక్కబడుతుంది. ప్రస్తుతం రవితేజ విఐ ఆనంద్ దర్శకత్వంలో నటించేందుకు సిద్దం అవుతున్నాడు.
విఐ ఆనంద్ ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందబోతున్న ఈ చిత్రంలో రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించాల్సి ఉంది. తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం టాక్సీవాలా చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన ప్రియాంక జవాల్కర్ రవితేజకు జోడిగా ఎంపికైనట్లు తెలుస్తోంది.

చాలా రోజులగా వాయిదా పడుతూ వచ్చిన టాక్సీవాలా చిత్రం అందరిని ఆశ్చర్యపరుస్తూ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంతో ప్రియాంక జవాల్కర్ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇప్పుడు రవితేజ సరసన కూడా ఛాన్స్ రావడంతో ఈ భామ కెరీర్ ఊపందుకున్నట్లే అనిపిస్తోంది. ఈ చిత్రమో మరో హీరోయిన్ గా ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ పేరు పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











