twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ హీరోతో న్యూడ్‌గా నటించమన్నారు.. అంతా పడకగదిలోకి రమ్మనేవారే.. తేజస్వి మదివాడ

    |

    టాలీవుడ్ హీరోయిన్, బిగ్‌బాస్ ఫేం తేజస్వి మదివాడ నటించిన తాజా చిత్రం కమిట్‌మెంట్. హైదరాబాద్ నవాబ్స్, పరిచయం చిత్రాలను రూపొందించిన డైరెక్టర్ లక్ష్మికాంత్ చెన్నా డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినీ పరిశ్రమలో తారలపై లైంగిక వేధింపులతోపాటు పలు రంగాల్లో చోటుచేసుకొంటున్న వేధింపులను కథాంశంగా కమిట్‌మెంట్‌ను రూపొందించారు. ఈ చిత్రం గురించి తేజస్విని మీడియాతో మాట్లాడుతూ..

    బాలీవుడ్ తారలు దేనికైనా రెడీ అంటూ

    బాలీవుడ్ తారలు దేనికైనా రెడీ అంటూ

    బాలీవుడ్ తారలు దేనికైనా ఒప్పుకొంటారనే ఏకైక కారణంతో వారిని తమ సినిమాల్లో పెట్టుకొంటున్నారు. కమిట్‌మెంట్‌కు ఒప్పుకొనే వాళ్లపైనే ప్రధానంగా దృష్టిని కేంద్రికరిస్తారు. బాలీవుడ్ నుంచి వచ్చే వారంతా అలా ఉంటారనే కాదు.. కేవలం 20 శాతం మంది వల్లే ఇలాంటి చెడ్డపేరు తెలుగు హీరోయిన్లకు వస్తున్నదనే ఆవేదన తేజస్వి వ్యక్తం చేశారు

    నన్ను కమిట్‌మెంట్ అడిగారు..

    నన్ను కమిట్‌మెంట్ అడిగారు..

    తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మంది నన్ను పడక గదిలోకి వస్తావా? అని అడిగారు. దానికి కమిట్‌మెంట్ పేరు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అందువల్లనే వాటిని ఒప్పుకోలేక నేను సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాను. సినిమా ఇండస్ట్రీకి వచ్చే వాళ్లు ముందుగానే కమిట్‌మెంట్‌కు ప్రిపేర్ అయి వస్తున్నారు. ఆ క్యాటగిరీలో మనం ఉంటే ముందుకు సాగుతాం. లేకపోతే నాలాగా ప్రతిభ ఉన్నా రేసులో వెనుకబడి పోతాం అని తేజస్వి మదివాడ చెప్పారు.

    నా పెళ్లి అలా చెడిపోయింది

    నా పెళ్లి అలా చెడిపోయింది

    గతంలో నాకు ఒకరితో అఫైర్ ఉండేది. అతడితో పెళ్లికి కూడా సిద్ధమయ్యాను. అయితే సినీ పరిశ్రమలో నుంచి వచ్చానని నాపై అనుమానం పడ్డారు. వర్మ సినిమాలో నటించావు నీవు అలాంటి పనులు చేయలేదంటే ఎలా నమ్మమంటావు అని పశ్నించారు. అయితే నేను అలాంటి దానిని కాదు ఎలా ప్రూవ్ చేసుకోవాలో అర్దం కాలేదని తేజస్వి అన్నారు.

    న్యూడ్‌గా నటిస్తావా అని అడిగారు

    న్యూడ్‌గా నటిస్తావా అని అడిగారు

    గతంలో నాకు బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించే ఓ వెబ్ సిరీస్‌లో న్యూడ్‌గా నటించాలని కండిషన్ పెట్టారు. ఆ సమయంలో నేను న్యూడ్ సీన్లు చేయడానికి ఒప్పుకోనని చెప్పాను. దాంతో ఆ ఆఫర్ నాకు దక్కలేదు. అలాంటి ఆఫర్లు కమిట్‌మెంట్, అశ్లీల పాత్రలు చేయలేక మిస్ చేసుకొన్నాను అని తేజస్వి వెల్లడించారు. ఆ తర్వాత సీనియర్ హీరోయిన్లను చూసి అన్ని రకాల పాత్రలు చేయాలని రియలైజ్ అయ్యానన్నారు.

    Recommended Video

    'HIT' Movie Actor Maganti Srinath Exclusive Interview
    ముద్దు సీన్లతో సినిమాలకు దూరం

    ముద్దు సీన్లతో సినిమాలకు దూరం

    ఒక సినిమాలో ముద్దు సీన్ ఉందనే కారణంగా నేను ఆ సినిమాను వదులుకొన్నాను. ఇప్పుడు నటిగా, వ్యక్తిగా పరిణతి చెందాను. ఒప్పుడు ముద్దు సీన్లు ఇలా చేసేస్తున్నాను, కమిట్‌మెంట్‌ చిత్రంలో నేను నటిగా ఎక్కువ మెచ్యురిటీతో కనిపిస్తాను అని చెప్పారు. ఇప్పుడు ఒకవేళ న్యూడ్ సీన్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే తప్పుకుండా చేయడానికి ప్రయత్నిస్తాను. మంచి నటిగా ప్రూవ్ చేసుకొనేంందుకు ప్రయత్నిస్తున్నాను అని తేజస్వి మదివాడ పేర్కొన్నారు.

    English summary
    Tejaswi Madivada has made sensational comments about Sexual favours in Telugu Film Industry. While talking her laterst movie Commitment movie promotion, She revealed facts of Inside tollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X