పెళ్లి చేసుకోను.. కానీ పిల్లల్ని కంటా.. టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
హీరోయిన్లు ఒకవైపు తమ కెరీర్ కు ప్రాధ్యానత ఇస్తూనే.. మరోవైపు తమ పర్సనల్ లైఫ్ కూడా ప్రియారిటీ ఇస్తుంటారు. పెళ్లైన హీరోయిన్ కూడా తన కెరీర్‌తో పాటు మ్యారేజ్ లైఫ్ ను సరిగా బ్యాలెన్స్ చేస్తూ హ్యాపీగా ఉంటున్నారు. మరికొంతమంది హీరోయిన్లు అయితే .. తల్లులుగా మారిన తరువాత కూడా సినిమాల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. పిల్లలున్న బాలీవుడ్ హీరోయిన్ అలియ భట్, తమిళ స్టార్ హీరోయిన్ నయనతార సైతం వరుస సినిమాలు చేస్తోంది. తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ బోల్డ్ కామెంట్స్ చేసింది.
ఆ బోల్డ్ కామెంట్స్ చేసిన అమ్మడు ఎవరో కాదు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తన అందాలతో కుర్రకారును టెంప్ట్ చేస్తే యంగ్ హీరోయిన్ తేజస్వి మదివాడ (Tejaswi Madivada). ఐస్ క్రీమ్ బ్యూటీ తేజస్వి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తేజస్వి శేఖర్ కమ్ముల తెరకెక్కించిన "లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్" అనే సినిమాలో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ ఫేమ్ తో 2013లో తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాలో సమంత కు సిస్టర్ గా నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఈ మూవీతో మంచి పాపులర్టీ సంపాదించుకున్న ఈ భామ ఆర్జీవీ డైరెక్షన్ తో తెరకెక్కిన "ఐస్ క్రీమ్" అనే సినిమాలో ప్రధానపాత్రలో నటించింది.

ఇలా అందం,అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ, విభిన్న పాత్రలో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది తేజస్వీని. ఆ తరువాత హార్ట్ ఎటాక్, మనమంతా, అనుక్షణం, కేరింత, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, పండగ చేస్కో, మిస్టర్ తదితర సినిమాల్లో నటించి టాలీవుడ్ మాస్ ప్రేక్షకులను అలరించింది. ఈ తరుణంలో 2018లో తెలుగు బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొని బీబీ ప్రేక్షకులను అలరించింది.
ఇటీవల ఓటీటీ పై కన్నేసింది ఈ అమ్మడు. సూపర్ హిట్ సినిమాలతో పాటు ఆకట్టుకునే వెబ్ సిరీస్ ల్లో కూడా నటిస్తోంది. తాజా అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2 అనే మూవీలో నటించింది తేజస్వీ ని.ఈ సిరీస్ అక్టోబర్ 31 న ప్రీమియర్ కానుంది. ఇక తేజస్వి సినిమాల్లో అలరిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోజులతో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది.

ఇదెలా ఉంటే.. తాజాగా హీరోయిన్ తేజస్వి మదివాడ ఓ ఇంటర్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్స్ చేసింది. మీరు జీవితంలో దేనికి ఎక్కువగా భయపడతారని యాంకర్ ప్రశ్నించగా.. 'వెంటనే మ్యారేజ్' అని సమాధానం ఇచ్చాను తేజస్వి. దీంతో యాంకర్ కూడా షాక్ అయినా.. జీవితంలో పెళ్లి చేసుకోవద్దని ఫిక్స్ అయ్యారా? అని తిరిగి ప్రశ్నిస్తాడు. ' నా పెళ్లంటేనే భయం, జీవితంలో పెళ్లి చేసుకోవద్దు అని ఫిక్స్ అయ్యా ' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతటీతో ఆగని యాంకర్.. నెక్స్ట్ ఇయర్ గాని, ఆ తర్వాత సంవత్సరం గాని, పెళ్లి చేసుకుంటారని భావించవచ్చా? మరీ ఏజ్ అయిపోతుంది కదా? అని యాంకర్ ప్రశ్నించగా.. ' నేను పెళ్లి చేసుకోను, మెయిన్ గా ఏజ్ అయిపోవాలని చూస్తున్నా కదా, అలా అయితే.. నన్ను ఎవడు చేసుకోవద్దు కాదా.. కానీ, పిల్లలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు' అంటూ షాకింగ్ రిప్లై ఇచ్చింది.
'పెళ్లి కాకుండా సుస్మిత సీన్ కు పిల్లలు లేరా?' అంటూ తిరిగి తేజస్వీ ప్రశ్నించింది. మరీ టెస్ట్ బేబీని ఏమైనా ప్లాన్ చేస్తున్నారని యాంకర్ ప్రశ్నించగా..'నాకు పిల్లలు పుడతార్రా బాబు.. ఇంకా ఐదు సంవత్సరాల టైం ఉంది నాకు. ఈలోపు పిల్లల్ని కంటా..' అని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది తేజస్వీ. మరి లీవింగ్ రిలేషన్షిప్ పై మీ అభిప్రాయం ఏంటి ? అని ప్రశ్నించగా.. 'అది కూడా మ్యారేజ్ లాంటిదే.. ఓ మనిషి తో జీవితాంతం ఉండాలనుకుంటే డైరెక్ట్ గా పెళ్లి చేసుకోవచ్చు' అంటూ షాకింగ్ కామెంట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి తేజస్వి బోల్డ్ కామెంట్స్ పై మీ అభిప్రాయమేంటీ ?


Click it and Unblock the Notifications











