twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గృహ నిర్బంధంలో రెచ్చిపోయిన తేజస్వి.. అర్ధనగ్నంగా ఫోటోలు వైరల్

    |

    లాక్‌డౌన్‌లో యువతారలు తమ అందాలతో అభిమానులకు ఝలక్ ఇస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్, దిశా పటానీలు హాట్ హాట్ ఫోటోలు, వీడియోలతో ఆకట్టుకొంటున్న సంగతి తెలిసింది. తాజాగా వాళ్ల జాబితాలో తేజస్వి మదివాడ చేరింది. ఇటీవల ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్‌ను, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలో కాక పుట్టిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

    టాలీవుడ్ నుంచి బిగ్‌బాస్‌కు

    టాలీవుడ్ నుంచి బిగ్‌బాస్‌కు

    టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోయిన్‌గా తేజస్వి తన అదృష్టాన్ని పరీక్షించుకొన్నారు. అందంతోనే కాదు అభినయంతో కూడా ఆమె విశేషంగా ఆకట్టుకొన్నారు. హీరోయిన్‌గా ముంబై తారల పోటీని తట్టుకోలేక చతికిలపడింది. ఆ తర్వాత బిగ్‌బాస్‌లోకి అడుగు పెట్టింది. బిగ్‌బాస్‌లోను అందాలను ఆరబోసింది.

    వివాదాస్పదంగా తేజస్వి

    వివాదాస్పదంగా తేజస్వి

    బిగ్‌బాస్‌లోకి అడుగు పెట్టిన తర్వాత మంచి జోష్‌తో బుల్లితెర ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచింది. అయితే కొన్ని అనవసర తప్పిదాలతో ప్రేక్షకుల ఆగ్రహానికి గురై షో నుంచి తప్పుకొన్నది. అయితే బిగ్‌బాస్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఆమె కొన్ని వివాదాలకు కేంద్ర బిందువయ్యారు. అయితే వాటి నుంచి తొందరగానే బయటపడటం గమనార్హం.

    టాలీవుడ్‌పై ఆశలు

    టాలీవుడ్‌పై ఆశలు

    అయితే బిగ్‌బాస్‌లో వచ్చిన పాపులారిటితో టాలీవుడ్‌లో అవకాశాలు వస్తాయని భావించిన అందరికీ షాక్ తగిలింది. బిగ్‌బాస్ తర్వాత పెద్దగా ఆఫర్లు రాకపోవడం, కనీసం చిన్న పాత్రలతోనైనా వెండితెరపైన కనిపించకపోవడం గమనార్హం. అయితే ప్రస్తుతం బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు తేజస్వి మదివాడ.

    Recommended Video

    'HIT' Movie Actor Maganti Srinath Exclusive Interview
    గృహ నిర్బంధంలో హాట్ హాట్‌గా

    గృహ నిర్బంధంలో హాట్ హాట్‌గా

    ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్‌లో గృహ నిర్బంధంలో ఉన్న తేజస్వి ఇలా హాట్ ఫోటోలతో దర్శనమిచ్చింది. ఈ ఫోటోలు తేజస్విని మరింత గ్లామర్‌గా చూపించాయి. ప్రస్తుతం తేజస్వి గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లాక్‌డౌన్ తర్వాత తేజస్వి వెండి తెర మీద కూడా ప్రతాపం చూపిస్తుందా లేదా వేచి చూడాల్సిందే.

    English summary
    Tejaswi Madivada is in self quarantine, In these days, her photos flood into social media. Now glamourous photoshoot of Corona lockdown goes viral in the media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X