ఊరికే బికినీ వేసుకొని రోడ్ల మీద తిరగట్లేదుగా.. టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
సినిమాలలో అందాల ఆరబోత కామన్. అయితే.. బికినీ వేయడం అంటే మొదట గట్స్ ఉండాలి. కేవలం ఎక్స్ పోజింగ్ ఒక్కటే కాదు. బాడీ ఫిట్ నెస్ కూడా పర్పెక్ట్ గా ఉండాలి. అందుకే బికినీ వేయడానికి భయపడుతారు. అందరికీ అందరికీ సూట్ అవ్వదు. కానీ ఓ టాలీవుడ్ అమ్మడు బికినీ వేసుకోవడాన్ని గొప్ప అవకాశంగా భావిస్తున్నానని అని పేర్కొంది. ఇంతకీ అమ్మడు ఎవరో ఓ లూక్కేయండి.
ఆ అమ్మడు ఎవరో కాదు. టాలీవుడ్ హాట్ బ్యూటీ, యంగ్ యాక్టరెస్ తేజస్వి మదివాడ (Tejaswi Madivada). హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు, సిరీస్ లు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్న తెలుగమ్మాయి తేజస్వి, మడివాడ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు "లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్" అనే సినిమాలో టాలీవుడ్ కి పరిచయమైంది. ఈ మూవీ ఫేమ్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి అలరించారు. ఆ తరువాత మనం, హార్ట్ అటాక్ వంటి సినిమాల్లో మెరిసింది తేజస్వి.

ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మ కంటబడ్డ ఆ అమ్మడు .. ఐస్‌క్రీమ్ అనే మూవీ ద్వారా తొలిసారిగా హీరోయిన్‌గా అవకాశం అందుకుంది. అయితే.. ఈ సినిమాలో అందాల ఆరబోత చేసినా ఆమెకు పెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే చేయడం ప్రారంభించింది. ఇలా.. మనమంతా, అనుక్షణం, కేరింత, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, పండగ చేస్కో, మిస్టర్ తదితర సినిమాల్లో నటించింది.
ఆ తర్వాత 2018లో తెలుగు బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించింది. మంచి గుర్తింపు తెచ్చుకుంది తేజస్వి . ఈ బ్యూటీ సినిమాల్లో అలరిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోజులను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.

ఈ అమ్మడు కేవలం సినిమాలే కాకుండా వెబ్ సీరిస్ ల్లో కూడా నటిస్తోంది. తాజాగా అర్దమయ్యిందా అరుణ్ కుమార్ సీజన్ 2 వెబ్ సిరీస్ లో నటించింది.ఈ సిరీస్ కు సంబందించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట్లో తెగవైరల్ అవుతోంది. ఈ సిరీస్ అక్టోబర్ 31 న ప్రీమియర్ కానుంది. అయితే ట్రైలర్‌లో ఈ తేజస్వీని బికినీలోకనిపించింది.ఆమె బికినీతో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి.
ఓ ఈవెంట్ లో హీరోయిన్ తేజస్విని మాట్లాడుతూ.. బికినీ వేయడంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. "ఆర్మీ సినిమాలు, మేరీకోమ్ లాంటి సినిమాలకే ఫిట్ నెస్ పై ఫోకస్ చేయాలని, మిగిలిన వాటికి అవసరం లేదు అని ఫీలవుతారు. బాడీ ఫిట్‌గా ఉండటం అవసరం ' అని అన్నారు.

ఓటీటీ కి బికినీ వేసుకోవడం అవసరమని భావిస్తున్నారా అని ప్రశ్నించగా.. 'ఓటిటీ అంటేనే ఓవర్ ద టాప్. బేసిక్ గా దానికి దీనికి సంబంధం లేదు.కానీ, ఆ సిరీస్లో ఆ క్యారెక్టర్ ఎలా ఇతరులను అట్రాక్టింగ్ చేసుకుంటుందో తెలియజేయడానికి బికినీ వేయాల్సి వచ్చిందని, అంతేగాని రోడ్లపై వేసుకొని తిరగడం లేదు. ఆ సీన్ డిమాండ్ చేసింది. కాబట్టి బికినీ వేసుకున్నాను అని తేజస్విని చెప్పారు.
మరి బికినీ ధరించడానికి మీరు ఏమైనా వర్కర్లు చేశారా? అని ప్రశ్నించగా.. ఎవరిదైనా బాడీ ఫిట్ గా.. పర్ఫెక్ట్ గా.. ఉందంటేనే వారు క్రమశిక్షణగా ఉన్నారు అని అర్థం. నా డిస్ప్లే ఏంటో చూపించాలని, కాన్ఫిడెంట్ గా బికినీ వేసుకున్నానని తెలిపారు. అయినా .. ఏదైనా డ్రెస్ వేసుకుంటే బాగుండాలి. వేసుకున్న తర్వాత ఛీ నేను ఇలా ఉన్నానేంటీ? అని ఓ పదేండ్ల తర్వాత నేను అనుకోకూడదు అని భావించాను. తెలుగు సినిమాలో మొదటిసారి నేను బికినీ వేసుకున్నాననీ, ఇది తాను ఒక గొప్ప అవకాశంలా భావిస్తున్నానని తేజస్విని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తేజస్విని కామెంట్స్ వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











