Tejaswi Madivada : రాజకుమారిలా బోల్డ్ బ్యూటీ .. ఆ పార్ట్‌ని ముత్యాల దండతో కవర్ చేస్తూ
తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు లేకుండా పోతున్నాయని ఎంతో మంది వాపోతున్నారు. లోకల్ టాలెంట్‌ని ఆదుకోవాలని.. పరభాషా నటులకు అంతటి ప్రాధాన్యం ఉందని పలువురు సీనియర్ నటులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అందం, అభినయం ఉండి కూడా ఎంతోమంది తెలుగు అమ్మాయిలు స్టార్ డమ్ దక్కించుకోలేకపోతున్నారు. ఈ లిస్ట్‌లోకే వస్తారు బోల్డ్ బ్యూటీ తేజస్వి మదివాడ.
బిగ్‌బాస్‌లో అడుగుపెట్టి ఆ షోలో ఇరగదీసిన వారు తర్వాత అడ్రస్ లేకుండా పోవడం చూస్తూనే ఉన్నాం. కంటెస్టెంట్సే కాదు టైటిల్ విన్నర్స్‌గా గెలిచిన వారు కూడా తర్వాత లైమ్ లైట్‌లో కనిపించలేదు. అలాంటి వారిలో తేజస్వి మదివాడ కూడా ఒకరు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2లో తన గ్లామర్‌తో హౌస్‌కి అందాలు తీసుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఎవ్వరికీ కనిపించడం లేదు. అడపా దడపా ఇంటర్వ్యూలు ఇస్తూ నేనొక దానిని ఉన్నానని ప్రేక్షకులకు గుర్తుచేస్తున్నారు.

హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన తేజస్వి మదివాడ .. 2012లో విలక్షణ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో చిన్న పాత్ర ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ వెంటనే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేశ్ బాబు - వెంకటేష్‌లు కలిసి నటించిన మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో హీరోయిన్ సమంతకు కజిన్‌గా అలరించారు. తర్వాత మనం, హార్ట్ అటాక్ వంటి సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్, సెకండ్ హీరోయిన్ వంటి పాత్రలతో సరిపెట్టుకుంది తేజస్వి.
ఈ క్రమంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కళ్లలో పడిన ఆమె.. ఐస్‌క్రీమ్ మూవీ ద్వారా తొలిసారిగా హీరోయిన్‌గా ఛాన్స్ పట్టేసింది. ఈ సినిమాలో అందాల ఆరబోత చేసినా తేజస్వికి పెద్దగా కలిసి రాలేదు. తర్వాత లవర్స్, అనుక్షణం, మళ్లీమళ్లీ ఇది రాని రోజు, పండగ చేస్కో, కేరింత, సుబ్రమణ్యం ఫర్ సేల్, శ్రీమంతుడు, జత కలిసే, కృష్ణాష్టమి, మిస్టర్, బాబు బాగా బిజీ, బాలకృష్ణుడు, జాంబీ రెడ్డి, కమిట్‌మెంట్ వంటి సినిమాల్లో నటించింది.
ఈ ఫేమ్‌తో మెగా రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు 2 సీజన్‌లో దాదాపు ఆరు వారాల పాటు హౌస్‌లో ఉండి కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యారు తేజస్వి మదివాడు. బిగ్‌బాస్‌తో బాగా పాపులర్ అయినా ఆమెకు అవకాశాలు మాత్రం దక్కలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత కమిట్‌మెంట్ మూవీలో కనిపించింది తేజస్వి మదివాడ. తాజాగా ఆమె నటించిన వెబ్ సిరీస్ అర్ధమైందా అరుణ్ కుమార్ వెబ్ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే తేజస్వి తన సినిమాలు, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలాగే బోల్డ్ ఫోటో షూట్‌లతో కుర్రకారును రెచ్చగొడుతుంటారు. తాజాగా వైట్ కలర్ డ్రెస్‌లో రాజకుమారిలా రెడీ అయి తేజస్వి చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది. మరి ఇంకేందుకు ఆలస్యం మీరూ చూసేయండి.


Click it and Unblock the Notifications











