లిప్‌లాక్ కోసం ఆ హీరోని నేనే సెలెక్ట్ చేసుకొన్నా.. అతడితో అయితే.. తేజస్వి మదివాడ హాట్ కామెంట్
టాలీవుడ్ హీరోయిన్, బిగ్‌బాస్ తెలుగు ఫేమ్ తేజస్వి మదివాడ నటించిన కమిట్‌మెంట్ చిత్రం ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ సినిమాకు లక్ష్మీకాంత్ చెన్నా దర్శకుడు. బల్‌దేవ్ సింగ్, నీలిమా టీ నిర్మించారు. సాజీష్ రాజేంద్రన్, నరేష్ రానా సినిమాటోగ్రఫిని అందించారు. నరేష్ కుమారన్ సంగీతం అందించారు. ఈ సినిమా విడుదల నేపథ్యంలో తెలుగు హీరోయిన్లకు ప్రాధాన్యం గురించి తేజస్వి మదివాడ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

బిగ్‌బాస్‌తో నా ఫేట్ మారింది..
నేను ఇండిపెండెంట్ అమ్మాయిని. నేను జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించాను. అలాంటి జాబ్ చేస్తే డబ్బు సంపాదించడం కష్టం. అందుకే సినిమాల్లోకి వచ్చాను. ఏడాదికి మూడు సినిమాలైనా చేస్తే నా లైఫ్ సక్రమంగా ఉంటుంది. అందుకే నాకు ఇచ్చే ఆఫర్లనీ చేసుకొంటూ వెళ్తున్నాను. బిగ్‌బాస్‌లోకి వెళితే కెరీర్ గ్రాఫ్ సరిగా ఉండదని అనుకొంటారు. కానీ అలాంటిదేమీ ఉండదు. బిగ్‌బాస్‌కు వెళ్లడం వల్ల ఇల్లు, కారు కొనుకొన్నాను. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉంది అని తేజస్వి చెప్పారు.

అందం, టాలెంట్ ఉన్నా
టాలెంట్, అందం అన్నీ ఉన్నా నాకు ఇంకా సరైన బ్రేక్ రాలేదని అనుకొంటున్నాను. ప్రతీ విషయానికి ఒక్కో టైమ్ ఉంటుంది. రవితేజకు ఓ టైమ్ వచ్చిన తర్వాత స్టార్ హీరో అయ్యాడు. మన టైమ్ కోసం వెయిట్ చేయాలి. కొందరికి 16 ఏళ్లకే బ్రేక్ వస్తుంది. కొందరికి 30, 40 ఏళ్లకు బ్రేక్ వస్తుంది. వాళ్లకు బ్రేక్ వచ్చిందని బాధపడలేదు. నటిగా నేను ప్రయత్నాలు చేస్తున్నాను. ఏదో ఒకరోజు నాకు బ్రేక్ వస్తుంది. అంత వరకు ఓపిగ్గా వేచి చూడాల్సిందే.

తెలుగు అమ్మాయిలకు ఆఫర్లు
మన డైరెక్టర్లు తెలుగు అమ్మాయిలకు ఆఫర్లు ఇవ్వడం లేదు. పొరుగింటి పుల్లకూర రుచి అనే విధంగా ఉన్నారు. నేను మేనేజర్లను పెట్టుకొన్నాను. అన్నీ చేశాను. కేవలం తెలుగు అమ్మాయిని కావడం వల్లే గుర్తింపు లభించడం లేదు. తెలుగు అమ్మాయిలను పెట్టుకొంటే చాలా రకాల లాభాలు ఉన్నాయి. స్క్రిప్టు చెప్పడానికి ఈజీ అవుతుంది. డైలాగ్స్, ఫెర్ఫార్మెన్స్ బెటర్‌గా వస్తుంది అని అన్నారు.

బయటి హీరోయిన్లకే ఛాన్సులు
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ పట్టించుకోరు. బయటి నుంచి హీరోయిన్లకే ఛాన్సులు ఇస్తారు. ప్రతిభ, అందం అవన్నీ ఏమీ పట్టించుకోరు. ఒకసారి రవితేజ నాతో మాట్లాడుతూ.. కొన్ని రోజులు బాంబేకి వెళ్లిరా అని సలహా ఇచ్చాడు. కానీ నాకు అంత స్తోమత లేదు. కొన్నిసార్లు నేను పిచ్చి క్యారెక్టర్లు కూడా చేయడం వల్ల సరైనా అవకాశాలు రాలేకపోయాయి.

కమిట్‌మెంట్ కావాలంటున్నారని
కమిట్‌మెంట్, కాంప్రమైజ్ కారణంగా నేను పెద్దగా ఇబ్బంది పడలేదు. ఆరంభంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమాలు రావడం వల్ల నాకు అలాంటి పరిస్థితులు చాలా తక్కువే. నేను మాట్లాడే తీరు వల్ల కొందరు నా వద్ద అలాంటివి మాట్లాడటానికి భయపడేవారు. దాని వల్ల కొన్ని అవకాశాలు చేజారి ఉంటాయి. వస్తే నా వద్దకు అక్కా, చెల్లెలు పాత్రలు ఇస్తున్నారు. లేదంటే.. కమిట్‌మెంట్ అడుగుతున్నారు అని తేజస్వి తెలిపారు.

లిప్‌లాక్ కోసం అతడిని
కమిట్‌మెంట్ సినిమాలో నా హీరోను నేనే సెలెక్ట్ చేసుకొన్నాను. అతడు నా ఫ్రెండ్ శ్రీనాథ్ మాగంటి ఈ సినిమాలో నాకు పార్ట్‌నర్‌గా నటించాడు. ముద్దు సీన్లలో నటించడానికి చాలా కంఫర్ట్ ఉంటుందని శ్రీనాథ్‌ను ఎంపిక చేసుకొన్నాను. తెలియని వాళ్లతో కిస్ సీన్లలో నటించడం కంటే.. తెలిసిన వాళ్లతో లిప్‌లాక్ చేస్తే కొంత సౌలభ్యం ఉంటుంది. సినిమాకు అవసరమైతే నేను కిస్ సీన్లలో నటించడం తప్పు కాదు అనేది నా అభిప్రాయం. కమిట్‌మెంట్ నచ్చితే చూడండి.. నచ్చకపోతే చూడకండి అని తేజస్వి అన్నారు.


Click it and Unblock the Notifications











