ఆ మూవీలో న్యూడ్‌గా.. రాత్రికి రాత్రే కెరీర్ నాశనం.. డైరెక్టర్‌పై తేజస్వి మదివాడ షాకింగ్‌గా!

తెలుగు సినిమా పరిశ్రమలో టాలెంటెడ్ యాక్టర్లలో తేజస్వి మదివాడ ఒకరనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అందం, అభినయం కలిసి ఉన్న అందాల భామ టాలీవుడ్‌లో ఎందుకు రాణించలేకపోయిందనే ప్రశ్నలు అందర్నీ వెంటాడుతుంటాయి. అయితే తన కెరీర్ అంతగా ఊపందుకోకపోవడానికి ప్రధాన కారణం ఆ డైరెక్టర్ మూవీలో చేసిన న్యూడ్ సీన్ అని తాజాగా ఆమె ఓ సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలో వెల్లడిస్తూ..

నవదీప్ నటించిన లవ్ మౌళి అనే సినిమా ప్రమోషన్స్‌లో యాంకర్‌గా తేజస్వి పాల్గొన్నారు. హీరోయిన్లు పంఖూరి గిద్వానీ, భావన సాగితో ఆమె మాట్లాడుతూ.. బోల్డ్ అండ్ కామెంట్స్ వదిలారు. తన జీవితంలో చేసిన సినిమాలు, వాటిలో చేసిన తప్పులను ఆమె చెప్పకొంటూ కనిపించారు. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ డైరెక్షన్‌లో చేసిన ఐస్ క్రీమ్ సినిమా తన కెరీర్‌ను తలకిందులు చేసిందంటూ ఆమె షాకింగ్ న్యూస్ బయటపెట్టారు.

Tejaswi Madivada revealed how intimacy Scenes in RGV s Ice Cream movie at Love Mouli promotions

నేను నా కెరీర్‌లో చాలా శృంగార సన్నివేశాల్లో, సన్నిహితంగా ఉండే సీన్లలో నటించాను. అలాంటి సీన్లలో నటించినప్పుడు దర్శకుడు అవనీంద్ర ఎలా ట్రీట్ చేశాడు. ఆ సీన్లలో మీరు కంఫర్ట్‌గా ఉండటానికి ఆయన ఎలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేశారు అని హీరోయిన్లను తేజస్వి ప్రశ్నించారు.

కానీ ఆర్జీవి రూపొందించిన ఐస్ క్రీమ్ సినిమాలో తాను చేసినప్పుడు ఓ న్యూడ్ ఫోటో బయటకు వెళ్లింది. 10 ఏళ్ల క్రితం చేసిన ఐస్ క్రీమ్ సినిమాలోని ఓ ఫోటో వైరల్ అయింది. అయితే నేను చేసిన సీన్ రాంగ్‌గా ప్రొజెక్ట్ అయింది. ఎందుకంటే అలాంటి సీన్లను చూపించకుండా సెన్సార్ బోర్డు నియంత్రిస్తుంది. సినిమాల్లో న్యూడ్ సీన్లు పెట్టడానికి చాన్స్ ఉండదు అని తేజస్వి వెల్లడించింది.

Tejaswi Madivada revealed how intimacy Scenes in RGV s Ice Cream movie at Love Mouli promotions

రాంగోపాల్ వర్మ రిలీజ్ చేసిన న్యూడ్ సీన్ కారణంగా మీడియాలో వచ్చిన ఆర్టికల్స్ నాపై దుష్ప్రభావం చూపాయి. అప్పటి వరకు పక్కింటి అమ్మాయిగా ఉండే నా ఇమేజ్‌ను దెబ్బ తీశాయి. ఒక్క ఆర్టికల్ వల్ల రాత్రికి రాత్రే హీరోయిన్ నుంచి నేను క్యారెక్టర్ ఆర్టిస్టు స్థాయికి పడిపోయాను. ఇలాంటి సీన్లు సినిమాలో ఉంటాయి. కాబట్టి ఇలాంటి సీన్లను మీరు ఎలా చేశారు అంటూ ఆమె అడిగింది.

ఇక లవ్ మౌళి చిత్రం రిలీజ్‌కు ముందు భారీ బజ్ క్రియేట్ చేస్తున్నది. అవనీంద్ర అనే నూతన దర్శకుడు ఈ సినిమాకు ర‌చ‌న, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాధ్యతలను కూడా నిర్వర్తించాడు. నవదీప్ హీరోగా వస్తున్న ఈ సినిమా కంటెంట్ ఇప్పటికే అంచనాలు పెంచేలా చేసింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X