twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీరెడ్డి చేసేవన్నీ చేసేసి ఇప్పుడు నీతులా? ఘాటుగా స్పందించిన తేజస్వి మదివాడ

    |

    టాలీవుడ్ హీరోయిన్, బిగ్‌బాస్ తెలుగు ఫేమ్ తేజస్వి మదివాడ నటించిన కమిట్‌మెంట్ చిత్రం ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ సినిమాకు లక్ష్మీకాంత్ చెన్నా దర్శకుడు. బల్‌దేవ్ సింగ్, నీలిమా టీ నిర్మించారు. సాజీష్ రాజేంద్రన్, నరేష్ రానా సినిమాటోగ్రఫిని అందించారు. నరేష్ కుమారన్ సంగీతం అందించారు. ఈ సినిమా విడుదల నేపథ్యంలో తేజస్వి మదివాడ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

    అడల్ట్ సినిమాలు చేస్తే తప్పేంటి?

    అడల్ట్ సినిమాలు చేస్తే తప్పేంటి?


    అడల్ట్ కంటెంట్ సినిమాలు ఎందుకు చేస్తున్నారనే ప్రశ్నను చాలా మంది అడుగుతున్నారు. అడల్ట్ కంటెంట్ లేకుండా ఏ ఒక్కరి వ్యక్తిగత జీవితం ఉండదు. అలాంటి విషయాలు చర్చించడం తప్పుకాదు. అవకాశాలు లేకపోవడం వల్ల అడల్ట్ కంటెంట్ సినిమాలు చేస్తున్నానని అనడం తప్పు. నాకు ఆఫర్లు ఉన్నప్పుడే నేను ఐస్‌క్రీమ్ అడల్ట్ కంటెంట్ సినిమా చేశాను. అలాగని.. అడల్ట్ కంటెంట్ సినిమాలు చేసిన వారంతా స్టార్స్ అయిపోతారని అనుకోవద్దు. కంటెంట్ నచ్చితే నేను దానిని పట్టించుకోను అని తేజస్వి చెప్పారు.

    సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నా

    సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నా

    సినిమా పరిశ్రమలోకి వచ్చి నేను తొమ్మిదేళ్లు అయింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. నాకు ఇంకా సరైన బ్రేక్ రాలేదు. అందుచేత నేను ఇంకా అప్‌కమింగ్ యాక్టర్‌ అనే అనుకొంటాను. బిగ్‌బాస్ ద్వారా నాకు మంచి గుర్తింపు వచ్చింది. సినిమాలు, ఆన్ స్క్రీన్ ద్వారా నాకు గుర్తింపు ఇంకా రాలేదు. నా ప్రతిభకు గుర్తింపు వచ్చేంత వరకు నేను కష్టపడుతూనే ఉంటాను అని తేజస్వి చెప్పారు. 21 ఏళ్లలో నేను కెరీర్ ప్రారంభించాను. ఇప్పుడు 30 ఏళ్ల నాకు. ఏదో ఒక ఏజ్‌లో నాకు సక్సెస్ వస్తుందని బలంగా నమ్ముతున్నాను అని తేజస్వి చెప్పారు.

    దర్శకుడు కమిట్‌మెంట్ అడిగారా అంటే

    దర్శకుడు కమిట్‌మెంట్ అడిగారా అంటే

    దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా నన్ను ఏ కమిట్‌మెంట్ అడగలేదు. ఏదైనా కమిట్‌మెంట్ అడిగితే సరిగా నటించలేం. గిచ్చి..గిల్లి నటించమని అడిగితే ఫీల్ ఉండదు. నీకు నచ్చింది నీవు చేయమని లక్ష్మీకాంత్ నాకు చెప్పారు. నచ్చింది చేయడం, ఫ్రీడమ్ వల్ల ఈ పాత్రను చాలా ఎఫెక్టివ్‌గా చేశాను. ఆయన కమిట్‌మెంట్ అడగకుండా మంచి పనిచేశారు. కమిట్‌మెంట్ అనే పదం సినిమా ఇండస్ట్రీలో బాగా వినిపించే పదం. అందుకే ఈ సినిమాకు కమిట్‌మెంట్ అని పెట్టాం అని తేజస్వి తెలిపారు.

    సినిమా పరిశ్రమలో అలాంటి చేదు అనుభవాలు

    సినిమా పరిశ్రమలో అలాంటి చేదు అనుభవాలు


    మహిళా సాధికారిత గురించి చర్చించే చిత్రం కమిట్‌మెంట్. డర్టీ పిక్చర్ సినిమాలో డర్టీ లేకుండా ఉండదు. పిక్చర్ విత్ డర్టీ ఈ సినిమా. తెలుగులో మరో డర్టీ పిక్చర్ లాంటింది. ప్రేక్షకులకు చాలా నచ్చుతుంది. ఈ సినిమా నా నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. పెద్ద పెద్ద డైరెక్టర్లను కలిసినప్పుడు వారు మాట్లాడే మాటలకు కొత్తగా వచ్చే అమ్మాయి ఎలా మాట్లాడుతుందనే కోణంలో ఉంటుంది. నా కెరీర్ ఆరంభంలో శ్రీకాంత్ అడ్డాల, రాంగోపాల్ వర్మ, పూరి జగన్నాథ్ నా తొలి చిత్ర దర్శకులు. వారి వద్ద పనిచేయడం వల్ల ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలిసింది. తెలుగు అమ్మాయిని కావడం వల్ల ఆరంభంలో ఎలా మాట్లాడాలో తెలియని పరిస్థితి. అలాంటి సిట్యుయేషన్‌ను తెర మీద ఫర్‌ఫెక్ట్‌గా పెర్ఫార్మ్ చేశాను అని తేజస్వి అన్నారు

    శ్రీరెడ్డిపై తేజస్వి సెటైర్

    శ్రీరెడ్డిపై తేజస్వి సెటైర్

    కమిట్‌మెంట్ సినిమాలో శ్రీరెడ్డి గురించి కూడా ఉంటుంది. రాంగోపాల్ వర్మ గురించి కూడా ఉంది. మనకు ఏదైనా చేయాలని ఉంటే.. చేసేయాలి. కానీ శ్రీరెడ్డి చేసేటివన్నీ చేసి.. ఇతరులపై ఆరోపణలు చేయడం ఎందుకో అర్ధం కాదు. మీటూ ఉద్యమం అలాంటి కామెంట్లు చేయడం సరికాదు. ఇలాంటి విషయాలన్నీ కమిట్‌మెంట్ సినిమాలో ఉంటాయి. కమిట్‌మెంట్‌లో నా పాత్ర పేరు తేజస్వి. నా క్యారెక్టర్‌ను నేనే ప్లే చేస్తున్నాను అని తేజస్వి అన్నారు.

    English summary
    Actor and Bigg Boss Telugu fame Tejaswi Madivada's latest movie commitment. This movie is set to release on August 19th. Here is the Tejaswi's exclusive Interview.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X