Bigg Boss కౌశల్ ఆర్మీ టార్చర్.. ఫుల్లుగా తాగేసా.. అందుకే అలా అయ్యాను: తేజస్వి

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో కంటెస్టెంట్స్ గా పాల్గొన్న ప్రతీ ఒక్కరు కూడా కౌశల్ ఆర్మీ బారిన పడ్డవారే. రెండవ సీజన్ లోనే ఊహించని విదంగా కౌశల్ మండా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు. ఏకంగా హోస్ట్ నానిపై కూడా ప్రభావం పడింది అంటే అతని రేంజ్ ఎక్కడికి వెళ్లిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక అలాంటి కౌశల్ ఇప్పుడు ఎక్కడ అంటూ తేజస్వి మాధివడా ఇటీవల ఒక కామెంట్ చేసింది. కౌశల్ మండా కౌశల్ ఆర్మీ కారణంగా తను చాలా ఇబ్బంది పడినట్లు ఆమె తెలియజేసింది పూర్తి వివరాల్లోకి వెళితే...

కౌశల్ ఆర్మీ ఎటాక్

కౌశల్ ఆర్మీ ఎటాక్

బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న తేజస్వి మదివాడ తప్పకుండా టాప్ ఫైనల్స్ వరకు వెళ్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఆమె అంతకంటే ముందుగానే ఎలిమినేట్ కావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక విధంగా తేజస్వి అనవసరంగా తొందరపడి మాట్లాడినట్లు కౌశల్ గ్యాంగ్ అయితే ఎక్కువగా ఆమెపై నెగటివ్ ప్రచారాలు చేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.

మనోవేదనకు..

మనోవేదనకు..

మొదట సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమా ద్వారా గుర్తింపు అందుకున్న తేజస్వి మదివాడ ఆ తర్వాత ఇండస్ట్రీలో ఎంతోకొంత ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కనిపిస్తూ వచ్చింది. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ లో ఆమె కనిపించిందో ఆ తర్వాత రెండేళ్ల వరకు మళ్లీ సినిమాలు చేసే పరిస్థితి ఏర్పడలేదు. ఒక విధంగా కౌశల్ ఆర్మీ కారణంగానే తీవ్రంగా మనోవేదనకు గురి అయినట్లు ఆమె వివరణ ఇచ్చింది.

కౌశల్ ఎక్కడ?

కౌశల్ ఎక్కడ?

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలావరకు నా స్నేహితులందరూ కూడా నన్ను గట్టిగా హగ్ చేసుకుని బాధపడినట్లుగా తేజస్వి తెలియజేసింది. ఎందుకంటే తనపై ఊహించని విధంగా నెగిటివ్ కామెంట్స్ రకరకాల చెత్త మీమ్స్ వైరల్ అయ్యాయి.. ఆ విధంగా ఒక వ్యక్తిపై నెగటివ్ ప్రచారం చేయడం తాను ఎన్నడూ చూడలేదు. నాపై అలా చేశారు సరే. మరి ఇప్పుడు కౌశల్ కు ఎంతవరకు హెల్ప్ అయ్యింది. అతను ఎక్కడ? అని తేజస్వి వివరణ ఇచ్చింది.

 ఆ స్థాయికి వచ్చేశా

ఆ స్థాయికి వచ్చేశా

ఇప్పుడైతే బిగ్ బాస్ లో నుంచి బయటకు వచ్చానో అప్పుడే కౌశల్ ఆర్మీ విధానానికి చాలా మన వేదనకు గురి అయ్యాను. దాదాపు నేను మళ్ళీ సినిమాల్లో నటించకూడదు అనే స్థాయికి వచ్చేసాను. ఇక దేశ విదేశాలు తిరిగేసి కాస్త ప్రశాంతతను కూడా వెతుక్కోవాల్సి వచ్చింది. ఇక మొత్తానికి కమిట్మెంట్ అనే సినిమా కథ నచ్చడంతో ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాను.

 తాగాల్సి వచ్చింది..

తాగాల్సి వచ్చింది..

ఒక విధంగా బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కొంత ఒత్తిడికి లోనవడంతో అప్సెట్ అవ్వాల్సి వచ్చింది. అలాగే నా ఫ్రస్టేషన్ అంతా తీర్చుకోవడానికి కూడా తాగాల్సి వచ్చింది అందుకే కమిట్మెంట్ సినిమాల్లో నేను గతంలో ఎప్పుడు లేని విధంగా కనిపిస్తాను. లావు అయినట్లు కూడా అనిపిస్తుంది అని తేజస్వి మదివాడ వివరణ ఇచ్చింది. ఇకనుంచి విభిన్నమైన స్క్రిప్ట్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తానని ప్రస్తుతం మరో రెండు ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నట్లు ఈ బ్యూటీ తెలియజేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X