పవన్ నాతో అలా బిహేవ్ చేస్తారని అనుకోలేదు.. ఆయన రియల్ క్యారెక్టర్ అదే: తెలుగు యంగ్ హీరోయిన్
చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగు సినిమా రంగంలో మాత్రమే లోకల్ అమ్మాయిలు తక్కువగా కనిపిస్తుంటారు. అలా ఇప్పుడు కొందరు మాత్రమే మూవీ ఆఫర్లను అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో అనన్య నాగళ్ల ఒకరు. అందంతో పాటు అభినయంతో మెప్పించిన ఈ చిన్నది.. టాలీవుడ్‌లో వరుసగా సినిమాలను చేస్తూ దూసుకుపోతోంది. దీంతో ఎప్పుడూ ఫుల్ బిజీగానే గడుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య నాగళ్ల.. పవన్ కల్యాణ్ రియల్ క్యారెక్టర్ గురించి మాట్లాడింది. ఆ వివరాలను మీరే చూసేయండి మరి!
షాదీ నుంచి మల్లేశంతో
అనన్య నాగళ్ల మొదట్లో యాక్టింగ్ కోర్స్‌లు పూర్తి చేసింది. ఆ తర్వాత ఈ అమ్మడు 'షాదీ' అనే షార్ట్ ఫిల్మ్‌తో నటిగా వచ్చింది. ఇందులో ఆమె చేసిన నటనకు విశేషమైన స్పందన దక్కింది. అలాగే, 2017లో షార్ట్ ఫిల్మ్‌ల కెటగిరీలో ఆమెకు సైమా అవార్డు వచ్చింది. ఈ క్రమంలోనే అనన్య నాగళ్ల 'మల్లేశం' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంటరై తనదైన నటనతో అలరించింది.

పవన్‌తోనే.. ఆ మూవీల్లో
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్'లోనూ అనన్య.. దివ్య నాయక్ అనే పాత్రను చేసి అలరించింది. ఈ మూవీలోనూ నటన పరంగా సత్తాను చాటుకుంది. దీని తర్వాత ఆమె 'ప్లేబ్యాక్', 'మ్యాస్ట్రో', 'ఊర్వసివో రాక్షశివో', 'శాకుంతలం', 'మళ్లీ పెళ్లి' అనే చిత్రాల్లోనూ సందడి చేసింది. కానీ, సోలోగా అనన్య భారీ హిట్లను మాత్రం అందుకోలేదు.

ఇప్పుడు ఆ మూవీలతో
తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల నటించిన చిత్రాల ఫలితాలను పక్కన పెడితే.. ప్రతి దానిలోనూ ఆమె తనదైన రీతిలో నటనను కనబరించింది. ఫలితంగా మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుంటోంది. ఇటీవలే అనన్య 'తంత్ర', 'డార్లింగ్' అనే సినిమాలతో వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ తెలుగు హీరోయిన్ 'పొట్టేల్' అనే సినిమాతో రాబోతుంది.

పవన్ క్యారెక్టర్ గురించి
వరుస పెట్టి సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా యమ బిజీగా గడుపుతోన్న తెలుగు పిల్ల అనన్య నాగళ్ల.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో పవన్ కల్యాన్ క్యారెక్టర్ గురించి మాట్లాడింది. 'సెట్స్‌లో పవన్ కల్యాణ్ గారు చాలా సింపుల్‌గా ఉంటారు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఆయన కనిపెడతారు. వెంటనే అలాంటి వాళ్ల దగ్గరకెళ్లి వాళ్ల మూడ్ మార్చేలా చూస్తారు' అని చెప్పింది.
డిస్కర్షన్స్ చాలా డీప్
అనన్య కంటిన్యూ చేస్తూ.. 'నా వరకూ వస్తే నేను కంఫర్ట్‌గా లేనప్పుడు నా దగ్గరకు వచ్చి 'నేను మల్లేశం చూశాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు' అంటూ మాట్లాడారు. అంత పెద్ద స్టార్ హీరోకు నాతో ఇలా మాట్లాడాల్సిన అవసరమే లేదు. కానీ, ఆయన చాలా బాగా బిహేవ్ చేశారు. పవన్ సార్‌తో డిస్కర్షన్స్ కూడా చాలా డీప్‌గా ఉంటాయి. ఆయన తిన్నావా? ఉన్నావా? ఇలాంటివి కాకుండా సమాజం గురించి మాట్లాడుతుంటారు' అని వివరించింది.

రియల్ క్యారెక్టర్ అదే
అనన్య చివర్లో 'మనం ఆన్‌స్క్రీన్ చూసే పవర్ స్టార్‌కు, ఆఫ్ స్క్రీన్ చూసే పవన్ సార్‌కు చాలా డిఫరెన్స్ ఉంది. సెట్స్‌లో ఆయన చాలా నార్మల్ కంటే తక్కువగా ఉంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది నేను పవన్ సార్‌ను చూసిన తర్వాతనే నేర్చుకున్నాను. వకీల్ సాబ్ సెట్స్‌లో ఉన్నప్పుడు ఆద్య అక్కడకు వచ్చింది. తనను వెనుక నుంచి హత్తుకుని తలపై ముద్దు పెట్టారు. అది చూసి నాకు ఎంతో క్యూట్‌గా అనిపించింది' అని తెలిపింది.


Click it and Unblock the Notifications











