పైన ఏమీ వేసుకోకుండానే తెలుగు పిల్ల రచ్చ: ఆ యాంగిల్ నుంచి పరువాలు చూపిస్తూ!
గతంలో కంటే ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లోని ఎంతో మంది అమ్మాయిలు టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోన్నారు. అందులో యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల ఒకరు. సాదాసీదాగానే సినిమాల్లోకి అడుగు పెట్టిన ఈ చిన్నది.. అనతి కాలంలోనే విశేషమైన గుర్తింపుతో పాటు ఎనలేని క్రేజ్‌ను దక్కించుకుంది. దీంతో చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ అనన్య నాగళ్ల యమ సందడి చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ భామ.. ఓ హాట్ పిక్‌ను షేర్ చేసింది. దాన్ని మీరే చూడండి!

సినిమాల కంటే ముందే అవార్డ్
యాక్టింగ్‌పై ఉన్న ఇంట్రెస్ట్‌తో అనన్య నాగళ్ల నటనలో శిక్షణ తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ 'షాదీ' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఇందులో ఆమె చేసిన నటనకు భారీ స్పందన దక్కింది. అంతేకాదు, ఇందులో నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుని అందరి దృష్టిలో పడింది. ఈ క్రమంలోనే 2017లో షార్ట్ ఫిల్మ్‌ల కెటగిరీలో సైమా అవార్డునూ అందుకుంది.

హీరోయిన్‌గా ఎంట్రీ.. దివ్య రోల్
'మల్లేశం' అనే సినిమాతో అనన్య నాగళ్ల హీరోయిన్‌గా పరిచయమైంది. ఇందులో నేచురల్ యాక్టింగ్‌తో మెప్పించింది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ అయింది. ఆ వెంటనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్'లోనూ అనన్య.. దివ్య నాయక్ అనే పాత్రను చేసి అలరించింది. ఈ మూవీలోనూ మంచి నటనను కనబరిచి తన రేంజ్‌ను మరింతగా పెంచుకుంది.

వరుస హిట్లతో లక్కీ భామగానే
సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అనన్య నాగళ్ల పలు సినిమాల్లో మాత్రమే చేసింది. అయితేనేం అవన్నీ ఆమె కెరీర్‌కు బలంగానే మారాయి. ఇలా రెండేళ్ల క్రితం 'ప్లేబ్యాక్' అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత 'మాస్ట్రో'లోనూ చిన్న పాత్రను చేసింది. అలా ఇప్పటి వరకూ చేసిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. దీంతో ఆమెకు టాలీవుడ్‌లో లక్కీ బ్యూటీగా గుర్తింపు వచ్చింది.

ఎన్నో చిత్రాలతో బిజీగా మారి
అచ్చ తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల ఇప్పటి వరకూ చేసిన సినిమాలు అన్నీ హిట్ అవడంతో.. ఆమెకు ఆఫర్లు మరింతగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె 'ఊర్వసివో రాక్షశివో', 'శాకుంతలం' సినిమాల్లో నటించింది. అలాగే, సోహైల్ నటిస్తోన్న 'బూట్‌కట్ బాలరాజు' మూవీలోనూ చేస్తోంది. దీనితో పాటు మరికొన్ని తెలుగు, తమిళ ప్రాజెక్టులను సైతం మొదలెట్టింది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా
చేతి నిండా సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా యమ బిజీగా గడుపుతోన్న తెలుగు పిల్ల అనన్య నాగళ్ల.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన సినీ కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు విశేషాలను అందరితో చేసుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ ఫాలోయింగ్‌ను బాగా పెంచుకుంటోంది.

అందాలను ఆరబోస్తూ రచ్చ
ఎన్నో ఏళ్లుగా సోషల్ మీడియాలో తెగ సందడి చేసేస్తోన్న అచ్చ తెలుగమ్మాయి అనన్య నాగళ్ల అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇలా ఈ భామ ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. మరీ ముఖ్యంగా తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో కుర్రకారును టెంప్ట్ చేసేస్తోంది. దీంతో అనన్య తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటూ ఓ రేంజ్‌లో ట్రెండింగ్ అవుతోంది.

అదిరిపోయే పిక్ వదిలిందిగా
అనన్య నాగళ్ల తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బ్యాక్ ఏమీ లేకుండానే చీరను చుట్టుకుని హాట్ షో చేస్తూ ఫోజులిచ్చింది. ఫలితంగా ఆమె అందాలు చూపరులకు భారీ స్థాయిలో కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇది భారీ స్థాయిలో వైరల్‌గా మారిపోయింది.


Click it and Unblock the Notifications











