తెలుగు హీరోయిన్ గ్లామర్ షో.. కిక్కెక్కించేలా ఖతర్నాక్ ఫోజులు
మిగిలిన భాషలకు చెందిన అమ్మాయిల్లా తెలుగు భామలు టాలీవుడ్‌లో పెద్దగా సందడి చేయడం లేదు. కొందరు మాత్రమే ఇక్కడ అరకొర అవకాశాలతో కెరీర్‌లను సాగిస్తున్నారు. అలాంటి వారిలో బెజవాడ చిన్నది డింపుల్ హయాతి ఒకరు. అందానికి అందం, నటనకు నటనతో అలరిస్తోన్న ఈ భామ.. ఆశించిన రీతిలో అవకాశాలను మాత్రం అందుకోలేకపోతోంది. అయినప్పటికీ తనదైన రీతిలో ప్రేక్షకులను అలరించే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో డింపుల్ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని గ్లామరస్ పిక్స్ వదిలింది. అవి మీరే చూడండి!
లోకల్ బ్యూటీ.. గల్ఫ్ మూవీ : విజయవాడకు చెందిన డింపుల్ హయాతి ముందుగా మోడల్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసింది. అందులో తన గ్లామర్‌తో మెప్పించి.. ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడింది. ఫలితంగా ఆమెకు అవకాశాలు భారీ స్థాయిలో వచ్చాయి. ఈ క్రమంలోనే డింపుల్ 'గల్ఫ్' అనే సినిమాతో నటిగా పరిచయం అయింది. దీని తర్వాత 'అభినేత్రి 2' మూవీలోనూ నటించి హైలైట్ అయిపోయింది.

ఆ సాంగ్‌తో సెన్సేషన్‌గానే : ఆరంభంలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ డింపుల్ హయాతికి ఆ తర్వాత ఆఫర్లు మాత్రం ఆశించినట్లుగా రాలేదు. ఈ పరిస్థితుల్లో 'గద్దలకొండ గణేష్' మూవీలో డింపుల్ 'సూపర్ హిట్టు' అనే స్పెషల్ సాంగ్‌లో సందడి చేసింది. ఇందులో ఆమె చేసిన స్టెప్పులతో తెలుగు రాష్ట్రాలు షేక్ అయ్యాయి. ఫలితంగా అప్పటి నుంచి ఈ బ్యూటీ సెన్సేషన్‌గా మారిపోయింది.
వరుస సినిమాలు చేసినా : 'అత్రంగి రే' అనే హిందీ సినిమాలోనూ డింపుల్ హయాతి నటించింది. అలాగే, 'వీరమై వాగై సూడుమ్' అనే తమిళ చిత్రంలో చేసింది. ఇక, తెలుగులో డింపుల్ రవితేజతో 'ఖిలాడి', గోపీచంద్‌తో 'రామబాణం' చిత్రాలు చేసింది. కానీ దురదృష్టవశాత్తూ ఈ మూవీలు పెద్దగా ఆడలేదు. ఫలితంగా ఆమెకు తెలుగులో ఇప్పుడు అసలు సినిమా అవకాశాలు రావడం లేదు.

కాంట్రవర్శీ.. సాంగ్‌తోనే : డింపుల్ హయాతి నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఈ పరిస్థితుల్లో ఈ అమ్మడు ఆ మధ్య ఓ వివాదంలో చిక్కుకుంది. ఈ గొడవ కారణంగా ఈ హీరోయిన్ కోర్టులు, పోలీస్ స్టేషన్ మెట్లూ ఎక్కాల్సి వచ్చింది. ఇక, డింపుల్ హాయాతి ప్రస్తుతం కమల్ హాసన్ 'ఇండియన్ 2' మూవీతో పాటు పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేయడానికి ఒప్పుకుందనే టాక్ వినిపిస్తోంది.
అందులో ఫుల్ యాక్టివ్‌గా : సినిమాల పరంగా అంతగా సక్సెస్ కాకున్నా.. సోషల్ మీడియా వల్ల మాత్రం డింపుల్ హయాతి ఫుల్ క్రేజ్‌ను తెచ్చుకుంది. అందుకే ఇందులో ఎప్పుడూ ఈ అమ్మడు యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ తెలుగు బ్యూటీ తరచూ తనకు, తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. తద్వారా తన రేంజ్ పెంచుకుంటోంది.

అందాల విందు ఇస్తూనే : ఎన్నో ఏళ్లుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న డింపుల్ హయాతి.. దీని ద్వారా తన అందాలతో కుర్రకారును కవ్విస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. మరీ ముఖ్యంగా ఓ రేంజ్‌లో క్లీవేజ్ షో చేస్తూ ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది. దీంతో డింపుల్ హయాతి తరచూ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారుతోంది.
డింపుల్ ఫొటోలు వైరల్ : సోషల్ మీడియాలో తనదైన శైలిలో అలరిస్తోన్న డింపుల్ హయాతి.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె డిజైనర్ డ్రెస్‌ను వేసుకుని కనిపించింది. ఫలితంగా ఈ ఫొటోల్లో ఆమె అందాలు హైలైట్ అవుతోన్నాయి. దీంతో వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది. తద్వారా డింపుల్ ఫొటోలు వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











