బీచ్‌లో తెలుగు పిల్ల అందాల ప్రవాహం: అబ్బా అనేలా ఈషా రెబ్బా ఫోజులు
ఇండియాలోని ఏ భాషను చూసుకున్నా లోకల్‌గా ఉన్న అమ్మాయిలే ఆయా ఇండస్ట్రీల్లో హవాను చూపిస్తుంటారు. కానీ, తెలుగులో మాత్రమే ఆ పరిస్థితి కనిపించడం లేదు. అయినప్పటికీ కొందరు తెలుగు భామలు తమదైన రీతిలో దూసుకుపోతోన్నారు. అందులో ఈషా రెబ్బా ఒకరు.
అందానికి అందం, నటనకు నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. పెద్ద ఆఫర్లను మాత్రం అందుకోవడం లేదు. అయినా కెరీర్‌ను ముందుకు తీసుకు వెళ్తోంది. ఇక, తాజాగా ఈషా రెబ్బా సోషల్ మీడియాలో తన బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరే లుక్కేయండి మరి!

ఆరంభంలోనే హిట్ కొట్టేసి: మోడలింగ్ రంగంలో తనదైన రీతిలో పేరు తెచ్చుకున్న తెలుగు అమ్మాయి ఈషా రెబ్బాకు సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' అనే మూవీతో నటిగా మారింది. ఆ వెంటనే 'అంతకు ముందు ఆ తర్వాత' అనే రొమాంటిక్ మూవీతో హీరోయిన్‌గా ఎంటరైంది. ఇందులో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అవడంతో ఈషాకు పేరు వచ్చింది.

వరుస ఆఫర్లు.. హిట్లు లేవు: మొదటి చిత్రమే హిట్ అవడంతో ఈషా రెబ్బాకు ఆఫర్లు భారీగానే వచ్చాయి. దీంతో ఈ అమ్మడు వరుసగా 'బందిపోటు', 'అమీతుమీ', 'దర్శకుడు', 'ఆ!', 'బ్రాండ్ బాబు', 'సుబ్రమణ్యపురం', 'రాగల 24 గంటల్లో' సహా ఎన్నో సినిమాలు చేసింది. అయితే, వీటిలో కేవలం రెండు, మూడు సినిమాలు మాత్రమే విజయాన్ని అందుకోవడం ఆమెకు మైనస్ అయింది.

ఆఫర్ల కోసం వేరే భాషల్లో: ఈషా రెబ్బా తెలుగులో ఎన్నో సినిమాలు చేసింది. కానీ, అందులో భారీ చిత్రాలు మాత్రం చాలా తక్కువగానే ఉన్నాయి. దీనికితోడు ఈ మధ్య కాస్త స్లో అయిపోయింది. ఫలితంగా ఈ తెలుగు పిల్ల వేరే భాషల్లో సినిమాలు చేయడానికి సన్నద్ధం అయింది. ఇందులో భాగంగానే మలయాళంలో 'ఒట్టు', తమిళంలో 'నితమ్ ఓరు ఓనమ్' వంటి చిత్రాల్లో నటించి అక్కడ క్రేజ్ తెచ్చుకుంది.

సిరీస్‌లలో రచ్చ.. షాక్‌లో: సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఈషా రెబ్బా వెబ్ సిరీస్‌లలో నటించేందుకు సిద్ధం అవుతోంది. ఇలా ఇటీవలే 'మాయాబజార్ ఫర్ సేల్', 'దయా' వంటి సిరీస్‌లలో నటించి సత్తా చాటుకుంది. అయితే, ఇటీవలే ఆమె 'మామా మశ్చీంద్రా' అనే సినిమాతో వచ్చింది. కానీ ఇది డిజాస్టర్ అయింది. అలాగే, తమిళంలో 'ఆయిరామ్ జన్మంగళ్' అనే మూవీ చేస్తోంది.

సోషల్ మీడియాలో బిజీ: సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తనకు లభించిన అవకాశాలను చేసుకుంటూ వెళ్తోన్నప్పటికీ ఈషా రెబ్బా.. ఎక్కువ సమయాన్ని సోషల్ మీడియాలోనూ గడుపుతోందని చెప్పాలి. ఇందులో తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విశేషాలను సైతం ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఇలా తన అభిమానులను సినిమాల కంటే ఎక్కువగా ఖుషీ చేస్తోంది.

అందాల ప్రవాహంతోనే: తెలుగు అమ్మాయిలు పెద్దగా హాట్ షో చేయరు అనే టాక్ ఉండేది. కానీ, సోషల్ మీడియాలో చాలా మంది రెచ్చిపోయి అందాలను ఆరబోస్తున్నారు. అందులో ఈషా రెబ్బా కూడా ఒకరు. అంతలా చాలా కాలంగా ఈ అమ్మడు తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈషా హద్దు చెరిపేసి మరీ పరువాలను ప్రదర్శిస్తూ యమ హైలైట్ అవుతోంది.
ఈషా పిక్స్ ఫుల్ వైరల్: ఈ మధ్యన డోస్ పెంచేసి రచ్చ రచ్చ చేస్తోన్న ఈషా రెబ్బా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు బీచ్‌లో టైట్ డ్రెస్‌లో పరువాలను ప్రదర్శిస్తూ రెచ్చిపోయింది. ముఖ్యంగా డిఫరెంట్ ఫోజులతో రెచ్చగొడుతోంది. దీంతో ఈషా రెబ్బా షేర్ చేసిన ఈ ఫొటోలకు మంచి రెస్పాన్స్ వచ్చి.. ఓ రేంజ్‌లో వైరల్ అయిపోతున్నాయి.


Click it and Unblock the Notifications











