వాళ్లకే శృంగార కోరికలు ఎక్కువ.. నాకు ఫీలింగ్స్ వస్తే ఆ పని చేస్తా: తెలుగు హీరోయిన్

గతంలో కంటే ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల నుంచి అమ్మాయిలు సినీ రంగంలోకి వస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే డేర్ అండ్ డాషింగ్‌గా ఉంటూ సెన్సేషన్ అవుతున్నారు. అలాంటి వారిలో గాయత్రి గుప్తా ఒకరు. ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాత్రలను పోషించిన ఈ చిన్నది.. వ్యవహార శైలి పరంగా మాత్రం బోల్డుగా ఉంటోంది. తద్వారా ఎన్నో వివాదాల్లో సైతం భాగం అయింది. ఈ పరిస్థితుల్లో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గాయత్రి గుప్తా.. అమ్మాయిల కోరికల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. అసలు ఆమె ఏం చెప్పిందో మీరే లుక్కేయండి!

అలా ఎంట్రీ.. ఈ మూవీల్లో
మొదట టీవీ ప్రోగ్రామ్‌ల ద్వారా గాయత్రి గుప్తా పరిచయం అయింది. అలా ఆరంభంలో యాంకర్‌గా చేసి బాగా పాపులర్ అయింది. అలాగే, పలు చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. ముఖ్యంగా గాయత్రి 'ఫిదా', 'ఐస్‌క్రీమ్ 2', 'కొబ్బరిమట్ట', 'మిఠాయి' సహా ఎన్నో చిత్రాల్లో నటించింది. అలాగే, 'పెళ్లికి ముందు', 'సీత ఆన్ ద రోడ్' అనే షార్ట్ ఫిల్మ్‌లతో ఫేమస్ అయింది.

Telugu Actress Gayathri Gupta Unexpected Comments On Ladies Feelings

కాస్టింగ్ కౌచ్... వివాదాలు

వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న సమయంలోనే గాయత్రి గుప్తా టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ అనే అంశం తెరపైకి తీసుకు వచ్చి సంచలనం అయింది. దీనిపై పోరాటాన్ని మొదలు పెట్టింది. అవకాశాలు ఇప్పిస్తామని తనను చాలా మంది మోసం చేశారని అప్పట్లో పెద్ద రాద్దాంతమే చేసేసింది. దీని తర్వాత కూడా బిగ్ బాస్‌తో పాటు కొన్ని వివాదాల్లో గాయత్రి భాగమైంది.

ఇప్పుడు ఆ ఆఫర్లతో బిజీ
తెలుగు అమ్మాయి గాయత్రి గుప్తా ఈ మధ్య కాలంలో ఆశించిన రీతిలో అవకాశాలను అందుకోవడం లేదు. కానీ, దొరికిన ప్రతి అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకుంటోంది. ఇలా ఈ మధ్య కాలంలో 'అన్‌స్టాపబుల్', 'ప్లాట్', 'డబుల్ ఇంజిన్' వంటి సినిమాలు చేసింది. అలాగే, గత ఏడాది వచ్చిన 'దయా' వెబ్ సిరీస్‌లో అద్భుతమైన పాత్రను చేసి అలరించింది.

Telugu Actress Gayathri Gupta Unexpected Comments On Ladies Feelings

అమ్మాయిలకే కోరికలని

ఈ మధ్య కాలంలో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోన్న గాయత్రి గుప్తా.. అప్పుడప్పుడూ యూట్యూబ్‌ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఫేమస్ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడింది. ఈ సందర్బంగా ఆమె యాంకర్ అడిగిన ప్రశ్నకు 'అబ్బాయిల కంటే అమ్మాయిలకే శృంగార కోరికలు ఎక్కువ' అని సమాధానం ఇచ్చింది.

కోరికల వల్లే అలాంటివి
ఈ ఇంటర్వ్యూలో గాయత్రి గుప్తా మాట్లాడుతూ.. 'అందరూ చెబుతున్నట్లుగానే అబ్బాయిల కంటే అమ్మాయిలకే శృంగార కోరికలు ఎక్కువగా ఉంటాయి. వీటి వల్లనే ఇల్లీగల్ ఎఫైర్లు కూడా పెరుగుతున్నాయి. కొద్ది రోజులు డేటింగ్ చేయడం, కోరికలు తీరగానే విడిపోవడం చేస్తున్నారు. పెళ్లైన వాళ్లు కూడా భర్త సుఖ పెట్టకపోతే ప్రత్యమ్నాయం చూసుకుంటున్నారు' అని చెప్పింది.

Telugu Actress Gayathri Gupta Unexpected Comments On Ladies Feelings

నేను ఆ పని చేస్తానంటూ

ఇదే ఇంటర్వ్యూలో గాయత్రి గుప్తా కంటిన్యూ చేస్తూ.. 'ఇప్పుడు అమ్మాయిలకు శృంగార కోరికలు వస్తే కంట్రోల్ చేసుకునే శక్తిని కూడా పెంచుకోవాలి. ఆకలి వేస్తే అన్నం తింటేనే పోతుంది. కానీ శృంగారం అలా కాదు. అయినా అమ్మాయిలు అలాంటి పరిస్థితులు వస్తే కంట్రోల్ చేసుకోవాలి. నా వరకూ నేను అయితే ఆ ఫీలింగ్స్ వస్తే కంట్రోల్ చేసుకుంటాను' అంటూ వివరించింది.

More from Filmibeat

Read more about: gayathri gupta fidaa
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X