twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తేలు కాటుకు గురైన సినీ నటి.. హుటాహుటిన హాస్పిటల్ కి.. తర్వాత ఏమైదంటే?

    |

    సినీతారలను దైవంగా భావించి వారికి గుడులు కట్టి పూజించే వెర్రి అభిమానులు ఉంటారు మన దేశంలో అభిమానం మనది. కానీ సినీ రంగం పైకి కనిపించేలా రంగుల ప్రపంచం కాదు. మనల్ని రెండున్నర గంటల పాటు ఎంటర్‌టైన్ చేయడానికి నటీనటులు ఎంతో శ్రమిస్తుంటారు. ఈ క్రమంలో ప్రాణాల మీదకు తెచ్చుకున్న వారు మాత్రమే కాదు, ప్రాణాలు కోల్పోయిన స్టార్లు కూడా ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. తాజాగా తెలుగు నటి ఒకరు తేలు కాటుకు గురి కావడం సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

    తేలు కాటుకు గురై

    తేలు కాటుకు గురై

    తెలుగు నటి హీనా తన రాబోయే మ్యూజిక్ వీడియో 'కాలా' కోసం తెలంగాణలో అరణ్యాలలో చిత్రీకరిస్తున్నప్పుడు తేలు కాటుకు గురైంది. అయితే వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం తరలించారు. ఈ సంఘటన గురించి మరింత వివరంగా వెల్లడిస్తూ హీనా మాట్లాడుతూ, "షూటింగ్ సమయంలో అడవిలో పాములు ఉన్నాయి మరియు నేను వాటిని నివారించడానికి ప్రయత్నించాను, కానీ దురదృష్టవశాత్తు తేలు కాటుకు గురయ్యాను' అని ఆమె వెల్లడించింది.

    విరుగుడు మందు ఇచ్చి

    విరుగుడు మందు ఇచ్చి

    వెంటనే ఆసుపత్రికి తరలించి విరుగుడు మందు ఇచ్చి మళ్లీ షూట్‌కి తీసుకెళ్లారు. మేకర్స్ నాకు విరామం ఇవ్వాలని కోరుకున్నారు, కానీ నేను షూట్ చేయడానికి ఇష్ట పడ్డాను, వీడియో కోసం వాస్తవంగా నా రక్తాన్ని ఇచ్చాను, "అని నటి నవ్వుతూ చెప్పుకొచ్చింది. ఆ రోజు మాత్రమే తేడా ఏమిటంటే నేను తేలు కాటుకు గురయ్యాను, నా అభిమాన నటుడు సల్మాన్ ఖాన్‌ ను పాము కరిచింది, " నన్ను తేలు కుట్టింది అని ఆమె పేర్కొంది.

    జీవిత ప్రయాణం అంటే కలలు కన

    జీవిత ప్రయాణం అంటే కలలు కన

    ఇక మ్యూజిక్ వీడియోకి స్టింగ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. "జీవిత ప్రయాణం అంటే కలలు కనడం మరియు ఆ కలను సాధించడం కోసం ఏదైనా చేయడం. జీవితం కంటే పెద్దదిగా ఊహించగల సామర్థ్యం జీవన సారాంశాన్ని ఏర్పరుస్తుందని ఆమె వేదాంతం చెప్పుకొచ్చింది. ఇక 'కాలా' చాలా మంది కలను చిత్రించే సంగీత ప్రయత్నమే'' అని ఆమె పేర్కొంది.

    ‘కాలా'మ్యూజిక్ వీడియో

    ‘కాలా'మ్యూజిక్ వీడియో

    ఇక తెలుగులో 'కాలా'అనే తన డ్రీమ్ మ్యూజిక్ వీడియో గురించి శేషు కెఎమ్‌ఆర్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో మ్యూజిక్ వీడియోను ప్రారంభించిన తన గురువు రామ్ గోపాల్ వర్మ ఫోటోలు కూడా పంచుకునారు. అలాగే ఆయన వర్మ సహా చాలా మంది చిత్ర దర్శకులతో కలిసి పని చేస్తున్నారు. 'కాలా' అనేది డిఓపి భార్గవ్ రావాడ ద్వారా గోవా మరియు హైదరాబాద్‌లోని సుందరమైన ప్రదేశాలలో చిత్రీకరించబడిన మ్యూజిక్ వీడియో. వాగ్దాటి మరియు అందమైన నటి హీనా ఎస్‌ని కలిగి ఉన్న ఈ పాటను ప్రసిద్ధ గాయని నేహా కరోడే ఆలపించారు.

     శేషు సంగీతం అందించగా

    శేషు సంగీతం అందించగా

    KMR కార్ప్ ప్రెజెంటేషన్ మరియు ప్లేబ్యాక్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్, మ్యూజిక్ వీడియోలో హీనా S నటించారు. శేషు KMR సంగీతం అందించగా కాన్సెప్ట్ మరియు దర్శకత్వం బాధతలతో పాటు సాహిత్యాన్ని కూడా కవి సిద్ధార్థ అందించారు. రాజ్ కుమార్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా సూర్యారెడ్డి ఎస్ఎస్ ఎడిటింగ్ మరియు విఎఫ్ఎక్స్ చేశారు. ఈ సాంగ్ త్వరలో విడుదల కాబోతోంది.

    English summary
    Telugu actress Heena was bitten by a Scorpion in a song shoot
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X