నా బాడీలో అవి బాలేవని చెప్పాడు.. అలా చేయగానే నచ్చేశాయి: బయటపెట్టిన తెలుగు నటి హిమజ
ఒకప్పుడంటే తెలుగు చిత్ర పరిశ్రమలో లోకల్ అమ్మాయిలకు అవకాశాలు దొరికేవి కాదు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోవడంతో ఎంతో మంది భామలు తమదైన రీతిలో అలరిస్తూ ముందుకు సాగుతోన్నారు. అలాంటి వారిలో హిమజ ఒకరు.
మొదట్లో బుల్లితెరపై సందడి చేసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దూసుకుపోతోంది. ఇలా చాలా కాలంగా వరుసగా సినిమాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో హిమజ ఓ అంశాన్ని బయటపెట్టింది. ఆ వివరాలను మీరే చూడండి!

ఆ సీరియల్‌తో పాపులర్
సినిమాల మీద ఉన్న మక్కువతో హైదరాబాద్ వచ్చిన హిమజ.. బుల్లితెరపై కెరీర్ ఆరంభించి సీరియళ్లలో నటించే అవకాశాన్ని అందుకుంది. 'స్వయంవరం' అనే సీరియల్ ద్వారా ఇండస్ట్రీలోకి పరిచయం అయిన ఆమె.. 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' అనే సీరియల్‌తో నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఎన్నో ఆఫర్లను సైతం అందుకుంది.

ఆ సినిమాలతో గుర్తింపు
హిమజ సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో చిత్రాల్లో మంచి పాత్రల్లో నటించింది. అందులో 'శివమ్', 'నేను శైలజ', 'ధృవ', 'శతమానంభవతి', 'స్పైడర్', 'ఉన్నది ఒకటే జిందగీ', 'వినయ విధేయ రామ', 'చిత్రలహరి', 'వరుడు కావలెను' సహా ఎన్నో చిత్రాల్లో మంచి పేరును తెచ్చాయి. దీంతో ఆమెకు సినిమా అవకాశాలు కూడా అదిరిపోయేలా వస్తున్నాయి.

బిగ్ బాస్ ఛాన్స్‌తో ఫుల్
వరుసగా సినిమాలు, షోలు చేస్తూ సాగిపోతోన్న సమయంలో హిమజ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చింది. ఇందులో తనదైన మార్కు చూపించి అందరి దృష్టినీ ఆకర్షించింది. దీనికితోడు నిజాయితీగా ఆడుతూ.. ఉన్నది ఉన్నట్లు చెబుతూ ప్రేక్షకుల నుంచి ఓట్లను రాబట్టింది. కానీ, మధ్యలోనే వెళ్లిపోయింది. అయినా ఆమె రేంజ్ ఫుల్లుగా పెరిగింది.

రేంజ్ పెంచే చిత్రాలు
కొన్నేళ్ల క్రితం హిమజ హీరోయిన్‌గా 'జ' అనే సినిమాను చేసింది. ప్రతాప్ రాజ్ హీరోగా నటించిన ఈ సినిమాను సైదిరెడ్డి చిట్టెపు తెరకెక్కించాడు. ఈ సినిమా ఓటీటీలో నేరుగా విడుదలైంది. అలాగే, హిమజ 'కనబడుటలేదు' అనే సినిమాలోనూ నటించింది. ఇందులో ఆమె ఓ రకంగా సైకో పాత్రను పోషించింది. ఇలా హిమజ ఎన్నో ప్రయోగాలు చేస్తూ మరింతగా దూసుకెళ్తోంది.
చాలా ఇబ్బంది పడ్డాను
చాలా ఏళ్లుగా సినీ రంగంలో తనదైన మార్కును చూపిస్తోన్న హిమజ తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో స్ట్రగుల్స్ గురించి ప్రస్తావించింది. 'సినిమాల్లోకి ఎంటరైన కొత్తలో నేను చాలా సందర్భాల్లో ఏడ్చాను. అందరిలాగే నేను కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాను. చాలా ఎత్తుపల్లాలను చూశాను. ఒకానొక సమయంలో ఇదంతా నావల్ల కాదని అనుకున్నాను' అని చెప్పింది.

పర్సనల్‌గా వద్దనుకుని
హిమజ కొనసాగిస్తూ.. 'ఈ సమాజం మనల్ని ఎలా చూస్తుంది అనేది పట్టించుకోకుండా.. మనం నిజాయితీగా ఉన్నామా లేదా అనేది మనం చూసుకుంటే చాలు. మనం చేసే పని కరెక్ట్ అయితే ఎవరినీ, ఏమీ పట్టించుకోవద్దు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా నమ్మకంతో, ధైర్యంతో ముందుకు సాగాలి. పనికి రాని మాటలను పర్సనల్‌గా తీసుకోకుండా విని వదిలేయాలి' అని తెలిపింది.

నా కళ్లు బాలేవన్నారు
చివర్లో హిమజ 'నా కెరీర్ మొదలైన కొత్తలో నా బాడీపై కొన్ని కామెంట్లు వచ్చాయి. ముఖ్యంగా నా కళ్లు బాగోవని కొందరు డైరెక్టర్లు నా ముఖం మీదనే అన్నారు. అప్పుడు చాలా బాధ పడ్డా. కానీ, మేకప్ వేసుకుని రెడీ అయిన తర్వాత వాళ్లకు నా కళ్లే బాగా నచ్చేవి. అలాగే, నేను మగాడిలా నడుస్తానని అన్నారు. అది మాత్రం మార్చడానికి ట్రై చేస్తున్నాను' అని వెల్లడించింది.


Click it and Unblock the Notifications











