పతివ్రతలా మాట్లాడకు.. నువ్వు ఎలా తిరిగావో తెలుసు: బూతు కామెంట్‌కు మాధవి లత షాకింగ్ రియాక్షన్
టాలీవుడ్‌లో తెలుగమ్మాయిలు హీరోయిన్లుగా అంతగా కనిపించడం లేదు. అప్పట్లో ఎక్కువగా ఇక్కడి వాళ్లనే తీసుకున్న ఫిల్మ్ మేకర్లు.. కొంత కాలంగా పొరుగు రాష్ట్రాల హీరోయిన్ల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో అందం, టాలెంట్ ఉన్న మన అమ్మాయిలకు చాన్స్‌లు రావట్లేదు. అలాంటి సమయంలో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంటర్ అయిన బ్యూటీనే మాధవి లత. సినిమాల కంటే వ్యక్తిగతంగానే ఆమె పాపులర్ అయింది. ఇప్పటికే ఎన్నో షాకింగ్ స్టేట్‌మెంట్లు ఇచ్చిన ఆమె.. తాజాగా నెటిజన్ బూతు కామెంట్ చేయడంతో ఫైర్ అయింది. ఆ వివరాలు మీకోసం!
అక్కడి నుంచి ఇక్కడకు
మాధవి లత తెలుగు మూలాలున్న కుటుంబానికి చెందిన అమ్మాయి. బళ్లారిలో జన్మించిన ఈ చిన్నది.. విద్యాభ్యాసం మొత్తం అక్కడే కంప్లీట్ చేసుకుంది. పుట్టినప్పటి నుంచి కర్నాటకలోనే ఎక్కువ భాగం గడిపినప్పటికీ.. తెలుగును అనర్గళంగా మాట్లాడుతుంది. అందుకే మొదట తెలుగు సినిమాలోనే అవకాశం దక్కించుకుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటోంది.

మహేశ్ మూవీతో ఎంట్రీ
రవిబాబు డైరెక్షన్‌లో తనీష్ హీరోగా నటించిన 'నచ్చావులే' సినిమా ద్వారా మాధవి హీరోయిన్‌గా పరిచయమైంది. అయితే, అంతకంటే ముందే ఆమె మహేశ్ బాబు నటించిన 'అతిథి'లో ఓ పాత్రను పోషించింది. 'నచ్చావులే'తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. నాని సరసన 'స్నేహితుడా'లో కూడా నటించింది. ఆ తర్వాత 'అరవింద్ 2' సహా పలు మూవీల్లో నటించింది.
పాలిటిక్స్.. వివాదాలతో
మాధవి లత చాలా కాలం ముందే ఓ జాతీయ పార్టీలో చేరింది. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో ఆమె చెప్పుకొచ్చింది. అప్పటి నుంచి ఈమె రాజకీయాలతో పాటు సామాజిక అంశాలపై తన గొంతును వినిపిస్తోంది. తద్వారా ఎన్నో వివాదాల్లో చిక్కుకుంటోంది. దీంతో మాధవి లత తరచూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటోంది.

అందులో మాత్రం బిజీ
2015లో తమిళంలో వచ్చిన 'అంబాల' తర్వాత మాధవి లత ఒకటి రెండు సినిమాల్లోనే నటించింది. కానీ, అభిమానులను నిరాశ పరిచకుండా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు అందుబాటులో ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన ఎన్నో అంశాలను పంచుకుంటోంది. అలాగే, తన వ్యక్తిగత జీవిత విషయాలు, ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది.
అనుచిత వ్యాఖ్యలతో
సమాజంలో జరిగే అంశాలపై ప్రస్తావించే మాధవి లత ఇటీవలే ఓ విషయంపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపై ఓ నెటిజన్ 'పతివ్రత మాటలు మాట్లాడకు తల్లి. నీ బతుకు సినిమా మేనేజర్లను అడిగితే చెప్తారు. నీ వేషాలకు ఎన్ని తిరుగుళ్లు తిరిగావో తెలుసులే. నాలుగు అడుగులు ఉండవు మాటలు పతివ్రతలా మాట్లాడతావు' అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

పర్సనల్ కాల్స్ చాలు
సదరు నెటిజన్ కామెంట్‌పై మాధవి లత స్పందిస్తూ.. 'ఇది మోస్ట్ ఫన్నీ కామెంట్.. ఆఫర్ల కోసం నేను మేనేజర్స్‌ను అడిగితే చెప్తారు.. అలా పోవడానికి మేనేజర్స్ ఎందుకు? నాకు తెలియని డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఎవరు ఇండస్ట్రీలో? నా స్థాయికి పర్సనల్ కాల్స్ చేస్తే చాలుగా అంకుల్. అలా పోయి ఉంటే ఇప్పటికే స్టార్ హీరోయిన్ అయ్యేదాన్ని' అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
అంకుల్ స్టార్ హీరోలు
అదే కామెంట్‌లో మాధవి లత 'నేనలా చేసుంటే మీ స్టార్ అంకుల్ హీరోల పక్కన చేసేదాన్ని కదా. మొదలు లేదురా మొగుడా అంటే ములక్కాయ వండవే అన్నాడంట. ఆ కులుకేలే ఉంటే ఆఫర్లు, పైసలు ఉండేవి. అయినా నా ఫస్ట్ ఫిల్మ్ 125 రోజులు ఆడింది. నేను ఆఫర్ల కోసం మేనేజర్స్ దగ్గరకు ఎందుకు పోతారా. నీ అమ్మ****' అంటూ దిమ్మతిరిగే సమాధానం చెప్పింది.


Click it and Unblock the Notifications











