అమ్మాయి న్యూడ్ పిక్ షేర్ చేసిన తెలుగు హీరోయిన్.. ఆ నటుడే ఇలా చేశాడంటూ!

సాధారణంగా సినీ రంగంలో ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా హల్చల్ చేస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే తమ స్వరాన్ని గట్టిగా వినిపిస్తూ ఫైర్ బ్రాండ్ అనిపించుకుంటున్నారు. అలాంటి వారిలో తెలుగు పిల్ల మాధవి లత ఒకరు. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి వచ్చిన ఈ భామ.. ఈ మధ్య కాలంలో సమాజంలో జరిగే ఎన్నో అంశాలపై స్పందిస్తోంది. ఇలా ఎన్నో వివాదాల్లో భాగం అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మాధవి లత ఓ అమ్మాయి నగ్నంగా ఉన్న పెయింటింగ్‌పై స్పందించింది. ఆ వివరాలను మీరే చూడండి మరి!

అప్పట్లోనే వివాదంగా ఫొటో
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నో అంశాలు వివాదంగా మారుతున్నాయి. అలానే కొన్ని రోజుల క్రితం ఓ అమ్మాయి నగ్నంగా ఉన్నట్లుగా గీసిన పెయింటింగ్ సంచలనం అయింది. అంతేకాదు, ఇందులో ఆమె యోని భాగంలో సైతం సిగరెట్ పెట్టి చూపించారు. దీన్ని మంచి ఉద్దేశంతోనే గీసినట్లు పెయింటర్ చెప్పినా.. దీనిపై ఎన్నో విమర్శలు వచ్చాయి.

Telugu Actress Maadhavi Latha Responds On Lady Controversy Painting

షేర్ చేసిన హీరోయిన్ లత
గతంలో పెద్ద వివాదానికి కారణం అయిన అమ్మాయి న్యూడ్ పెయింటింగ్‌ను ఇప్పుడు తెలుగు హీరోయిన్ మాధవి లత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అంతేకాదు, ఓ నటుడు దీన్ని షేర్ చేయడం వల్ల మరోసారి స్పందించాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది. ఈ మేరకు ఓ వీడియోను రూపొందించి తన ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఇప్పుడిది మళ్లీ హాట్ టాపిక్ అయిపోయింది.

అక్కడి నుంచే పుట్టారంటూ
మాధవి లత తన పోస్టులో 'ఆడదాని యోని అంటే కేవలం సుఖ స్థానం అని మాత్రమే అనుకుంటారు. కానీ అదే యోనిని జననేంద్రియం అని కూడా అంటారు. అంటే జననానికి కారణమైన స్థానం. ఇప్పటి వరకు పుట్టిన అవతార పురుషులైనా, జగజ్జెతలైన అక్కడినుండే పుట్టారు. చిన్న చీమ నుండి, దేవుళ్ళు దాకా అందరినీ ఈ సృష్టిలోకి తీసుకోచ్చిన మాహా ద్వారమే' అని చెప్పింది.

Telugu Actress Maadhavi Latha Responds On Lady Controversy Painting

స్త్రీగా సిగ్గు పడుతున్నానని
ఇదే పోస్టులో మాధవి 'మాతృత్వపు మార్గమే ఆ మహాస్థానం. దాన్ని మర్మస్థానం అని పిలిచినా అది మానవాళి ధన్య స్థానం, పుణ్య స్థానం. అలాంటి స్థానాన్ని గౌరవించలేని నీచులు, స్త్రీ తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి జన్మనిచ్చే, జగతిని పెంచే మహా స్థానానికి మర్యాద ఇవ్వలేని మనిషాసురులను కని లోకం మీదకు వదిలేసిన తల్లులను చూసి స్త్రీ గా సిగ్గు పడుతున్నా' అని పేర్కొంది.

ఆది శక్తి అవతరించాలని
ఈ పోస్టులో మాధవి లత కంటిన్యూ చేస్తూ.. 'అమ్మతనాన్ని అవమానించే ఈ మనిషాసురులను అంతమోందించే ఆది శక్తి అతి త్వరలో అవతరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటె ఆడవారి ఆత్మగౌరవం కాపాడడం కోసం వారి కోసం మాట్లాడడం కోసం మనసున్న మగవాళ్ళు వస్తారనే నమ్మకం తగ్గిపోయింది' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

అమ్మవారిపై భారం వేశా
ఇదే పోస్టులో మాధవి 'సాటి ఆడదానిపైన అసూయతో నిందలు వేసే మహిళలు కూడా ఉన్న సమాజంలో ఆడవారు కూడా ఉద్దరిస్తారనే నమ్మకం లేదు. కానీ ఏమీ చేయలేనప్పుడు దేవుణ్ణి తప్ప ఎవరిని అడుగుతాం. అందుకే భారం అమ్మవారిపై వేయడమే' అని రాసుకొచ్చింది. అలాగే, వీడియోలో తాను ఈ పోస్టు చేసినందుకు చాలా మంది తిడుతున్నారని మాధవి బాధపడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X