లవ్ మ్యారేజ్ చేసుకుంటా.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తెలుగు హీరోయిన్

సౌత్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ లిస్ట్ లో రీతూ వర్మ ఒకరు. అంజలీ తరువాత ప్రస్తుతం కోలీవుడ్ కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంటోంది ఈ తెలుగు పిల్ల. మొదట తెలుగులో పెళ్లి చూపులు సినిమాతో సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ బ్యూటీ పెళ్లిపై గత కొన్ని రోజులుగా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.

ఫైనల్ గా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లిపై అలాగే లవ్ పై తనకున్న ఫీలింగ్ గురించి కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. రీతూ మాట్లాడుతూ.. మా పేరెంట్స్ నేను ఎప్పుడు పెళ్లికి రెడీ అవుతానా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ నాకు ఇంకా చాలా సమయం పడుతుందని వారికి చెప్పాను. నేను ఇంకా చాలా సినిమాలు చేయాలని అనుకుంటున్నాను.

telugu actress Ritu varma about love marriage

అయితే నాకు పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఉంటే మాత్రం వెంటనే వారికి చెప్పేస్తాను. నచ్చిన వాడు దొరికితే పెద్దగా ఆలోచించను. లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాను' అంటూ రీతూ వర్మ ఒక వివరణ ఇచ్చింది. దీంతో ఆమెపై వస్తున్న రూమర్స్ అబద్దాలని ఒక క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం రీతూ వర్మ నాని టక్ జగదీష్ సినిమాతో పాటు శర్వానంద్, నాగ చైతన్య కొత్త సినిమాల్లో నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X