వాడికి కావాల్సిందే అదే.. నా అనుకున్న వాళ్లే అలా..: బోల్డ్ బ్యూటీ హాట్ కామెంట్స్
Shakeela: ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్న నటి షకీలా. మొదట్లో అడల్డ్ మూవీల్లో కనిపించిన షకీలా.. ఒకప్పుడు మలయాళ ఇండస్ట్రీలో ఆమె ఓ సంచలనం. ఆమె నటించిన సినిమాలు.. బాక్సాఫీస్ ను షేక్ చేసేవి. అంతలా తన గ్లామర్‌తో ఊపేసింది షకీలా. కేవలం తమిళంలోనే కాదు.. మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ సినిమాల్లో నటించింది. ఇలా ఆమె శృంగార తారగా అభిమానుల్లో ముద్ర పడిపోయింది. కానీ, అలాంటి బీ గ్రేడ్ మూవీ చేయడం వెనుక కారణాలు వెల్లడించింది.
తెలుగు బోల్డ్ నటి షకీలా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను బి గ్రేడ్ మూవీస్ చేయడానికి గల కారణాలను చెబుతూ.. తన జీవితంలో ఎదుర్కొన్న క్షష్టాలను, మోసాలను వెల్లడించింది. వాస్తవానికి తాను నటించింది ఒక కథలో అయితే మరో కథలో తన వీడియోస్ ను ఎడిట్ చేసేవార్నీ, తనకు ఒక చెప్పేది ఒక్క కథ అయితే.. మరో కథను తెరకెక్కించేవారని, విషయం తనకు చాలా రోజుల వరకూ తెలియదని అన్నారు. తన సినిమాల గురించి తెలుసుకున్న తర్వాత తానే షాక్ అయ్యానని, ఆ సినిమాలకు లేడీస్ వెళ్లరని తెలిసిన తర్వాత ఏదో మోసం జరుగుతుందని తాను గ్రహించాలని నటి షకీలా చెప్పుకొచ్చారు.

తాను నటించి సినిమాల గురించి అసలు విషయం తెలుసుకున్నాననీ, తన వీడియోస్ తో పాటు కొన్ని బిట్స్ ఆడ్ చేస్తున్నారని తెలుసుకొని షాక్ అయ్యానన్నారు. విషయం తెలిసిన తరువాత అలాంటి మూవీస్ చేయడం మానేస్తానని నిర్ణయించుకున్నాననీ, 2002లో బీ గ్రేడ్ మూవీస్ చేయడం మానేశానని తెలిపారు. అయితే.. ఆ మూవీస్ మానేయడానికి మరో కారణం కూడా ఉందని, తనకు ఆ సమయంలో ఓ బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని, అతని పెళ్లి చేసుకోవాలని భావించాలని తెలిపారు.
ఆ సమయంలోనే మరో షాకింగ్ విషయం తనకు తెలిసిందని, సొంత అక్కనే నమ్మించి మోసం చేసిందనీ, తాను దాచిపెట్టుకున్న డబ్బులన్నింటీ కొట్టేసిందని బాధపడ్డారు నటీ షకీల. తన దగ్గర డబ్బులు లేకపోవడంతో తన బాయ్ ఫ్రెండ్ కూడా దూరంగా ఉంటూ వచ్చాడని, ఆ సమయంలో అసలు విషయం అర్థమైందన్నారు. వాడు కేవలం తన డబ్బు కోసమే.. ప్రేమతో ఉన్నట్టు నటించాడని ఎమోషనల్ అయింది.

తాను కష్టాల్లో ఉన్నప్పుడూ.. డైరెక్టర్ తేజ గారు తనకు సినిమా అవకాశాలను ఇచ్చారని , ఆ విషయాన్ని తాను ఎప్పుడూ మర్చిపోనని తెలిపారు. అలా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించామని చెప్పుకుంటూ వచ్చారు. ఇలా.. తమిళం, తెలుగు చిత్రాలతో పాటు పలు రియాల్టీ షోలలో పాల్గొన్నానని తెలిపారు. పలు టెలివిజన్ కార్యక్రమాల్లో కామెడీ రోల్స్ చేస్తూ కుటుంబ ప్రేక్షకులకు ఇష్టమైన నటిగా మారనని తెలిపారు.


Click it and Unblock the Notifications











