తెలుగు అమ్మాయి అందాల ప్రదర్శన.. బీచ్‌లో ఓపెన్‌గా మళ్లీ మొదలు పెట్టిందిగా!
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీని వాడకం స్టార్ సినీ సెలబ్రిటీల నుంచి సాధారణ యువతీయువకులకు ఎంతో ఉపయోంగా మారింది. వారి టాలెంట్ ను నిరూపించుకునేందుకు మంచి వేదికగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ సామాజిక మాధ్యమం ద్వారా తెలుగు ముద్దుగుమ్మలు సైతం ఎక్కడా లేని క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఘాటు స్కిన్ షో చేస్తూ విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతున్నారు. అలాంటి వారిలో హైదరాబాద్ బ్యూటి శ్రేయ ధన్వంతరి ఒకరు. తాజాగా ఈ బ్యూటి మరోసారి ఊహించని రీతిలో అందాల ప్రదర్శన చేసింది.
కుటుంబం: హైదరాబాద్ లోని తెలుగు కుటుంబంలో జన్మించిన ముద్దుగుమ్మ శ్రేయా ధన్వంతరి ఢిల్లీలో పెరిగింది. వరంగల్ లోని నిట్ కళశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. శ్రేయ ధన్వంతరి ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నప్పుడే ఫేమినా మిస్ ఇండియా సౌత్ 2008 పోటీలో పాల్గొంది. ఈ పోటీలో శ్రేయా ధన్వంతరి రెండో స్థానంలో నిలిచింది.

ఎన్నో యాడ్స్: అనంతరం గ్లామరస్ బ్యూటి శ్రేయా ధన్వంతరి మిస్ ఇండియా 2008 పోటీల్లో ఫైనలిస్ట్ గా పోటీ పడి సత్తా చాటింది. అలా మోడలింగ్ రంగంలో తనదైన అందంతో రాణిస్తున్న సమయంలోనే ఎయిర్ టెల్, పాంటలూన్స్, సఫీ, ప్రోవోగ్, వోగ్, ఐవేర్, గీతాంజల్ మాయ బంగారు ఆభరణాలు, డిడామాస్ ఆభరణాలు, జాష్న్ చీరలు, లిబర్టీ ఫుట్ వేర్ వంటి పలు సంస్థలకు అడ్వర్టైజ్ మెంట్ చేసి ఆకట్టుకుంది.

ప్లాప్ అయిన మూవీ: వివిధ రకాల అడ్వర్టైజ్ మెంట్స్, మోడలింగ్ లో అదరగొడుతోన్న శ్రేయా ధన్వంతరికి తెలుగు సినిమా అవకాశం వచ్చింది. నాగ చైతన్య హీరోగా పరిచయం అయిన జోష్ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ స్లిమ్ బ్యూటి శ్రేయా ధన్వంతరి. బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచిన జోష్ సినిమాలో కేవలం రెండు మూడు సీన్లలో మాత్రమే మెరిసింది ఈ చిన్నది.

అనేక రంగాలు: జోష్ సినిమాతోపాటు సందీప్ కిషన్ నటించిన స్నేహ గీతం అనే మరో తెలుగు సినిమాలో నటించి ఆకట్టుకుంది శ్రేయ ధన్వంతరి. ఇందులో ఆమె నటనతో ఆకట్టున్నప్పటికీ తెలుగులో పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. దీంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ గ్లామరస్ తెలుగు డాల్. అక్కడ షార్ట్ ఫిలీంస్, డాక్యుమెంటరీస్ చేస్తూ నటిగానే కాకుండా రచయిత్రిగా, దర్శకురాలిగా, నిర్మాతగా సత్తా చాటింది.

విజయవంతంగా: బాలీవుడ్ లో యాంటీ సైబర్ బుల్లింగ్ పిఎస్ఏ, ఏ వైరల్ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించడంతోపాటు వాటికి స్టోరీ, డైరెక్షన్, ప్రొడ్యూసర్ వంటి బాధ్యతలను విజయవంతంగా చేపట్టింది శ్రేయా ధన్వంతరి. అనంతరం ది గర్ల్ ఇన్ మీ, వై చీట్ ఇండియా, లేడీస్ రూమ్, ది రీయూనియన్, ది ఫ్యామిలీ మ్యాన్, స్కామ్ 1992, లూప్ లపేటా, చుప్ వంటి చిత్రాలు, వెబ్ సిరీస్ లలో ఆకట్టుకుంది.
షేక్ చేస్తున్న పిక్స్: ఇలా సినిమాలు, వెబ్ సిరీసులతో ఫుల్ బిజీగా ఉండే శ్రేయ ధన్వంతరి సోషల్ మీడియాలో అందాల ఆరబోత మళ్లీ షురూ చేసింది. తాజాగా స్విమ్ సూట్ వేసుకుని బీచ్ లో ఎంతో ఓపెన్ గా ప్రతి ఒక్క పార్ట్ చూపించేసింది. వయ్యారంగా పోజులిస్తూ పైన కిందా అందాలన్ని ఏమాత్రం తేడా లేకుండా ఆరబోసింది. ప్రస్తుతం ఈ పిక్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











