అందాలను గాలికి వదిలేసిన తెలుగు హీరోయిన్.. గ్లామర్ షోలో ఇది వేరే లెవెల్ అంతే!
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల నుంచి పరిచయం అయిన ఎంతో మంది హీరోయిన్లుగా సందడి చేస్తున్నారు. అయితే, వీరిలో కొందరు మాత్రమే టాలీవుడ్‌లో సందడి చేస్తుండగా.. మిగిలిన వాళ్లు మాత్రం దేశ వ్యాప్తంగా హవాను చూపిస్తున్నారు. అందులో శోభిత ధూళిపాళ్ల ఒకరు. మోడలింగ్ రంగంలో సెన్సేషన్ అయిన ఈ చిన్నది.. కొంత కాలంగా బాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలోనూ తెగ హల్చల్ చేస్తోంది. ఇలా తాజాగా శోభిత కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరే లుక్కేయండి మరి!
మిస్ ఇండియా పోటీలతో
చిన్న వయసులోనే మోడలింగ్ రంగలోకి అడుగు పెట్టిన శోభిత ధూళిపాళ్ల అందంతో ఫిదా చేసింది. ఈ క్రమంలోనే 2013లో జరిగిన మిస్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొని కొద్దిలో కిరీటాన్ని మిస్ అయింది. అలాగే, అదే ఏడాది జరిగిన మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లోనూ భాగం అయింది. తద్వారా శోభితకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా అందుకుంది.

సినిమాల్లో.. తెలుగులోకి
మోడలింగ్‌లో ఎనలేని గుర్తింపును తెచ్చుకున్న శోభితకు సినిమా ఛాన్స్‌లు వచ్చాయి. ఇలా 'రామన్ రాఘవ్ 2.0' అనే హిందీ చిత్రంతో నటిగా ఎంటరైంది. ఆ తర్వాత 'చెఫ్', 'కళాకంది' వంటి బాలీవుడ్ మూవీల్లో నటించింది. ఈ క్రమంలోనే అడివి శేష్ 'గూఢచారి' మూవీతో శోభిత ధూళిపాళ్ల టాలీవుడ్‌లోకి వచ్చింది. ఇందులో అందం, అభినయంతో ఆకట్టుకుంది.
అక్కడ భారీ చిత్రాల్లోనే
'గూఢచారి'తో గ్రాండ్ ఎంట్రీని అందుకున్నా టాలీవుడ్‌లో శోభితకు పెద్దగా ఆఫర్లు దక్కలేదు. కానీ, ఆ తర్వాత మలయాళం, హిందీ, తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించి పేరు తెచ్చుకుంది. మళ్లీ 'మేజర్'తో తెలుగు చిత్రంలో కనిపించినా.. తర్వాత ఆఫర్లు పొందలేదు. కానీ, తమిళంలో 'పొన్నియన్ సెల్వన్' మూవీలతో పాటు 'సితార' అనే హిందీ చిత్రంలోనూ మెప్పించింది.

హిందీ, ఇంగ్లీష్‌లో ఫుల్
హిందీలో శోభిత ధూళిపాళ్ల 'ది నైట్ మేనేజర్' అనే సిరీస్‌తో యమా హైలైట్ అయిన విషయం తెలిసిందే. ఇందులో ఆమె అదిరిపోయే హాట్ షో చేసింది. అలాగే, రొమాంటిక్ సీన్స్‌లోనూ నటించింది. ఈ సిరీస్ సీక్వెల్‌లో సైతం శోభిత రెచ్చిపోయింది. ఇక, ఇటీవలే ఈ చిన్నది 'మంకీ మ్యాన్' అనే హాలీవుడ్ మూవీలో నటించింది. ఇందులో ఈ చిన్నది వేశ్య పాత్రను చేసింది.
సోషల్ మీడియాలో బిజీ
పేరుకు తెలుగు అమ్మాయే అయినా హాలీవుడ్ వరకూ ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతోన్న శోభిత ధూళిపాళ్ల.. సోషల్ మీడియాలో సైతం యమా యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా హడావిడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. తద్వారా ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

హాట్ షో అంటే ఇదేగా
తెనాలి అమ్మాయి శోభిత ధూళిపాళ్ల చాలా కాలంగా అందాలతో హల్చల్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ డోస్ పెంచేసి మరీ రచ్చ లేపుతోంది. ఇందులో భాగంగానే తనదైన రీతిలో చూపిస్తూ తీసుకున్న హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. తద్వారా శోభిత పేరు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోతోంది.
శోభిత పిక్స్ వైరల్‌గానే
తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని క్రేజీ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె లోదుస్తులు లేకుండానే డీప్ నెక్ డ్రెస్‌లో విపరీతంగా గ్లామర్ షో చేస్తూ కనిపించింది. దీంతో ఆమె అందాలు బాగా హైలైట్ అవుతున్నాయి. ఫలితంగా శోభిత ధూళిపాళ్ల తాజాగా షేర్ చేసిన ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది.


Click it and Unblock the Notifications











