22 ఏళ్ల వయసులోనూ అతిపొట్టి డ్రెస్ వేసుకున్న తెలుగమ్మాయి.. ఎవరో గుర్తు పట్టారా?
ఇటీవల కాలంలో తెలుగు సినీ ప్రియులను ఎక్కువగా అలరించిన, కుర్రకారు మనసు దోచిన క్యూట్ బ్యూటీ శ్రీలీల గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాస్త సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కానీ సోషల్ మీడియా వేదికగా మాత్రం అందరికీ అందుబాటులోనే ఉంది. అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ అతి చిన్న డ్రెస్ వేసుకుని సోకులు ఆరబోసింది. మిర్చి లాంటి ఎరుపు రంగు డ్రెస్ వేసుకున్న ఈమె అంత కంటే క్యూట్ గా ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పెళ్లి సందడి సినిమాతో మూడేళ్ల క్రితం సినీ రంగంలో అడుగు పెట్టిన శ్రీలీల అందరికీ మోస్ట్ ఫేవరెట్ యాక్టర్ గా నిలిచిపోయింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఆ చిత్రంతోనే అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేసింది. తన అందం, అభినయంతో కుర్రకారు గండెల్లో తిష్ట వేసుకొని కూర్చుంది. కేవలం నటన పరంగా మాత్రమే కాకుండా డ్యాన్స్ కూడా ఇరగదీస్తూ.. అద్భుతమైన అవకాశాలను అంది పుచ్చుకుంటోంది. ముఖ్యంగా కుర్రకారు హాట్ ఫేవరెట్ అయిన ఈ క్యూట్ వరుసగా సినిమా ఛాన్సులు కొట్టేసింది.

స్టార్ హీరోల అందరి సరసన కనిపించి మెస్మరైజ్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాస్త బ్రేక్ తీసుకుంది. తన అందం, అభినయంతో పాటు అంతకు మించి అదిరిపోయే స్టెప్పులు వేస్తూ.. స్టార్ హీరోలు పక్కన ఉన్నా తనవైపే చూపు తిప్పుకునేలా చేసే ఈ చిన్నది.. సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా సరికొత్త ఔట్ ఫిట్లు ధరిస్తూ.. తన అందచందాలను ఆరబోస్తుంటుంది.
అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన అద్భుతమైన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. అందులో రెడ్ కలర్ అతి చిన్న డ్రెస్ వేసుకుని సోకులు పోయింది. హెయిర్ లీవ్ చేసుకుని.. బీచ్ వద్ద అటూ ఇటూ తిరిగుతూ క్రేజీ ఫోజులు పెట్టి మరీ ఫొటోలు దిగింది. ప్రస్తుతం శ్రీలీల షేర్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు అని కొందరు చెబుతుండగా.. 22 ఏళ్ల వయసులోనూ ఇంత చిన్న డ్రెస్ ఏంటమ్మా అంటూ మరికొంద మంది అడుగుతున్నారు.
వయసుతో సంబంధం లేకుండా నీవు ఇలాంటి చిన్న చిన్న డ్రెస్ లే వేసుకోవాలంటూ మరికొంత మంది శ్రీలీలకు సూచిస్తున్నారు. అలాగే ఎక్కువగా తెలుగు సినిమాలు చేస్తూ అందాలు ఆరబోయమని, అంతకు మించి స్టెప్పులు వేస్తూ తమను మెస్మరైజ్ చేయాలని కోరుకుంటున్నారు. చూడాలి మరి ఆ ముద్దుగుమ్మ ముందు ముందు ఎలాంటి సినిమాలు చేస్తుంది, ఏ రేంజ్ లో అందాలు ఆరబోస్తుందనేది.


Click it and Unblock the Notifications











