41ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్ అయిన తెలుగు హీరోయిన్! బేబీ బంప్ పిక్స్ చూశారా?

ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ లేటు వయసులో తల్లి అవుతున్నారు. బేబీ బంప్ ఫోటోలతో రచ్చ చేస్తున్నారు. తాజాగా మరో హీరోయిన్ నాలుగు పదుల వయసులో బేబీ బంప్ ఫోటోలతో షాకిచ్చింది. ఆమె ఎవరో కాదు... టాలీవుడ్ హీరోయిన్ ఆర్తి చబ్రియా. ఈ బ్యూటీ తెలుగు, హిందీ సినిమాల్లో నటించి మెప్పించింది. 41ఏళ్ల వయసులో ప్రగ్నెంట్ అయ్యింది. ఆమె తన సోషల్ మీడియా ఖాతా వేదికగా ఓ వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నారు. ఆ స్టోరీపై ఓ లుక్కేయండి.

41ఏళ్ల వయసులో తల్లిగా....

టాలీవుడ్ హీరోయిన్ ఆర్తి చబ్రియా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ బ్యూటీ ఎన్నో తెలుగు, హిందీ చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే తాజాగా ఈ హీరోయిన్ 41 ఏళ్ళ వయసులో తల్లి కాబోతుంది. తాజాగా ఆర్తి చబ్రియా బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముంబై భామ ఆర్తి చబ్రియా బాలీవుడ్ లో లజ్జ, ఆవారా పాగల్ దీవానా, షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా, మిలేంగే మిలేంగే.. లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అక్కడి ప్రేక్షకులను తన నటనతో ఫిదా చేసింది.

Telugu Heroine Aarti Chabria Became Pregnant At The Age OF 41 Baby Bump Photos Viral

తెలుగులో ఎన్నో చిత్రాల్లో....

ఇక తెలుగులో శ్రీరామ్ నటించిన ఒకరికి ఒకరు, శ్రీకాంత్ నటించిన ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి, నరేష్ నటించిన గోపి - గోడమీద పిల్లి.. లాంటి పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఇక్కడ కూడా ఈ బ్యూటీకి మంచి గుర్తింపు లభించింది. నటించిన ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి కానీ ఆమెకు మాత్రం మంచి ఛాన్సులు రాలేదు.

Telugu Heroine Aarti Chabria Became Pregnant At The Age OF 41 Baby Bump Photos Viral

పెళ్లితో ఆస్ట్రేలియాకు జంప్...

అయితే ఆర్తి చబ్రియా 2019లో ఆస్ట్రేలియాకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ విశారద్ బీడస్సిని వివాహం చేసుకుంది. ఇక ఆస్ట్రేలియా వెళ్ళిపోయి అక్కడే ఫ్యామిలీ లైఫ్ గడుపుతుంది. ప్రస్తుతం ఆర్తి చబ్రియా ఆస్ట్రేలియాలోనే ఉంటూ అప్పుడప్పుడు ముంబై వచ్చి సందడి చేస్తుంది.

బేబీ బంప్ ఫోటోలు వైరల్....

రెండు రోజుల క్రితమే ఆర్తి చబ్రియా తన సోషల్ మీడియాలో తాను ప్రగ్నెంట్ అని చెప్పుకువచ్చింది. అంతే కాదు.. బేబీ బంప్ తో ఉన్న ఓ వీడియో పోస్ట్ చేసింది. తాజాగా ఇండియాలో ఆర్తి చబ్రియా బేబీ బంప్ ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో పలువురు ప్రముఖులు ఆమెకు కంగ్రాట్స్ చెప్తున్నారు. ఈ వయసులో ప్రగ్నెంట్ ఏంటి అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఆ ఫోటోలపై ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X