ఒంటరిగా వాళ్లతో వీడియో కాల్.. కట్ చేస్తే ఏడేళ్ల జైలు శిక్ష.. తెలుగు పిల్ల అనన్య నాగళ్లకు షాక్

గతంలో కంటే ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది లోకల్ అమ్మాయిలు హీరోయిన్లుగా సందడి చేస్తున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో అనన్య నాగళ్ల ఒకరు.

నేచురల్ యాక్టింగ్‌తో మెప్పిస్తోన్న ఈ చిన్నది.. వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇలా ఇప్పుడు చాలా ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా అనన్య నాగళ్లకు సైబర్ నేరగాళ్లు బిగ్ షాక్ ఇచ్చారు. అసలు ఏం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూసేయండి!

Telugu Heroine Ananya Nagalla Reveals About Cyber Fraud

అలా వచ్చి.. ఆ చిత్రాలతో
అనన్య నాగళ్ల ఆరంభంలోనే 'షాదీ' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించి సైమా అవార్డునూ అందుకుంది. దీంతో ఒక్కసారిగా సెన్సేషన్ అయిపోయింది. ఈ క్రమంలోనే 'మల్లేశం' అనే చిత్రంతో హీరోగా పరిచయమైంది. ఆ తర్వాత 'వకీల్ సాబ్', 'ప్లేబ్యాక్', 'మ్యాస్ట్రో', 'ఊర్వశివో రాక్షశివో', 'శాకుంతలం', 'మళ్లీ పెళ్లి' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

Telugu Heroine Ananya Nagalla Reveals About Cyber Fraud

వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ

అచ్చ తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల హీరోయిన్‌గా చేసిన సినిమాలు అన్నీ సక్సెస్ అయ్యాయి. దీంతో ఆమెకు మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవలే ఈ అమ్మడు 'తంత్ర' అనే హర్రర్ మూవీతో వచ్చింది. ఈ చిత్రం ఆశించిన రీతిలో సక్సెస్ కాలేదు. ఇప్పుడు మాత్రం అనన్య 'బహిష్కరణ' అనే వెబ్ సిరీస్‌తో పాటు పలు సినిమాలను చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది.

Telugu Heroine Ananya Nagalla Reveals About Cyber Fraud

అనన్యకు ఎదురుదెబ్బ
అనన్య నాగళ్ల తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె 'అందరికీ నమస్కారం.. ఇది చాలా సీరియస్ ఇష్యూ. మూడు రోజుల క్రితం కస్టమర్ కేర్ సెంటర్ నుంచి నాకు కాల్ వచ్చింది. మీ నెంబర్‌ను బ్లాక్ చేస్తున్నాం అని చెప్పారు. తర్వాత కాల్ చేస్తే వాళ్లు మాట్లాడుతూ.. మీ ఆధార్ కార్డ్‌ను వాడి ఒక సిమ్ తీసుకున్నారు. ఆ నెంబర్ నుంచి చాలా ఫ్రాడ్ జరుగుతుంది' అన్నారు.

Telugu Heroine Ananya Nagalla Reveals About Cyber Fraud

వీడియో కాల్ చేయండి

అనన్య కొనసాగిస్తూ.. 'మీ సిమ్ బ్లాక్ చేస్తున్నాం. ఫ్యూచర్‌లో ఇబ్బంది రాకుండా పోలీస్ క్లియరెన్స్ తీసుకోవాలి. మీరు ఓకే అంటే కనెక్ట్ చేస్తాం అని వాళ్లు ట్రాయ్ నుంచి కాల్ చేస్తున్నాం అని చెప్పారు. తర్వాత వాళ్లు ఇంగ్లీష్‌లో మాట్లాడారు. అంతేకాదు, స్కైప్ ద్వారా వీడియో కాల్ చేయమని చెప్పారు. దీంతో నేను ఓకే అనడంతో ఓ ఐడీ ఇచ్చి వీడియో కాల్ చేశారు' అని చెప్పింది.

ఆ కేసులు ఉన్నాయని
అనన్య కంటిన్యూ చేస్తూ.. 'వాళ్లు కనెక్ట్ చేసి ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా? చార్జింగ్ ఉందా అని అడిగారు. ఉందని చెప్పడంతో మీరు వీడియో కాల్‌లో కంప్లైంట్ ఇస్తున్నప్పుడు థర్డ్ పర్సన్ చూడకూడదు అని చెప్పారు. నేను సరేనని అన్నాను. ఆధార్ నెంబర్ తీసుకుని ఈ నెంబర్‌తో డ్రగ్స్, మనీలాండరింగ్ చాలా ఇష్యూస్ ఉన్నాయి అని భయపెట్టారు' అని పేర్కొన్నారు.

అకౌంట్ నెంబర్ అని

తర్వాత అనన్య 'వాళ్ల సెటప్ మొత్తం పక్కాగా సెట్ చేశారు. పోలీసుల్లా బెదిరించారు. తర్వాత అకౌంట్ల గురించి ఎంక్వైరీ చేశారు వాళ్లు చెప్పే మాటలకు నాకు డౌట్ వచ్చి క్వశ్చన్ చేశాను. వాళ్లు సరిగా సమాధానం చెప్పకపోవడంతో గూగుల్ సెర్చ్ చేశా. అప్పుడు వాళ్లు ఫ్రాడ్ అని తెలిసింది. తర్వాత వాళ్లే కాల్ కట్ చేశారు. ఇలా చాలా మంది బెదిరింపులకు దిగుతూ మోసం చేయాలని చూస్తున్నారు. ఇలాంటి సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండండి' అని కోరింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X