రేపిస్టులకు అదే తగిన శిక్ష.. అచ్చ తెలుగు హీరోయిన్ ఫైర్..
ఈ మధ్య కాలంలో మన దేశంలో జరుగుతున్నా దారుణ ఘటనల కోసం ఎవరికీ తెలియంది. కాదు అనాది కాలంగా ఆడవాళ్లపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డు లేకండా పోతుంది. అలా ఇటీవల దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఘటన ఏదన్నా ఉంది అంటే పశ్చిమ బెంగాల్ గా ఓ యువ మహిళా డాక్టర్ పై జరిగిన దుర్ఘటన అనే చెప్పాలి. కాగా ఈ విషాదం అంశం దేశంలో ప్రతి ఒక్కరిని కదిలించగా ప్రాణాలని కాపాడే వైద్యులకే మాన, ప్రాణ హాని ఉంటే ఎలా అని ప్రశ్న మొదలైంది.
అలాగే దేశ వ్యాప్తంగా ఉన్న డాక్టర్లు కూడా రోడ్లెక్కి రాస్తా రోకోలు చేస్తున్నారు. అయితే ఈ సంచలన సంఘటనపై సినిమాకి చెందిన ప్రముఖులు కూడా చాలామంది స్పందించారు. మెయిన్ గా దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సినీ రంగాల్లో ప్రముఖ హీరోయిన్స్ కూడా స్పందించి ఈ ఘటనపై న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇందులో మన తెలుగు హీరోయిన్స్ కూడా ఉండగా..

లేటెస్ట్ గా మన తెలుగు సినిమాకి చెందిన అచ్చమైన తెలుగు నటి చాందిని చౌదరి రియాక్ట్ అయ్యింది. తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. శాస్త్రవేత్తలు ప్రయోగాల కోసం ఎన్నెన్నో మూగ జీవాలను తీసుకొని పరీక్షలు చేస్తారు కదా? అలాంటి టెస్ట్ లు ఇలాంటి రేపిస్టుల మీద డైరెక్ట్ గా చేయొచ్చు కదా అంటూ ఫైర్ అయ్యింది.
అలాగే ఇలాంటి టెస్ట్ లకి ఆ రేపిస్టులు ఏం చెయ్యగలరు? దీనిపై మీరేం సమాధానం చెబుతారు అంటూ చాందిని తన సోషల్ మీడియా ఫాలోవర్స్ ని ప్రశ్నించింది. దీనితో తన స్ట్రాంగ్ పోస్ట్ వైరల్ గా మారింది. కాగా ఈ పోస్ట్ కి చాలా మంది సపోర్ట్ గా కూడా రిప్లైలు ఇస్తున్నారు. మరి చాందిని చౌదరి మన తెలుగు నుంచి తెలుగు మాట్లాడే అచ్చమైన హీరోయిన్ గా వచ్చినప్పటికీ ఇంకా మన ఇండస్ట్రీలో సరైన అవకాశాలు రావడం లేదని ఆ మధ్య కామెంట్స్ చేసింది.

తెలుగులో సుహాస్ హీరోగా "కలర్ ఫోటో" తో మంచి ఎంట్రీ అందుకున్న ఈ యంగ్ హీరోయిన్ నుంచి ఈ ఒక్క ఏడాదిలోనే మొత్తం మూడు సినిమాలు విశ్వక్ సేన్ హీరోగా నటించిన "గామి", అలాగే చాందిని ప్రధాన పాత్రలో నటించిన పోలీస్ థ్రిల్లర్ "యేవం" అలాగే ప్రముఖ నటుడు అజయ్ ఘోష్(పుష్ప ఫేమ్) నటించిన "మ్యూజిక్ షాప్ మూర్తి" అనే సినిమాలు మూడు వచ్చాయి.
వీటిలో యేవం మినహా మిగతా రెండు సినిమాలు మంచి టాక్ ని అయితే ఆడియెన్స్ నుంచి అందుకున్నాయి. ఇక ఇవి మినహా చాందిని చౌదరి ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ మాస్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్ లో చేస్తున్న "వీరమాస్" (పరిశీలనలో ఉన్న టైటిల్) లో కూడా కీలక పాత్ర చేస్తుంది. ఇక ఇవి మినహా ఈమె మరిన్ని సినిమాలు ఓటిటి సిరీస్ లు చేస్తుంది.


Click it and Unblock the Notifications











