టవల్ చుట్టుకుని తెలుగు హీరోయిన్ ఫోజు: ఫొటో చూస్తే షాక్ అయిపోతారు!
మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చుకుంటే తెలుగు సినిమాల్లోనే లోకల్ అమ్మాయిలు పెద్దగా కనిపించరు. ఇక్కడి దర్శక నిర్మాతలు వేరే భాషల వాళ్లకే అవకాశాలు ఇస్తున్నారు. అయినప్పటికీ కొందరు తెలుగు భామలు తమదైన రీతిలో సందడి చేస్తున్నారు. అందులో డింపుల్ హయాతి ఒకరు. అందంతో పాటు అభినయం పరంగానూ మెప్పిస్తోన్న ఈ బ్యూటీ కెరీర్‌ను మాత్రం సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకు వెళ్లడం లేదు. అయినా సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా డింపుల్ ఓ షాకింగ్ ఫొటో వదిలింది. అది మీరే చూడండి!
ఇక్కడి అమ్మాయే అక్కడ
బెజవాడకు చెందిన డింపుల్ హయాతి ముందుగా మోడల్‌గా కెరీర్‌ను మొదలెట్టింది. అందులో తన అందచందాలతో మెప్పించి.. ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడిపోయింది. ఫలితంగా ఆమెకు అవకాశాలు భారీగా వచ్చాయి. ఈ క్రమంలోనే డింపుల్ హయాతి 'గల్ఫ్' అనే సినిమాతో నటిగా ఎంటరైంది. దీని తర్వాత 'అభినేత్రి 2' మూవీలోనూ నటించి గుర్తింపు తెచ్చుకుంది.

స్పెషల్ సాంగ్‌తో స్పెషల్
సినిమా నటిగా పలు చిత్రాల్లో కనిపించినా డింపుల్ హయాతికి ఆ తర్వాత ఆఫర్లు మాత్రం ఆశించినట్లుగా దక్కలేదు. ఈ పరిస్థితుల్లో 'గద్దలకొండ గణేష్' మూవీలో డింపుల్ 'సూపర్ హిట్టు' అనే స్పెషల్ సాంగ్‌లో సందడి చేసింది. ఇందులో ఆమె చేసిన స్టెప్పులతో తెలుగు రాష్ట్రాలు ఊగిపోయాయి. ఫలితంగా అప్పటి నుంచి ఆమెకు ఎన్నో రకాల అవకాశాలు లభించాయి.
ఆ సినిమాలు డిజాస్టర్‌గా
డింపుల్ హయాతి 'అత్రంగి రే' అనే హిందీ సినిమాలోనూ నటించింది. అలాగే, 'వీరమై వాగై సూడుమ్' అనే తమిళ చిత్రంలో చేసింది. ఇక, తెలుగులో డింపుల్ రవితేజతో 'ఖిలాడి', గోపీచంద్‌తో 'రామబాణం' చిత్రాలు చేసింది. కానీ దురదృష్టవశాత్తూ ఈ మూవీలు డిజాస్టర్ అయ్యాయి. ఫలితంగా ఆమెకు తెలుగులో ఇప్పుడు అసలు సినిమా అవకాశాలే దక్కడం లేదు.

ఆ వివాదం.. కమల్‌తోనే
తక్కువ సినిమాల్లోనే నటించినా డింపుల్ హయాతి మంచి పేరు తెచ్చుకుంది. ఈ పరిస్థితుల్లో ఈ అమ్మడు కొద్ది రోజుల క్రితమే ఓ వివాదంలో చిక్కుకుంది. ఈ గొడవ కారణంగా ఈ హీరోయిన్ కోర్టులు, పోలీస్ స్టేషన్ మెట్లూ ఎక్కాల్సి వచ్చింది. ఇక, డింపుల్ హాయాతి ప్రస్తుతం కమల్ హాసన్ 'ఇండియన్ 2'లో ఓ స్పెషల్ సాంగ్‌ను చేయనుందని ఒక న్యూస్ వైరల్ అవుతోంది.
అక్కడ ఫుల్ యాక్టివ్‌గా
సినిమాల పరంగా ఎంత హైలైట్ అయిందో కానీ.. సోషల్ మీడియా వల్ల మాత్రం డింపుల్ హయాతి యమా పేరు తెచ్చుకుంది. అందుకే ఇందులో ఎప్పుడూ ఈ అమ్మడు యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ తెలుగు హీరోయిన్ తరచూ తనకు, తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. దీంతో ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేస్తోంది.

హాట్ షోలో అల్లాడిస్తూ
సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తోన్న డింపుల్ హయాతి.. దీని ద్వారా తన అందాలతో కుర్రకారును ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. మరీ ముఖ్యంగా ఓ రేంజ్‌లో క్లీవేజ్ షో చేస్తూ కుర్రకారును ఓ ఊపు ఊపేస్తోంది. దీంతో డింపుల్ హయాతి తరచూ ఇంటర్నెట్‌లో సెన్సేషన్ అవుతోంది.

డింపుల్ సెల్ఫీ వైరల్
కొంత కాలంగా సోషల్ మీడియాలో సంచలనమైన షో చేస్తోన్న డింపుల్ హయాతి.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ షాకింగ్ పిక్‌ను షేర్ చేసింది. ఇందులో ఆమె టవల్ మాత్రమే చుట్టుకుని ముఖానికి ప్యాక్ పెట్టుకుని కనిపించింది. ఫలితంగా ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది. తద్వారా ఇది చాలా తక్కువ సమయంలోనే వైరల్‌గా మారిపోయింది.


Click it and Unblock the Notifications











