తొలిసారి టూ పీస్‌లో తెలుగు పిల్ల: ఏ అందాలు చూడాలో కన్‌ఫ్యూజ్ అయ్యేలా!

సాధారణంగా ఏ భాషలో అయినా సినీ రంగంలో లోకల్ అమ్మాయిలే ఎక్కువగా డామినేట్ చేస్తుంటారు. కానీ, తెలుగులో మాత్రం ఇక్కడి యువతులకు పెద్దగా అవకాశాలే రావట్లేదు. అయినా కొందరు ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. అందులో ఈషా రెబ్బా ఒకరు. సినిమాల్లోకి వచ్చి చాలా కాలమే అవుతోన్నా పెద్దగా సక్సెస్ కాలేకపోయిన ఈ చిన్నది.. తన రేంజ్‌లో ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. ఇలా ఈ మధ్య బిజీగా మారింది. ఇక, తాజాగా ఈషా రెబ్బా సోషల్ మీడియాలో ఓ స్టన్నింగ్ వీడియోను షేర్ చేసింది. దానిపై మీరే ఓ లుక్కేయండి!

అలా వచ్చి.. హిట్‌తో స్టార్ట్:మోడల్‌గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సమయంలోనే అచ్చ తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' అనే మూవీతో నటిగా పరిచయం అయింది. ఆ వెంటనే 'అంతకు ముందు ఆ తర్వాత' అనే రొమాంటిక్ మూవీతో హీరోయిన్‌గా మారింది. ఇది మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు ఆమెకు యాక్టింగ్ పరంగానూ ప్రశంసలు లభించాయి.

Telugu Heroine Eesha Rebba Stunning Video Shakes Internet

ఎన్నో చేసినా పేరు రాలే:హీరోయిన్‌గా మంచి ఆరంభాన్ని అందుకున్న ఈషా రెబ్బా.. ఆ తర్వాత వరుసగా 'బందిపోటు', 'అమీతుమీ', 'దర్శకుడు', 'ఆ!', 'బ్రాండ్ బాబు', 'సుబ్రమణ్యపురం', 'రాగల 24 గంటల్లో' సహా ఎన్నో సినిమాలు చేసింది. అయితే, వీటిలో కేవలం ఓ రెండు మూడు మాత్రమే విజయాన్ని సొంతం చేసుకున్నాయి. దీంతో మొదట్లో అంత స్పీడుగా ఆఫర్లు రాలేదు.

వేరే భాషల్లో అవకాశాలు:అందానికి అందం, నటనకు నటన కనబరిచే సత్తా ఉన్నా ఈషా రెబ్బాకు మాతృ భాషలో ఆశించిన రీతిలో ఆఫర్లు మాత్రం రావడం లేదు. ఒకవేళ వచ్చినా మీడియం రేంజ్ సినిమాలే లభిస్తున్నాయి. దీంతో ఈ చిన్నది వేరే భాషల్లో ప్రయత్నాలు చేసింది. ఇలా మలయాళంలో 'ఒట్టు', తమిళంలో 'నితమ్ ఓరు ఓనమ్' వంటి చిత్రాల్లో నటించి అక్కడ పాపులర్ అయింది.

Telugu Heroine Eesha Rebba Stunning Video Shakes Internet

మరో డిజాస్టర్.. బిజీగానే:ఈ మధ్య కాలంలో ఈషా రెబ్బా తెలుగులో మళ్లీ ఆఫర్లను అందుకుంటోంది. ఇటీవలే ఆమె 'మాయాబజార్ ఫర్ సేల్' సిరీస్‌తో వచ్చింది. ఇలా గత వారమే 'మామా మశ్చీంద్రా' అనే సినిమాతో వచ్చింది. కానీ ఈ చిత్రం డిజాస్టర్ అయింది. అలాగే, తమిళంలో 'ఆయిరామ్ జన్మంగళ్' అనే మూవీ చేస్తోంది. దీనితో పాటు 'దయా' సిరీస్‌ రెండో సీజన్‌తోనూ త్వరలోనే రాబోతుంది.

అందులోనే ఉంటోంది:హీరోయిన్‌గా ప్రవేశించినప్పటి నుంచి తన రేంజ్‌కు తగ్గట్లుగా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తోన్న ఈషా రెబ్బా.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా గడుపుతోంది. ఈ క్రమంలోనే తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ లైఫ్ విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. ఇలా తన అభిమానులకు మజాను పంచుతూ ముందుకు సాగుతోంది.

Telugu Heroine Eesha Rebba Stunning Video Shakes Internet

అప్పుడప్పుడూ కవ్విస్తూ:ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువగా సోషల్ మీడియా ఖాతాల్లో యమ హడావిడి చేస్తోన్న ఈషా రెబ్బా.. అప్పుడప్పుడూ పరువాలను ప్రదర్శిస్తూ రెచ్చిపోతోంది. ఈ మధ్య కాలంలో మరింతగా డోస్ పెంచేసి మరీ ఈ చిన్నది హాట్ ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదులుతోంది. దీంతో ఈషా రెబ్బా పేరు ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లో ఉంటోంది. ఇలా అందరి దృష్టిలోనూ పడుతోంది.

ఈషా వీడియో వైరల్‌గా:గతంలో కంటే ఇప్పుడు హాట్ డోస్ పెంచేసిన ఈషా రెబ్బా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ బోల్డు వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె టూ పీస్ బికినీలో స్విమ్మింగ్ పూల్‌లో జలకాలు ఆడుతోంది. ఇందులో వెనుక నుంచి ప్రకృతి అందాలనూ, తన బాడీని చూపిస్తోంది. దీంతో ఈషా రెబ్బా షేర్ చేసిన ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చి.. ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X