Meenakshi Chaudhary: వైట్ అండ్ వైట్‌లో మీనాక్షి సమ్మర్ ట్రీట్.. చూస్తే గుండెలు జారిపోవాల్సిందే!
తెలుగు హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి, ఆమె అందాల గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తుంది. ముఖ్యంగా పరువాలు ఆరబోయడంలో ఈమెను మించిన వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. ఇలా ఎప్పుడూ హాట్ ట్రీట్ ఇస్తూ.. కుర్రాళ్ల గుండెలు జారేలా చేసే ఈ చందమామ తాజాగా వైట్ అండ్ వైట్ డ్రెస్ లో కనిపించి మెస్మరైజ్ చేసింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
హిట్ ది సెకండ్ కేసు సినిమాలో అడవి శేష్ గర్ల్ ఫ్రెండ్ గా కనిపించి మెప్పించిందీ క్యూట్ బ్యూటీ. నటిగానే కాకుండా మోడల్ గా రాణించిన ఈమె 2018లో ఫెమినా మిస్ ఇండియాగా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత 2021లో ఇచట వాహనములు నిలపరాదు చిత్రంతో సినీ రంగంలో అడుగు పెట్టింది. ఆ తర్వాత ఖిలాడీ, హిట్, తమిళ్ లో కొలై చిత్రాల్లో నటించింది. కేవలం సినిమాలు, ర్యాంప్ వాక్ ల ద్వారానే కాకుండా.. సోషల్ మీడియా ద్వారా కూడా తన ఫ్యాన్స్ కు ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది.

తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను షేర్ చేస్తుంటుంది. అంతేకాకుండా అదిరిపోయే ఔట్ ఫిట్ లు ధరిస్తూ.. ఎప్పటికప్పుడు ట్రెండీ ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో వైట్ అండ్ వైట్ డ్రెస్ లో కనిపించి ఫొటోలకు ఫోజులు ఇచ్చిందీ ముద్దుగుమ్మ. ముఖ్యంగా సమ్మర్ కావడం, అందులో విపరీతమైన ఎండలు పెరిగిపోవడంతో.. ప్యూర్ కాటన్.. వైట్ క్లాత్ తో ప్యాంటు, షర్టు కుట్టించుకుని మరీ ముస్తాబైంది.
ఈ డ్రెస్ పైకి జర్మన్ సిల్వర్ నెక్లెస్ తో పాటు జుంకీలు కూడా పెట్టుకుని జాబిలమ్మాలా ముస్తాబైంది. సోఫాలో కూర్చుని వయ్యారాలు ఒలకబోసిన ఈమె అందాలకు అంతా ఫిదా అయిపోతున్నారు. బిగ్ స్మైల్ ఇస్తూ కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది. ఈమె నవ్వుకే మొహం అంతా పింక్ కలర్ లోకి మారగా.. మరింత హైలెట్ అయింది. ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఏంటమ్మా క్యూట్ బ్యూటీ.. సమ్మర్ లుక్ తో సోకులన్నీ ఆరబోస్తున్నావన్నారు. నిన్న చూస్తే తట్టుకోలేకపోతున్నామని కొందరు చెబుతున్నారు.

మరికొందరేమో ఐ లవ్ యూ, ఐ మిస్ యూ చందమామ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మీనాక్షి చౌదరి అందాలకు పెద్ద ఎత్తునే ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె పెట్టే పోస్టులు, ఫొటోలు చూసేందుకు చాలా మంది ఆమెను ఫాలో అవుతున్నారు. ఇంతందంగా కల్గిన ఈమె అదిరిపోయే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ స్టార్ హీరోయిన్ గా మారాలని ఆమె ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











