ప్రభాస్ వివాదంపై పాయల్ రాజ్‌పుత్ షాకింగ్ కామెంట్స్!

సినిమా పరిశ్రమకి చెందిన వారిపై ఎప్పటికప్పుడు హాట్ న్యూస్ లు పలు కాంట్రవర్సీ లకి కానీ ఎప్పుడూ కొదవ ఉండదు. అయితే వారిలో వారికే ఏదొక స్పర్థల మూలాన కాంట్రవర్సీలు రేగుతాయి. లేకపోతే అవతల వాళ్ళ ఎదుగుదల చూసి ఓర్వలేనివారు చేసే కామెంట్స్ కానీ చర్యలు కానీ చర్చకు దారి తీస్తాయి. కాగా ఇలా జస్ట్ కొన్ని రోజులు కితమే మన తెలుగు టాప్ హీరో పాన్ ఇండియా మార్కెట్ లో సత్తా చాటిన రెబల్ స్టార్ ప్రభాస్ విషయంలో బాలీవుడ్ నటుడు అర్షద్ వర్సి చేసిన కామెంట్స్ పెను దుమారాన్నే రేపాయి.

తాను కల్కి 2898 ఎడి చూసాను కానీ అందులో ప్రభాస్ నాకు నచ్చలేదు జోకులేసుకుంటూ ఒక జోకర్ లా కనిపిస్తున్నాడు అంటూ చేసిన కామెంట్స్ పెద్ద కాంట్రవర్సీకే దారి తీశాయి. దీనితో ప్రభాస్ కి సపోర్ట్ గా చాలా మంది తెలుగు సినీ ప్రముఖులు ఇప్పటికీ సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. అలాగే అర్షద్ ప్రభాస్ కి క్షమాపణ చెప్పి తీరాలి అంటూ ఆగ్రహం కూడా వ్యక్తం చేసారు.

Telugu Heroine Payal Rajput reacted on Prabhas Arshad Warsi Controversy

మరి ఇందులో పాన్ ఇండియా నిర్మాత అభిషేక్ అగర్వాల్ నుంచి తాజాగా శర్వానంద్ వరకు చాలా మంది ఈ కాంట్రవర్సీపై నోరు విప్పారు. కాగా వీరిలో నాచురల్ స్టార్ నాని చేసిన కామెంట్స్ కి బాలీవుడ్ జనం నానిపై విమర్శలు చేస్తూ అర్షద్ చేసిన 'సర్క్యూట్' రోల్ అంటేనే చాలా మందికి తెలుసు అంటూ కామెంట్స్ చేసారు.

కాగా ఇక్కడ నుంచి ఇది కొత్త మలుపు తిరగగా మరి ఇదే సర్క్యూట్ పై కామెంట్స్ చేస్తూ ప్రముఖ హీరోయిన్ అది కూడా కొన్నాళ్ల కితం ప్రభాస్ తో పెళ్లి రూమర్స్ అంటూ వచ్చిన టాలీవుడ్ హీరోయిన్ కూడా నోరెత్తడం జరిగింది. కాగా ఆ హీరోయిన్ ఎవరో కాదు మన టాలీవుడ్ బ్యూటిఫుల్ అండ్ బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. కాగా పాయల్ ప్రభాస్ కాంట్రవర్సీపై చేసిన పోస్ట్ ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.

Telugu Heroine Payal Rajput reacted on Prabhas Arshad Warsi Controversy

ఇందులో అర్షద్ చేసిన "సర్క్యూట్" పాత్ర ప్రభాస్ కల్కి ని ఎప్పటికీ మ్యాచ్ చెయ్యలేదు అంటూ చురకలు అంటించింది. ఇంతేనా కల్కి 2898 ఎడి టైటిల్ కి కూడా లింక్ చేస్తూ 2 వేల 8 వందల 98 ఏళ్ళు అయినా కూడా నీ సర్క్యూట్ రోల్ మ్యాచ్ కాలేదు అర్షద్ దయచేసి నీ మాటలు వెనక్కి తీస్కో అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా చెప్పేసింది. దీనితో పాయల్ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.

రిలీజ్ కి ముందు ప్రభాస్ పెట్టిన ఓ పోస్ట్ పాయల్ కి లింక్ అయ్యేలా ఉందంటూ ఆ మధ్య జరిగిన రచ్చ కోసం అందరికీ తెలిసిందే. దీనితో ఈ ఇద్దరి జంట మధ్య కూడా ఏదో ఉంది అంటూ చాలానే కామెంట్స్ వినిపించాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని అప్పుడు తేలిపోయింది. కానీ ఇప్పుడు పాయల్ ప్రభాస్ కి సపోర్ట్ గా ఇంతలా మాట్లాడ్డం వైరల్ అవుతుంది.

More from Filmibeat

Read more about: prabhas nani arshad warsi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X