ఎంపీగా సంచలన విజయం సాధించిన తెలుగు నటి.. బెంగాల్‌లో చరిత్ర సృష్టించిన చిరంజీవి హీరోయిన్!

తెలుగు సినిమా రంగంలో స్టార్ హీరోయిన్‌గా రాణించిన రచన అలియాస్ రచనా బెనర్జీ పశ్చిమ బెంగాల్ నుంచి పార్లమెంట్ సభ్యురాలిగా ఘన విజయం సాధించింది. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన ఆమె.. బీజేపీ అభ్యర్థిపై ఘన విజయం సాధించింది. ఎవరీ రచన? తెలుగులో ఏ సినిమాల్లో నటించింది. ఏ లోక్‌సభ స్థానం నుంచి గెలుపు సాధించిందనే వివరాల్లోకి వెళితే..

బెంగాల్ సినీ నటిగా కెరీర్ ప్రారంభించిన రచన బెనర్జీ తెలుగు వారికి రచనగా సుపరిచితులు. ప్రముఖ దర్శకులు, స్వర్గీయ ఈవీవీ సత్యనారాయణ ఈమెను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. నేను ప్రేమిస్తున్నాను అనే సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. తన నటనతో ప్రేక్షకులను మెప్పించడంతో వరుస ఆఫర్లు ఆమెను పలకరించాయి.

Telugu Heroine Rachna Banerjee Won Hooghly Lok Sabha from Trinamool Congress MP

హీరోయిన్‌గా రచన తెలుగులో కన్యాదానం, రాయుడు, మావిడాకులు, అభిషేకం, ఛిరంజీవితో కలిసి బావగారు బాగున్నారా? చిత్రంలో నటించారు. ఆ తర్వాత పిల్ల నచ్చింది, సుల్తాన్, పెద్ద మనుషులు, అంత మన మంచికే, అతను, నీతోనే వస్తాను. లాహిరి లాహిరి లాహిరిలో సినిమాల్లో నటించారు. 2002 తర్వాత ఆమె తెలుగు పరిశ్రమకు దూరమయ్యారు.

రచనకు బెంగాళ్ సినీమాల్లో భారీగా ఆఫర్లు రావడం, ఆమె అక్కడే బిజీగా మారిపోవడంతో తెలుగు, తమిళ, ఒడియా సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత సినిమాలు, రాజకీయాల్లో కొనసాగుతూ ఆమె మరింత బిజీ అయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరి క్రీయాశీలకంగా పాత్ర పోషించారు.
తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు.

Telugu Heroine Rachna Banerjee Won Hooghly Lok Sabha from Trinamool Congress MP

పశ్చిమ బెంగాల్‌లో అధికార పార్టీ టీఎంసీ పార్టీలో చేరిన రచన హూగ్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. ఆమె ఈ స్థానం నుంచి సుమారుగా 7,02,744 ఓట్లు సాధించారు. ఆమె తన సమీప ప్రత్యర్థి లాకెట్ చటర్జీపై 76853 ఓట్లతో మెజారిటీతో ఘన విజయం సాధించారు. లాకెట్ చటర్జీకి 6,25,891 ఓట్లు పోలయ్యాయి.

Telugu Heroine Rachna Banerjee Won Hooghly Lok Sabha from Trinamool Congress MP

మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పార్టీకి హుగ్లీ కంచుకోట. ఈ స్థానంలో నెలబెట్టిన దీదీ నమ్మకం వమ్ము కాలేదు. బెంగాల్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న రచనకు ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. ఎంపీగా ప్రజల మనసులను ఎలా గెలుచుకొంటారో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X