Regina Cassandra: రెచ్చిపోయి మరీ గ్లామర్ షో చేసిన రెజీనా.. మత్తెక్కించే అందాలపై మీరూ ఓ కన్నేయండి!
టాలీవుడ్ క్యూట్ బ్యూటీ రెజీనా కసాండ్రా గురించి, ఆమె అందాల గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె 2012లో సినీ రంగంలో అడుగు పెట్టగా.. ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేయగా.. అందులో అదిరిపోయే అందాలు చూపించింది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫొటోల విషయాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
శివ మనసులో శృతి సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈమె ఆ తర్వాత కూడా అనేక చిత్రాలు చేసింది. ముఖ్యంగా మొదటి సినిమాతోనే సైమా బెస్ట్ ఫీమేల్ డీబట్ అవార్డ్ సాదించింది. ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట, పిల్ల నువ్వులేని జీవితం, పవర్, రారా కృష్ణయ్య, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, శంకర, అ, కందనాళ్ ముదల్, అళగియ అసుర, పంచమిత్రం, కేడి రంగా కిలడి బిల్లా, నిర్మయం, రాజతంతిరం, సౌఖ్యం, సూర్యకాంతి, 1945, ఆచార్య, శాకిని డాకిని, కాజల్ కార్తీక, బోర్డర్, నేనే నా వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, భాషల్లోనూ నటించి మెప్పించిందీ బ్యూటీ. 2012 నుంచి ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమె ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. అలాగే తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను వివరిస్తుంటుంది. అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే గ్లామర్ షో చేసింది.
బేబీ పింక్ కలర్ డ్రెస్ లో చాలా అందంగా ముస్తాబై మరీ పొటో షూట్ చేయించుకుంది. అందులో రెజీనా అందాలు చూస్తే ఎవ్వరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే. అల్ట్రా మోడ్రన్ డ్రెస్ లో అదిరిపియే ఫోజులు పెడుతూ.. యమా స్టైలిష్ గా కనిపించింది. నయాగారా ఫాల్స్ లా నడుమును తిప్పేస్తూ తన అందాలన్నీ ఆరబోసింది. రెజీనా కసాండ్రా షేర్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారగా.. అంతా ఫిదా అయిపోతున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
రెజీనా కత్తిలా ఉన్నావంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. అద్భుతమైన అందాలు కల్గిన నీవు తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలంటూ అడుగుతున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా కూడా తరచుగా నీ ఫొటోలు పెడుతూ మమ్మల్ని అలరించండి అంటూ చెప్పుకొస్తున్నారు.


Click it and Unblock the Notifications











