ఈ హీరోయిన్ల ముఖాలు చూసి 10 టికెట్లు తెగుతాయా? మాకేం తక్కువ? తెలుగు హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్
తెలుగు సినిమా పరిశ్రమలో పరభాష హీరోయిన్లకే భారీ ఆఫర్లు దక్కుతున్నాయనే విమర్శలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. ప్రతిభ ఉన్న అవకాశాలు ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తుంటాయి. అయితే విమర్శలు, ఆరోపణలు కొనసాగుతున్నప్పటికీ.. కొందరు తెలుగు వర్ధమాన తారలకు ఆఫర్లు రావడం, వాటిని వినియోగించుకోవడం తెలిసిందే. తాజాగా టాలీవుడ్‌లో ఇద్దరు టాప్ హీరోయిన్లను ఉద్దేశించి ఓ తెలుగు అమ్మాయి పోస్టు పెట్టడం వైరల్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే..
తెలుగు సినిమా పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు గుర్తింపు లేదు. ప్రతిభ ఉన్నా వారిని పట్టించుకోవడం లేదు. ఇతర భాషల నుంచి దిగుమతి చేసుకొంటున్నారు. స్థానిక, ఔత్సాహిక అమ్మాయిలకు ప్రోత్సహిస్తే ప్రతిభ ఉన్న హీరోయిన్లు ఇండస్ట్రీకి లభిస్తారు అంటూ గతంలో శ్రీరెడ్డి తదితరులు ఘాటైన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.

ఇటీవల కాలంలో కొంత మార్పు కనిపిస్తున్నది. బేబీ మూవీతో వైష్ణవీ చైతన్య, రాజధాని, రివైండ్ లాంటి సినిమాలతో అమృతా చౌదరీ లాంటి అమ్మాయిలు తమ ప్రతిభను నిరూపించుకొంటూ అవకాశాలను అందిపుచ్చుకొంటున్నారు. అయితే ఊహించినంతగా ఈ సంఖ్య కనిపించడం లేదు. పలువురు సినిమా ఆఫీసులకు చుట్టూ తిరిగినా అవకాశాలు లభించడం లేదనే వాదన వినిపిస్తున్నది.
తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాణించాలని అనుకొంటున్న యువ నటి రేఖా బోజ్ ఇటీవల ఆసక్తికరమైన పోస్టు సోషల్ మీడియాలో పెట్టారు. ఇటీవల ప్రారంభమైన నాగబంధం అనే సినిమా గురించి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో యువ హీరో విరాట్ కర్ణకు జంటగా నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ల గురించి ఘాటుగా కామెంట్ చేయడం చర్చనీయాంశమైంది.
ఫేస్‌బుక్‌లో రేఖ బోజ్ పెట్టిన పోస్టు ప్రకారం.. నభా నటేష్, ఐశ్వర్య మీనన్‌ను ఉద్దేశించి.. వీళ్ల వల్ల 10 టికెట్లు కూడా ఎక్స్‌ట్రా తెగవు. అయినా ఇలాంటి చిన్న ప్రాజెక్టులకు తెలుగు అమ్మాయిలను కాదని.. ఫ్లయిట్ టికెట్స్, హోటల్ బిల్స్, భారీగా రెమ్యునరేషన్లు ఇచ్చి ఇలాంటి వాళ్లను తీసుకొంటున్నారు. ఇది మన ఖర్మ. ఇంకా మరో జన్మ ఎత్తినా మన నిర్మాతలు, దర్శకులు మారరు అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.
తెలుగు ఇండస్ట్రీలో యువ హీరోలు సుహాస్, కిరణ్ అబ్బవరం, రాజ్ తరుణ్, సంతోష్ శోభన్ లాంటి హీరోల పక్కన తెలుగు అమ్మాయిలకు అవకాశాలు దక్కడం లేదు. వీళ్లే ఆఫర్లు ఇవ్వకపోతే మన వర్థమాన తారలకు ఎవరు అవకాశం ఇస్తారు అని ఆమె కామెంట్ చేసింది. ప్రస్తుతం పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











