500 కోట్ల ఆర్థిక కుంభకోణంలో తెలుగు హీరోయిన్.. సమన్లు జారీ చేసిన పోలీసులు!
తెలుగు సినిమా రంగంతోపాటు బాలీవుడ్‌లో రాణిస్తున్న యువ హీరోయిన్ రియా చక్రవర్తి మరో భారీ కుంభకోణంలో ఇరుక్కుపోయారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న 500 కోట్ల రూపాయల స్కామ్‌లో ఆమెకు పోలీసులు సమన్లు జారీ చేశారు. ఎంతో మంది ఇన్వెస్టర్లను మోసగించిన ఐబాక్స్ కేసులో విచారణకు హాజరుకావాలని సమన్లలో పేర్కొన్నారు. ఈ కేసులో చాలా మంది సినీ తారల పేర్లు బయటకు వచ్చాయి. ఈ కేసు వివరాల్లోకి వెళితే..
పెట్టుబడులు పెట్టే కస్టమర్లకు తక్కువ కాలంలో రెట్టింపు లాభాలను అందిస్తామనే ఆశజూపిన హైబిక్స్ అనే సంస్థ యాప్‌ను 2024 సంవత్సరంలో ప్రారంభించింది. సంస్థ నిర్వాహకులు వెల్లడించిన సమాచారాన్ని నమ్మిన కస్టమర్లు సుమారు 30 వేల మంది ఆ యాప్‌లో రిజిస్టర్ చేసుకొన్నారు. అయితే చాలా మంది పెట్టుబడులను దుర్వినియోగం చేయడమే కాకుండా 500 కోట్ల మేర నిధుల దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో కేసు నమోదైంది.

Photo Courtesy: https://www.instagram.com/rhea_chakraborty/
చెన్నైకి చెందిన శివరామ్ అనే వ్యక్తి ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా నిర్ణయించారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించడంతో పలువురు సినీ తారలు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు పేర్లు బయటకు వచ్చాయి. ఈ కేసులో కమెడియన్ భారతీ సింగ్, యూట్యూబర్ ఎల్వీష్ యాదవ్ తదితరులకు సమన్లు జారీ చేసి విచారించారు.
ఈ కేసు గురించి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హేమంత్ తివారీ మాట్లాడుతూ.. ప్రతీ రోజు ఒక శాతం నుంచి 5 శాతం వరకు లాభాలను పంచి పెడుతాం. నెలకు 90 శాతం రిటర్న్స్ ఉంటాయి అని ఆశచూపారు. ఈ వ్యవహారంలో రకరకాల సాంకేతిక లోపాలు, పన్ను ఎగవేత అంశాలు, న్యాయపరమైన లొసుగులు ఉన్నాయి అని తెలిపారు.
బాధితుడు చేసిన ఫిర్యాదు ఆధారంగా సినీ నటి రియా చక్రవర్తి, యూట్యూబర్లు సౌరవ్ జోషి, అభిషేక్ మల్హన్, పురవ్ ఝా, ఎల్వీష్ యాదవ్, భారతీ సింగ్, హర్ష్ లింబాచియా, లక్షయ్ చౌదరీ, ఆదర్ష్ సింగ్, అమిత్, దిల్ రాజ్ సింగ్ రావత్ తదితరుల పేర్లు బయటకు వచ్చాయి. ఇంకా ఈ కేసులో చాలా మంది సినీ ప్రముఖులు ఉన్నారనే విషయం ప్రచారంలో ఉంది.
రియా చక్రవర్తి కెరీర్ విషయానికి వస్తే.. తూనీగ తూనీగ అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అనంతరం పలు తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించారు. అనంతరం హిందీ సినిమా రంగంలో బిజీ అయ్యారు. అయితే బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో అఫైర్ కొనసాగించారు. అయితే సుశాంత్ మరణం కేసులో రియాపై అనేక అనుమానాలు వచ్చాయి. ఆమెపై పలు కేసులు నమోదు కావడం, విచారణను కూడా ఆమె ఎదుర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications











