Don't Miss!
- News కోనసీమ జిల్లాలో జనసేన ఖాళీ.. మరో నేత రాజీనామా
- Sports చరిత్ర సృష్టించిన ధోనీ.. ఒకే ఒక్కడు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మాలీవుడ్‌లో దుమ్ము దులుపుతున్న తెలుగు హీరోయిన్.. ఒక్క సినిమాతోనే.
ఆమె ఒక తెలుగు హీరోయిన్. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగింది. అయినా తెలుగు సినిమాల్లో అవకాశాలు రావడం లేదు. కానీ, ఇతర భాషల్లో మాత్రం బిజీగా గడుపుతోంది. ఆమె ఎవరో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆమె మరెవరో కాదు.. 'పెళ్లి చూపులు' ఫేం రీతూ వర్మ. హీరోయిన్గా చేసిన తొలి సినిమాలోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ తెలుగు నటి.. ఆ సినిమాలో చేసిన నటనకు గానూ ఎన్నో అవార్డులను దక్కించుకుంది. అయితే, ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో మెరిసినప్పటికీ అవకాశాలను దక్కించుకోవడంలో విఫలమైంది.
అదే సమయంలో విక్రమ్ - గౌతమ్ మీనన్ కాంబినేషన్లో తీద్దామనుకున్న 'ధృవనక్షత్రం' కోసం కోలీవుడ్‌కు వెళ్లింది. అయితే, ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఇక, అటు నుంచి అటే కేరళ వెళ్లిపోయిన రీతూ వర్మ.. మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ చేస్తున్న తాజా మలయాళ చిత్రం 'కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాల్'లో నటిస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయిపోయింది. దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా ఇటీవల విడుదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రితూ వర్మ మంచి పాత్రను పోషించినట్లు తెలుస్తోంది. ఇందులో దర్శకుడు గౌతమ్ మీనన్ కూడా కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదే సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్‌కు 'కనులు కనులను దోచాయంటే' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అలాగే, ఈ సినిమాను తమిళ్లో కూడా విడుదల చేస్తున్నారు. దీన్ని దేసింగ్ పెరియసామి తెరకెక్కించారు. ఇది దుల్కర్‌కి 25వ సినిమా కావడం విశేషం. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే.. రితూ వర్మ మాలీవుడ్‌లో మరికొన్ని చిత్రాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలు ఉన్నాయని వాటికి ఓకే చెబితే రితూ అక్కడ బిజీ అయిపోవడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది.