twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాలీవుడ్‌లో దుమ్ము దులుపుతున్న తెలుగు హీరోయిన్.. ఒక్క సినిమాతోనే.

    |

    ఆమె ఒక తెలుగు హీరోయిన్. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగింది. అయినా తెలుగు సినిమాల్లో అవకాశాలు రావడం లేదు. కానీ, ఇతర భాషల్లో మాత్రం బిజీగా గడుపుతోంది. ఆమె ఎవరో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆమె మరెవరో కాదు.. 'పెళ్లి చూపులు' ఫేం రీతూ వర్మ. హీరోయిన్‌గా చేసిన తొలి సినిమాలోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ తెలుగు నటి.. ఆ సినిమాలో చేసిన నటనకు గానూ ఎన్నో అవార్డులను దక్కించుకుంది. అయితే, ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో మెరిసినప్పటికీ అవకాశాలను దక్కించుకోవడంలో విఫలమైంది.

    అదే సమయంలో విక్రమ్ - గౌతమ్ మీనన్ కాంబినేషన్‌లో తీద్దామనుకున్న 'ధ‌ృవనక్షత్రం' కోసం కోలీవుడ్‌కు వెళ్లింది. అయితే, ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఇక, అటు నుంచి అటే కేరళ వెళ్లిపోయిన రీతూ వర్మ.. మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్‌ చేస్తున్న తాజా మలయాళ చిత్రం 'కన్నుమ్‌ కన్నుమ్‌ కొల్లైయడిత్తాల్‌'లో నటిస్తోంది.

    telugu heroine Ritu Varma busy in Mollywood

    ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయిపోయింది. దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా ఇటీవల విడుదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రితూ వర్మ మంచి పాత్రను పోషించినట్లు తెలుస్తోంది. ఇందులో దర్శకుడు గౌతమ్ మీనన్ కూడా కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

    ఇదే సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్‌కు 'కనులు కనులను దోచాయంటే' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అలాగే, ఈ సినిమాను తమిళ్‌లో కూడా విడుదల చేస్తున్నారు. దీన్ని దేసింగ్‌ పెరియసామి తెరకెక్కించారు. ఇది దుల్కర్‌కి 25వ సినిమా కావడం విశేషం. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే.. రితూ వర్మ మాలీవుడ్‌లో మరికొన్ని చిత్రాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలు ఉన్నాయని వాటికి ఓకే చెబితే రితూ అక్కడ బిజీ అయిపోవడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది.

    English summary
    telugu heroine Ritu Varma busy in Mollywood
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X