తెలుగు హీరోయిన్ పరువాల ప్రదర్శన.. మొహమాటం లేకుండా మొత్తం కనిపించేలా!
సినిమా వచ్చిన కొత్తలో తెలుగు భామలు ఎంతో మంది హీరోయిన్లుగా హవాను చూపించారు. కానీ, ఆ తర్వాత మాత్రం మన వాళ్లు నార్త్ అమ్మాయిలకే మొగ్గు చూపడంతో లోకల్ బ్యూటీలు అంతగా రాలేదు. కానీ, ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీలో ఎంతో మంది తెలుగు అమ్మాయిలు సందడి చేస్తున్నారు. అందులో రీతూ వర్మ ఒకరు. ఆరంభం నుంచే తనదైన అందం, అభినయంతో మెప్పిస్తోన్న ఈ పిల్ల.. వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. ఇక, సోషల్ మీడియాలోనూ రీతూ వర్మ హడావిడి చేస్తోంది. ఇలా ఇప్పుడు కొన్ని ఫొటోలను షేర్ చేసేసింది. వాటిపై మీరు కూడా లుక్కేయండి మరి!
క్యారెక్టర్స్ నుంచి హీరోయిన్:సినిమాల మీద ఉన్న మక్కువతో రీతూ వర్మ 'బాద్‌షా' చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్' సహా ఎన్నో సినిమాల్లో అదిరిపోయే నటనతో మెప్పించింది. అంతేకాదు, ఈ బ్యూటీ ఒక్కసారిగా అందరి దృష్టిలో పడిపోయింది. ఈ క్రమంలోనే రీతూ 'పెళ్లి చూపులు' చిత్రంతో సోలో హీరోయిన్‌గా మారింది. ఈ చిత్రంతో ఆమె పేరు మారుమ్రోగింది.

తమిళ మూవీతో సెన్సేషన్:సినిమాల్లోకి ఎంటరైన కొత్తలోనే మంచి గుర్తింపును సొంతం చేసుకున్న రీతూ వర్మ.. ఆ తర్వాత వరుసగా సినిమాల మీద సినిమాలు చేసింది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అవడంతో పాటు ఆఫర్లనూ దక్కించుకుంది. కానీ, ఎంతో కాలం ప్రభావం చూపని ఆమె.. తమిళంలోకి వెళ్లి దుల్కర్‌తో 'కనులు కనులను దోచాయంటే' అనే సినిమా చేసి సెన్సేషన్ అయిపోయింది.

తెలుగులో అలా.. హిట్‌తో:రీతూ వర్మ తెలుగు, తమిళంలోనూ ఎన్నో చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో 'నిన్నిలా నిన్నిలా', 'టక్ జగదీష్', 'వరుడు కావలెను' వంటి చిత్రాల్లో నటించింది. కానీ, ఇవేమీ ఆమెకు విజయాన్ని మాత్రం అందించలేదు. ఈ పరిస్థితుల్లో శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' మూవీతో రీతూ హిట్ ట్రాక్ ఎక్కింది. దీంతో ఆమె కెరీర్ ఊపందుకుంది.

ఆ సినిమాలతో ఫుల్ బిజీ:రీతూ వర్మకు 'ఒకే ఒక జీవితం' తర్వాత తెలుగులో మూవీ సైన్ చేయకపోయినా.. తమిళంలో మాత్రం 'నితమ్ ఓరు ఓనమ్' అనే తమిళం చిత్రం చేసింది. ఇప్పుడు అదే భాషలో 'మార్క్ అంటోనీ'లో నటించింది. ఇది ఆమె కెరీర్‌లో బిగ్ హిట్‌గా నిలిచింది. అలాగే రీతూ వర్మ.. చియాన్ విక్రమ్ సరసన 'ధృవ నక్షత్రం'తో పాటు శ్రీ విష్ణుతో 'స్వాగ్' అనే మూవీని చేస్తోంది.
అక్కడ ఫుల్ యాక్టివ్‌గానే:తెలుగు, తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న రీతూ వర్మ.. సోషల్ మీడియాలో సైతం ఫుల్ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ అమ్మడు ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలను, వీడియోలను సైతం షేర్ చేస్తూ క్రేజ్‌ను మరింతగా పెంచుకుంటోంది.

అందాలతో మైమరపిస్తూ:తెలుగు అమ్మాయి రీతూ వర్మ సోషల్ మీడియాలో ఎంతో కాలంగా హల్చల్ చేస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్‌తో కవ్విస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన అందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వదులుతోంది. దీంతో రీతూ వర్మ పేరు ట్రెండింగ్‌లో నిలిచి తరచూ సెన్సేషన్‌గా మారిపోతోంది.
రీతూ వర్మ పిక్స్ వైరల్:యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ రీతూ వర్మ తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె ట్రాన్స్‌పరెంట్ డ్రెస్ ధరించి బాడీ షో చేస్తూ రెచ్చిపోయింది. ఫలితంగా ఈ హీరోయిన్ లేలేత అందాలు ఓ రేంజ్‌లో హైలైట్ అవుతున్నాయి. దీంతో రీతూ వర్మ షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇవన్నీ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











