గ్లామర్ గేట్ లేపేసిన తెనాలి అమ్మాయి.. చీరకట్టుతో కనికట్టు చేస్తున్న శోభితా
ఆకట్టుకునే అందం, అదిరిపోయే నటన, అబ్బురపరిచే హావభావాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న బ్యూటీ శోభితా ధూళిపాళ్ల. పేరుకు తెలుగు అమ్మాయే అయినా ఇక్కడి కంటే ఉత్తరాదిలోనే ఎక్కువగా పేరు సంపాదించుకున్న ఈ పిల్ల.. అక్కడ వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. అప్పుడప్పుడూ సౌత్ ఇండస్ట్రీల్లోనూ మెరుస్తోంది. మరీ ముఖ్యంగా శోభితా ధూళిపాళ్ల సోషల్ మీడియాలో యమ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు కొన్ని బోల్డు ఫొటోలను పంచుకుంది. వాటిపై మీరూ ఓ కన్నేయండి మరి!
మిస్ ఇండియా పోటీలతో:హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే శోభిత ధూళిపాళ్ల మోడల్‌గా ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే 2013లో జరిగిన మిస్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొని రెండో స్థానం సొంతం చేసుకుంది. అలాగే, అదే ఏడాది జరిగిన మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది. అదే సమయంలో ఆమె ప్రపంచ స్థాయి గుర్తింపు పొందింది.

హీరోయిన్‌గా... తెలుగులో:మోడలింగ్ రంగంలో సత్తా చాటిన శోభిత 'రామన్ రాఘవ్ 2.0' అనే హిందీ చిత్రం ద్వారా నటిగా ఎంటరైంది. ఆ తర్వాత 'చెఫ్', 'కళాకంది' వంటి బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలోనే అడివి శేష్ హీరోగా నటించిన 'గూఢచారి' మూవీతో శోభిత ధూళిపాళ్ల టాలీవుడ్‌లోకి ఎంటరైంది. ఇందులో అందం, అభినయంతో విశేషమైన గుర్తింపును దక్కించుకుంది.
ఇక్కడ లేవు.. అక్కడ ఫుల్:తెలుగులో హీరోయిన్‌గా చేసిన 'గూఢచారి' హిట్ అయినా శోభితకు పెద్దగా అవకాశాలు మాత్రం దక్కలేదు. కానీ, ఆ తర్వాత మలయాళం, హిందీ, తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించి సత్తా చాటింది. మళ్లీ 'మేజర్'తో తళుక్కున మెరిసినా మన వాళ్లు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో తమిళంలో 'పొన్నియన్ సెల్వన్' మూవీలతో పాటు 'సితార' అనే హిందీ చిత్రంలో చేసింది.

సిరీస్‌లో.. చైతూతో ట్రాక్:ఆ మధ్య హిందీలో శోభిత ధూళిపాళ్ల 'ది నైట్ మేనేజర్' అనే సిరీస్‌లో నటించింది. ఇందులో ఆమె అదిరిపోయే హాట్ షో చేసింది. అలాగే, రొమాంటిక్ సీన్స్‌లోనూ నటించింది. ఇక, ఇప్పుడు ఈ సిరీస్ సీక్వెల్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులోనూ యమా రెచ్చిపోయింది. ఇక, అక్కినేని నాగ చైతన్యతో శోభిత ధూళిపాళ్ల డేటింగ్‌లో ఉందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.

అక్కడ మాత్రం యాక్టివ్:సౌత్ అమ్మాయే అయినా నార్త్‌లో సత్తా చాటుతూ వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న శోభిత ధూళిపాళ్ల.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. తద్వారా ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేసేస్తోంది.

గ్లామర్ ట్రీట్‌తో తగ్గట్లేదు:తెనాలి అమ్మాయి శోభిత ధూళిపాళ్ల సుదీర్ఘ కాలంగా హడావిడి చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. తద్వారా ఈ బ్యూటీ తరచూ ట్రెండ్ అవుతూ సెన్సేషన్‌గా మారిపోయింది.

చీరలోనే శోభిత కనికట్టు:హాట్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె చీరకట్టులోనూ విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ కనిపించింది. దీంతో ఆమె అందాలు కుర్రకారును రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా శోభిత ధూళిపాళ్ల తాజాగా షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇవి వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











