42 ఏళ్ల వయసులో నాటీ ఫోజులతో హీటెక్కిస్తున్న తెలుగు హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

ఈ మధ్య కాలంలో హీరోహీరోయిన్లతో పాటు సామాన్య ప్రజలు కూడా తమ అందాలపై పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. వయసు తగ్గినట్లుగా కనిపించేందుకు అనేక డైటింగ్ లు, జిమ్ లో కసరత్తులు చేస్తూ రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా 40 నుంచి 50 ఏళ్లు.. ఆ పైబడిన వారతై చిన్నగా కనిపించేందుకు చాలానే ట్రై చేస్తున్నారు. అయితే అలాంటి ఓ అమ్మాయే తన అందాలను పెంచుకుంటూ.. వయసు తగ్గించుకుంటూ సోషల్ మీడియా వేదికగా తెగ రచ్చ చేస్తోంది. ప్రస్తుతం 42 ఏళ్ల వయసు కల్గిన ఈమె పదహారేళ్ల పడుచు పిల్లలా కనిపిస్తూ.. తన గ్లామర్ తో కుర్రకారను కట్టి పడేస్తోంది. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

2006లో పోయి సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిన విమలా రామన్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె తొలి చిత్రంతోనే తన అందం, అభినయం కనబర్చి అందరి చేత ఆహా అనిపించుకుంది. ఆ తర్వాతి సంవత్సరమే మలయాళంలో టైం అనే సినిమా చేసి విపరీతమన గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత నుంచి ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. తెలుగుతో పాటు మలయాళ భాషలోనూ అనేక చిత్రాలు చేసిందీ క్యూట్ బ్యూటీ.

Telugu Heroine Vimala Raman Beautiful Glamour Show Photos Goes Viral

ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ తెలుగులో వరుణ్ సందేశ్ హీరోగా చేసిన ఎవరైనా ఎపుడైనా సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలవడంతో.. విమలా రామన్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత జగపతి బాబుతో కలిసి గాయం 2 సినిమాలో నటించి మెప్పించింది. ఇందులో జగ్గూ భాయ్ తో కలిసి విపరీతమైన రొమాన్స్ చేసింది. ఇక ఆ తర్వాత నుంచి విమలా రామన్ కు కుర్రకారు ఫాలోయింగ్ పెరిగిపోయింది.

Telugu Heroine Vimala Raman Beautiful Glamour Show Photos Goes Viral

కేవలం ఈ రెండు సినిమాలే కాకుండా రంగ ది దొంగ, రాజ్, చట్టం, కులుమనాలీ, నువ్వా నేనా, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, ఓం నమో వేకంటేశాయ, రుద్రంగి, గాండీవదారి అర్జున వంటి చిత్రాల్లో నటించింది. ఇలా అనేక సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. ఓవైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన అద్భుతమైన ఫొటోలతో పాటు తనకు సంబంధించిన పర్సనల్, ప్రఫెషనల్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ అతి చిన్న స్కిన్ టైట్ డ్రెస్ వేసుకుని సోకులు ఆరబోసింది. మెరుస్తూ ఉండే ఈ డ్రెస్ లో విమలా రామన్ అందాలు విపరీతంగా హైలెట్ అయ్యాయి. ఈ ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. నీ అందాలను తట్టుకోలేకపోతున్నామని కొందరు.. ఇంత వయసు వచ్చినా అందాలు మాత్రం అస్సలే తగ్గట్లేదంటూ మరికొందరు తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ క్యూట్ బ్యూటీ అందాలపై ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X