వలలో జలకన్యలా వితికా షేరు.. వరుణ్ సందేశ్ భార్య పరువాల ప్రదర్శన
మిగిలిన అన్ని భాషలతో పోల్చుకుంటే ఒక్క తెలుగులోనే లోకల్ అమ్మాయిలు పెద్దగా రాణించడం లేదు. ఆ మధ్య కొందరు హీరోయిన్లుగా వచ్చినా ఎంతో ప్రభావాన్ని చూపించలేదు. అలాంటి వారిలో భీమవరం పిల్ల వితిక షేరు ఒకరు. అందానికి అందం, నటనకు నటన కనబరిచే సత్తా ఉన్నా.. ఈ అమ్మడు ఎందుకో పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చేసింది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం బాగానే సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే వితిక షేరు తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. ఆలస్యం చేయకుండా వాటిని మీరే చూసేయండి మరి!
తెలుగు భామ కన్నడంలోనే
ఆంధ్రాకు చెందిన వితిక షేరు సినిమాల్లోకి రావడానికి ముందే మోడలింగ్ రంగంలో సత్తాను చాటుకుంది. అయితే, ఇక్కడ కాకుండా కన్నడంలో 'అంతు ఇంతు ప్రీతి బంతు' అనే చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయింది. దీని తర్వాత అక్కడే 'ఉల్లాస ఉత్సాహ' అనే చిత్రంలోనూ చేసింది. తద్వారా తెలుగు అమ్మాయే అయినా కన్నడంలో ఫుల్ ఫేమస్ అయిపోయింది.

టాలీవుడ్‌లో ఆ సినిమాలతో
కన్నడంలో నటిగా మంచి గుర్తింపును తెచ్చుకున్న తర్వాత వితిక 'ప్రేమించే రోజుల్లో' అనే చిత్రంతో తెలుగులోకి ఎంటరైంది. ఆ తర్వాత వరుసగా 'సందడి', 'జుమ్మంది నాదం', 'భీమిలి కబడ్డీ జట్టు', 'ప్రేమ ఇష్క్ కాదల్' వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. ఈ క్రమంలోనే 'పడ్డానండీ ప్రేమలో మరి' చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయింది.

వరుణ్ సందేశ్‌ను పెళ్లాడి
'పడ్డానండీ ప్రేమలో మరి' సినిమా చేస్తున్న సమయంలోనే హీరో వరుణ్ సందేశ్‌తో వితిక షేరు ప్రేమలో పడిపోయింది. ఆ తర్వాత వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత వీళ్లిద్దరూ బిగ్ బాస్ షోలోకి జంటగా ఎంట్రీ ఇచ్చారు. అందులో తరచూ రొమాన్స్ చేస్తూ పాపులర్ అయ్యారు. ఈ సీజన్‌లో వరుణ్ ఫినాలేలోకి వెళ్లినా.. వితికా మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయింది.
రీఎంట్రీ.. అలాంటి రోల్స్
హీరోయిన్‌గా వరుస పెట్టి ఆఫర్లను అందుకుంటోన్న సమయంలోనే వితిక షేరు.. వివాహం తర్వాత మాత్రం పెద్దగా అవకాశాలను సొంతం చేసుకోలేదు. కానీ, యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఫ్యాన్స్‌ను మాత్రం అలరిస్తూనే ఉండేది. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితమే విడుదలైన 'పెళ్లిసందD' సినిమాలో వితిక షేరు రీఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఆమెకు క్రేజీ రోల్స్ వస్తున్నాయి.

సోషల్ మీడియాతో ఖుషీ
చాలా ఏళ్ల పాటు సినీ రంగంలో వరుస సినిమాలతో సందడి చేసిన.. వితిక షేరు సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే తన అభిమానులను ఓ రేంజ్‌లో అలరిస్తోంది. మరీ ముఖ్యంగా తరచూ తనకు, తన వృత్తికి, తన వైవాహిక జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తద్వారా ఫాలోవర్లను ఖుషీ చేసేస్తోంది.
సినిమాలకు భిన్నంగానే
చాలా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోయిన్‌గా నటించినా వితిక షేరు పెద్దగా అందాలను ఆరబోయలేదు. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బోల్డు షోతో రచ్చ లేపుతోంది. ఇందులో భాగంగానే తరచూ క్లీవేజ్ షో చేసే ఫొటోలు, వీడియోలను వదులుతూ వస్తోంది. ఫలితంగా వితిక క్రేజ్ అంతకంతకూ పెరగడంతో పాటు సంచలనంగా మారిపోతోంది.
నెట్ డ్రెస్‌లో వితిక షేరు
తాజాగా వితిక షేరు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె నెట్ డ్రెస్ వేసుకుని మరీ దర్శనమిచ్చింది. దీంతో ఆమె లోపలి అందాలు చూపరులకు బాగా కనువిందు చేస్తూ రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. ఫలితంగా ఇవి చాలా తక్కువ సమయంలోనే వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











