twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR: అలియా భట్‌కు తెలుగు కష్టాలు.. ఆ ముగ్గురిలో రాజమౌళి ఒకరు!

    |

    అందం, టాలెంటుతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్న అలియా భట్ బాలీవుడ్ చిత్రసీమలో వరుస విజయాలు అందుకుంటూ దూసుకెళుతోంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'RRR' ద్వారా అలియా భట్ త్వరలో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె రామ్ చరణ్‌కు జోడీగా కనిపించబోతున్నారు.

    'RRR' మూవీ కోసం అలియా భట్ ఇప్పటికే తన ప్రిపరేషన్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ఆమె తెలుగు నేర్చుకుంటోంది. ప్రతి రోజూ ఒక గంట పాటు ఆన్ లైన్లో క్లాసులు వింటోందట. అయితే తాను ఇప్పటి వరకు ఎప్పుడూ వినని లాంగ్వేజ్ కావడంతో నేచ్చుకోవడానికి చాలా కష్టపడుతోంది.

    అలియా భట్‌కు తెలుగు కష్టాలు

    అలియా భట్‌కు తెలుగు కష్టాలు

    ఓ ప్రముఖ ఆంగ్లపత్రికతో అలియా భట్ మాట్లాడుతూ... ‘తెలుగు నేర్చుకోవడం ఒక సవాల్. అది చాలా కష్టంగా ఉంది. కానీ ఇది చాలా ఎక్స్‌ప్రెసివ్ లాంగ్వేజ్. పదాలు ఎలా పలకాలో నేర్చుకుంటున్నాను. దీని ద్వారా రేపు షూటింగ్ సమయంలో డైలాగులు పలకడం ఈజీ అవుతుంది' అని తెలిపారు.

    త్వరలో సెట్స్‌లోకి అలియా భట్

    త్వరలో సెట్స్‌లోకి అలియా భట్

    RRR మూవీ షూటింగ్ ఇటీవలే రద్దయిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కాలికి గాయం కావడమే ఇందుకు కారణం. మెగా పవర్ స్టార్ కోలుకుని షూటింగ్ మొదలైన తర్వాత అలియా భట్ కూడా సెట్స్‌లో జాయిన్ కాబోతున్నారు.

    ఆ ముగ్గురిలో రాజమౌళి ఒకరు

    ఆ ముగ్గురిలో రాజమౌళి ఒకరు

    RRR మూవీలో తనకు అవకాశం దక్కడంపై అలియా భట్ చాలా సంతోషంగా ఉన్నారు. ‘నేను హీరోయిన్‌గా కెరీర్ మొదలు పెట్టిన సమయంలో ముగ్గురు దర్శకులతో తప్పకుండా పని చేయాలని అనుకున్నాను. అందులో ఒకరైన కరణ్ జోహార్ స్వయంగా నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. నేను కోరుకున్న మరో ఇద్దరు సంజయ్ లీలా బన్సాలీ, రాజమౌళి.. వారితో కూడా పని చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది' అని అలియా భట్ తెలిపారు.

    పూర్తి కల్పిత కథతో

    పూర్తి కల్పిత కథతో

    RRR మూవీ విషయానికొస్తే... రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి భారీ బడ్జెట్ చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నారు. డివివి దానయ్య దాదాపు రూ. 350 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్... అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీంగా కనిపిస్తారు. పూర్తి కల్పిత కథతో ఈ చిత్రం ఉంటుందని, 1920 నాటి బ్యాక్ డ్రాపుతో సినిమా సాగుతుందని రాజమౌళి తెలిపారు.

    హీరోయిన్ ఔట్

    హీరోయిన్ ఔట్

    RRR చిత్రానికి ఎన్టీఆర్‌కు జోడీగా ఎంపికైన బ్రిటిష్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్... అనుకోని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. త్వరలోనే మరో నటిని ఫైనల్ చేసిన తర్వాత చిత్ర బృందం అఫీషియల్‌గా ప్రకటించనుంది.

    English summary
    Speaking to a leading English daily, Alia Bhatt said, "It is a challenge, yes, I can't deny that. Telugu is a tough language to learn. But it's a very expressive language. I want to understand the nuances of the language, why certain words are pronounced the way they are, and what they convey. Only then will I be able to express my character's feelings."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X